లిమిటెడ్ ఎడిషన్ ఏ-స్టార్ ఆక్టివ్‌ను విడుదల చేసిన మారుతి
దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న పెట్రోల్ కారు ఏ-స్టార్ హ్యాచ్‌బ్యాక్‌లో 'ఏ-స్టార్ ఆక్టివ్' (A-Star Aktiv) కంపెనీ ఓ కొత్త లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఏ-స్టార్‌తో పోల్చుకుంటే ఈ లిమిటెడ్ ఎడిషన్ ఏ-స్టార్ ఆక్టివ్‌లో 14 అధనపు ఫీచర్లను కంపెనీ జోడించింది. ఇది విఎక్స్ఐ మ్యాన్యువల్, విఎక్స్ఐ ఆటోమేటిక్ వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతుంది.
యువతను లక్ష్యంగా చేసుకొని మారుతి సుజుకి అందిస్తున్న ఏ-స్టార్ కారులో మరింత స్టయిలిష్, కంఫర్ట్, స్పోర్టీ వెర్షనే ఈ లిమిటెడ్ ఎడిషన్ ఏ-స్టార్ ఆక్టివ్. ఇందులో సరికొత్త బాడీ గ్రాఫిక్స్ (ఫ్రంట్, రియర్, సైడ్, రూఫ్‌లపై), ఏ-స్టార్ ఆక్టివ్ లోగో, ఎరుపు రంగు సైడ్ మిర్రర్ (రెడ్ ఓవిఆర్ఎమ్), రెడ్ స్పాయిలర్, రెడ్ బంపర్, బి-పిల్లర్‌పై బోల్డ్ బ్యాక్ అవుట్ ఫిల్మ్, బ్రైట్ రెడ్ ఫాగ్ ల్యాంపోవర్ ప్లేట్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను గమనించవచ్చు. ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో కొత్త స్టయిలిష్ సీట్ కవర్స్, స్లీక్ స్టీరింగ్ వీల్ కవర్, క్లాసీ ఫ్లోర్ మ్యాట్స్, హ్యాండీ రియర్ పార్సెల్ ట్రే, డోర్ సిల్ గార్డ్, కీలెస్ సెక్యూరిటీ సిస్టమ్ వంటి మార్పులను పరిశీలించవచ్చు. ఏ-స్టార్ ఆక్టివ్‌లో జోడించిన ఈ 14 ఆకర్షనీయమైన ఫీచర్ల విలువ రూ.14,990.
లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి ఏ-స్టార్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి సాంకేతిక మార్పులు లేవు. ఇందులో 998సీసీ కె10బి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ కె-సిరీస్ ఇంజన్ గరిష్టంగా 6200 ఆర్‌పిఎమ్ వద్ద 67 పిఎస్‌ల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఇది లీటరుకు 19 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. హైదరాబాద్ మార్కెట్లో మారుతి సుజుకి ఏ-స్టార్ హ్యాచ్‌బ్యాక్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
మారుతి సుజుకి ఏ-స్టార్ ఆటోమేటిక్ - రూ. 4.73 లక్షలు
మారుతి సుజుకి ఏ-స్టార్ ఎల్ఎక్స్ఐ - రూ. 3.90 లక్షలు
మారుతి సుజుకి ఏ-స్టార్ విఎక్స్ఐ - రూ. 4.22 లక్షలు
మారుతి సుజుకి ఏ-స్టార్ జెడ్‌ఎక్స్ఐ - రూ. 4.48 లక్షలు
మారుతి సుజుకి ఏ-స్టార్ జెడ్‌ఎక్స్ఐ (ఏబిఎస్) - రూ. 4.67 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

మారుతి సుజుకి లిమిటెడ్ ఎడిషన్ ఏ-స్టార్ ఆక్టివ్

మారుతి సుజుకి లిమిటెడ్ ఎడిషన్ ఏ-స్టార్ ఆక్టివ్

మారుతి సుజుకి ఏ-స్టార్

మారుతి సుజుకి ఏ-స్టార్

మారుతి సుజుకి ఏ-స్టార్

మారుతి సుజుకి ఏ-స్టార్

మారుతి సుజుకి ఏ-స్టార్

మారుతి సుజుకి ఏ-స్టార్

మారుతి సుజుకి ఏ-స్టార్

మారుతి సుజుకి ఏ-స్టార్

మారుతి సుజుకి లిమిటెడ్ ఎడిషన్ ఏ-స్టార్ ఆక్టివ్

మారుతి సుజుకి లిమిటెడ్ ఎడిషన్ ఏ-స్టార్ ఆక్టివ్

మారుతి సుజుకి లిమిటెడ్ ఎడిషన్ ఏ-స్టార్ ఆక్టివ్

మారుతి సుజుకి లిమిటెడ్ ఎడిషన్ ఏ-స్టార్ ఆక్టివ్

మారుతి సుజుకి లిమిటెడ్ ఎడిషన్ ఏ-స్టార్ ఆక్టివ్

మారుతి సుజుకి లిమిటెడ్ ఎడిషన్ ఏ-స్టార్ ఆక్టివ్

మారుతి సుజుకి లిమిటెడ్ ఎడిషన్ ఏ-స్టార్ ఆక్టివ్



Click it and Unblock the Notifications








