మారుతి సుజుకి ఎస్ఎక్స్4 డీజిల్‌పై భారీ డిస్కౌంట్
దేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న ప్రీమియం సెడాన్ ఎస్ఎక్స్4 డీజిల్ వేరియంట్‌పై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఈ మోడల్‌పై కంపెనీ ఏకంగా రూ.80,000 డిస్కౌంట్‌ను అందిస్తుంది. సి-సెగ్మెంట్ సెడాన్ మార్కెట్లో మారుతి సుజుకి ప్రవేశపెట్టిన ఈ ఎస్ఎక్స్4 సెడాన్ ప్రీమయం కార్ లవర్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మోడల్‌లో సెలబ్రేషన్ ఎడిషన్‌ను విడుదల చేసినప్పటికీ కూడా పెద్దగా ఆశించిన ఫలితం లభించలేదు.
వాస్తవానికి ప్రస్తుతం పెట్రోల్ కార్లకు డిమాండ్ తగ్గి, డీజిల్ కార్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో, పెట్రోల్ మోడళ్ల విక్రయాలను పెంచుకునేందుకు కార్ కంపెనీలు వీటిపై భారీ తగ్గింపులు, వివిధ ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. అయితే, మారుతి సుజుకి మాత్రం ఇందుకు భిన్నంగా, ఎస్ఎక్స్4 సెడాన్‌పై రూ.80,000 డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ డిస్కౌంట్‌లో ఎక్సేంజ్ బోనస్, ఉచిత యాక్ససరీలు కలిగి ఉంటాయి మరియూ ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే.
మారుతి సుజుకి ఎస్ఎక్స్4 సెలబ్రేషన్ ఎడిషన్‌పై ఈ డిస్కౌంట్ ఆఫర్ కేవలం 7 రోజులు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ నేటి నుంచి (జూన్ 25, 2012 నుంచి) ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మారుతి సుజుకి 100 లక్షల దేశీయ కార్ అమ్మకాలను సాధించిన సందర్భాన్ని పురస్కరించి, దీనిని సెలబ్రేట్ చేసుకునేందుకు ఎస్ఎక్స్4లో ఓ సెలబ్రేషన్ ఎడిషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో మార్కెట్లోకి ప్రవేశించిన సెలబ్రేషన్ ఎడిషన్ మారుతి సుజుకి ఎస్ఎక్స్4 సెడాన్‌లో కంపెనీ అదనంగా క్రింద తెలిపిన ఫీచర్లను కంపెనీ అందిస్తోంది.
* సరికొత్త ఫ్యాబ్రిక్ సీట్స్
* లోపలివైపు క్రోమ్ కోటింగ్ చేయబడిన డోర్ హ్యాండిల్స్
* క్రోమ్ కోటెడ్ ఏసి లోవర్స్
* ఆర్మ్ రెస్ట్స్‌పై క్యూబిక్ ప్రింటిగ్
* సెలబ్రేషన్ ఎడిషన్ ఫ్లోర్ మ్యాట్స్, పిల్లోస్
* సెలబ్రేషన్ ఎడిషన్‌ను గుర్తు చేసే బాడీ డెకాల్స్, గ్రాఫిక్స్
మారుతి సుజుకి ఎస్ఎక్స్4 సెడాన్ పెట్రోల్, డీజిల్, సిఎన్‌జీ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో ఓ హైబ్రిడ్ వేరియంట్‌ను గడచిన జవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. అయితే, ఈ వేరియంట్ వాణిజ్య పరంగా మార్కెట్లోకి తీసుకువచ్చే విషయంపై కంపెనీ నోరు మెదపలేదు. కాగా.. పెట్రోల్ వేరియంట్ ఎస్ఎక్స్4లో 1.6-లీటర్ ఇంజన్‌ను ఉఫయోగించారు. ఇది 104 బిహెచ్‌పిల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే, డీజిల్ వేరియంట్‌లో 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 90 బిహెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.


Click it and Unblock the Notifications








