సరికొత్త ఎస్ఎక్స్4 సెడాన్‌ను అభివృద్ధి చేస్తున్న మారుతి
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి దేశీయ విపణిలో అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ ఎస్ఎక్స్4లో ఓ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎస్ఎక్స్4 సెడాన్ కన్నా మరింత మెరుగైన డిజైన్, ఆకర్షనీయమైన లుక్, విలాసవంతమైన ఫీచర్లతో కొత్త మోడల్ మార్కెట్లోకి రానుంది. 'వైఎల్1' (YL1) అనే కోడ్ నేమ్‌తో ప్రస్తుతం ఓ కొత్త వెర్షన్ ఎస్ఎక్స్4 సెడాన్‌ను మారుతి సుజుకి తమ మానేసర్ ప్లాంటులో అభివృద్ధి చేస్తుంది.
సరికొత్త ఫ్రంట్ డిజైన్, కొత్త గ్రిల్ మొదలైన ఎక్స్టీరియర్ మార్పులతో పాటుగా మరిన్ని అధనపు ఫీచర్లను జోడించుకొని రానున్న కొత్త ఎస్ఎక్స్4లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో ఇతర కార్ మేకర్ల నుండి ప్రవేశిస్తున్న కొత్త మోడళ్లను ధీటుగా ఎదుర్కునేందుకే మారుతి సుజుకి ఈ సరికొత్త ఎస్ఎక్స్4 మోడల్‌ను అభివృద్ధి చేస్తుంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎస్ఎక్స్4 సెడాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. పెట్రోల్ వేరియంట్ ఎస్ఎక్స్4లో ఉపయోగించిన 1586సీసీ ఇంజన్ 104.7 పిఎస్‌ల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వేరియంట్ ఎస్ఎక్స్4లో ఉపయోగించిన 1248సీసీ ఇంజన్ 90 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. పెట్రోల్ వేరియంట్ ఎస్ఎక్స్4 సెడాన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (జెడ్ఎక్స్ఐ వేరియంట్)లతో లభిస్తుండగా డీజిల్ వేరియంట్ కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే లభ్యమవుతుంది.
ప్రస్తుతం రాష్ట్ర మార్కెట్లో లభిస్తున్న మారుతి సుజుకి ఎస్ఎక్స్4 వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
* Maruti SX4 VXI (BSIV) - Rs 741480.51
* Maruti SX4 GREEN VXI - Rs 801262.65
* Maruti SX4 ZXI MT (BSIV) - Rs 821169.55
* Maruti SX4 VDI - Rs 847439.25
* Maruti SX4 ZXI MT, Leather (BSIV) - Rs 857308.89
* Maruti SX4 ZXI AT (BSIV) - Rs 897954.10
* Maruti SX4 ZXI AT Leather (BSIV) - Rs 934093.44
* Maruti SX4 ZDI - Rs 938497.29
* Maruti SX4 ZDI, Leather - Rs 973767.11
అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్ హైదరాబాద్.


Click it and Unblock the Notifications









