సరికొత్త 2012 రిట్జ్‌ డీజిల్‌ను విడుదల చేసిన మారుతి సుజుకి

భారతదేశపు నెంబర్ వన్ కార్ మేకర్ మారుతి సుజుకి ఇండియా నుంచి కార్ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌గ్రేడెడ్ రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ చడి చప్పుడు లేకుండా నేడు మార్కెట్లో విడుదలైంది. ఫేస్‌లిఫ్టెడ్ మారుతి సుజుకి రిట్జ్ కారును కంపెనీ సోమవారం నాడు దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది. అయితే, ప్రస్తుతానికి కేవలం డీజిల్ వెర్షన్ రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌ను మాత్రమే మారుతి సుజుకి విడుదల చేసింది.

భారత మార్కెట్లో 2012 వెర్షన్ మారుతి సుజుకి రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ.5.31 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఆకర్షనీయమై డిజైన్, సాటిలేని పెర్ఫామెన్స్, మెరుగైన మైలేజ్‌లను కోరుకునే నేటి తరం కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకొని మారుతి సుజుకి ఈ కారును అప్‌గ్రేడ్ చేసింది. పాత రిట్జ్‌తో పోల్చుకుంటే కొత్త రిట్జ్‌లో 52 మార్పులు ఉన్నాయి.


సరికొత్త ఫ్రంట్ డిజైన్, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, కొత్త జెడ్‌డిఐ వేరియంట్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌పై మల్టీ-ఇన్ఫర్మేషన్ సిస్టమ్, యూఎస్‌బితో కూడిన కొత్త ఆడియో సిస్టమ్, యాంత్రికంగా నియంత్రించబడే రియర్ వ్యూ మిర్రర్స్, బాడీ సైడ్ మౌల్డింగ్స్ వంటివి ప్రధాన మార్పులుగా చెప్పుకోవచ్చు. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మారుతి సుజుకి రిట్జ్ పాత రిట్జ్‌తో పోల్చుకుంటే 10 శాతం మెరుగైన మైలేజ్‌ను ఆఫర్ చేస్తుంది.

పాత వెర్షన్ మారుతి సుజుకి రిట్జ్ డీజిల్ వేరియంట్ లీటరు డీజిల్‌కు 21.1 కి.మీ. మైలేజీని మాత్రమే ఇస్తుండగా, కొత్త రిఫ్రెష్డ్ వెర్షన్ మారుతి సుజుకి రిట్జ్ లీటరు డీజిల్‌కు 23.2 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. రిట్జ్‌లో తొలిసారిగా కంపెనీ టాప్ ఎండ్ వేరియంట్ (జెడ్‌డిఐ)ను రూ.6.23 లక్షల ధరతో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)తో పరిచయం చేయటం జరిగింది. ఈ వేరియంట్‌లో అల్లాయ్ వీల్స్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

ఫేస్‌లిఫ్ట్ మారుతి సుజుకి రిట్జ్‌ హ్యాచ్‌బ్యాక్ డీజిల్ వెర్షన్‌లో లభించే వేరియంట్లు వాటి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
* మారుతి సుజుకి రిట్జ్‌ ఎల్‌డిఐ - రూ. 5.31 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్‌ విడిఐ - రూ. 5.64 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్‌ విడిఐ (ఏబిఎస్) - రూ. 5.82 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్‌ జెడ్‌డిఐ - రూ. 6.23 లక్షలు

More from DriveSpark

Article Published On: Monday, September 3, 2012, 19:36 [IST]
English summary
Maruti Suzuki has silently launched refreshed variants of the Ritz hatchback today. The refreshed new Ritz diesel boasts of the same technological advancements that were first seen in the new Swift launched early last year. The Ritz Diesel has a starting price of Rs.5.31 lakhs for the entry level LDi variant. Maruti has finally added a top end Zdi variant which is priced at Rs.6.23 lakhs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+