లిమిటెడ్ ఎడిషన్ వ్యాగన్ఆర్‌ను విడుదల చేసిన మారుతి
దేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న చిన్న కారు వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌లో ఓ సరికొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. వ్యాగన్ఆర్ ప్రో అనే పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త కారులో కంపెనీ అదనంగా అనేక ఫీచర్లను జోడించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ప్రో స్టాండర్డ్ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో మొత్తం రూ.20,000 విలువైన ఫీచర్లను కంపెనీ అదనంగా ఆఫర్ చేస్తుంది.
సాధారణంగా, ఈ ఫీచర్లను బయటి మార్కెట్లో కొనుగోలు చేయాలంటే సుమారు రూ.30,000 లకు పైగా ఖర్చు అవుతుందని కంపెనీ పేర్కొంది. కొత్త వ్యాగన్ఆర్ ప్రో హ్యాచ్‌బ్యాక్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు, కేవలం ఇంటీరియర్లలో మాత్రమే మరిన్ని అదనపు ఫీచర్లను కస్టమర్లు పొందవచ్చు. పెట్రోల్ కార్ల అమ్మకాలు తగ్గముఖం పడుతున్న నేపథ్యంలో వీటి అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మారుతి సుజుకి ఆఫర్ చేస్తున్న టాప్-ఎండ్ వేరియంట్ వ్యాగన్ఆర్ విఎక్స్ఐ ధర రూ.4,34,566 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ప్రో ఫీచర్లు:
* 2 డిన్ యూఎస్‌బి ఆడియో సిస్టమ్
* కార్ మ్యాట్స్
* రియర్ స్పాయిలర్
* కార్ పెర్ఫ్యూమ్
* బంపర్ ప్రొటెక్టర్
* వీల్ కవర్
* సైడ్ మౌల్డింగ్
* 4-స్పీకర్ సెట్
* బాడీ గ్రాఫిక్స్
* కొత్త సీట్ కవర్లు


Click it and Unblock the Notifications









