భారత్ కోసం బి-క్లాస్‌ చిన్న కారును ఆవిష్కరించిన మెర్సిడెస్

సాధారణ కార్ కంపెనీలే కాదు లగ్జరీ కార్ కంపెనీలు సైతం ఇప్పుడు చిన్న కార్లపై దృష్టి సారించాయి. లగ్జరీ స్మాల్ కార్ సెగ్మెంట్లో పోటీ పెరుగుతుండటంతో ఈ సెగ్మంట్లోని కార్ కంపెనీలన్నీ కూడా తక్కువ ధర కలిగిన చిన్న కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత లగ్జరీ కార్ మార్కెట్లో తన లీడర్‌షిప్ స్థానాన్ని కోల్పోయి, మూడవ స్థానానికి పడిపోయిన మెర్సిడెస్ బెంజ్ నేడు ఇండియన్ మార్కెట్ కోసం ఓ చిన్న కారును పరిచయం చేసింది.

ప్రపంచ మార్కెట్లలో మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న 'బి-క్లాస్' కారును కంపెనీ ఇప్పుడు ఇండియన్ మార్కెట్‌కు కూడా తీసుకువచ్చింది. గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్‌ను కంపెనీ ఆవిష్కరించింది. మెర్సిడెస్ బెంజ్ స్పోర్ట్స్ టూరర్‌గా పిలిచే ఈ చిన్న కారు సెడాన్ లాంటి సౌకర్యాన్ని, ఎమ్‌పివి లాంటి ఫ్లెక్సిబిలిటీని, ఎస్‌యూవీ లాంటి పవర్‌ను కలిగి ఉంటుంది.


బి-క్లాస్‌ను వాణిజ్య పరంగా సెప్టెంబర్ నెలలో మెర్సిడెస్ బెంజ్ విడుదల చేయనుంది. ఈలోపుగా ప్రముఖ బాలీవుడ్ తారలతో ఈ స్పోర్ట్ టూరర్ బి-క్లాస్ ప్రమోషన్ ఓ అడ్వెంచర్ ట్రైల్‌ను కంపెనీ నిర్వహించనుంది. అల్టిమేట్ టూరింగ్ ట్రైల్ (యూటిటి)గా పిలిచే ఈ క్యాంపైన్‌లో బాలీవుడ్ తారలు జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్, కల్కి కొయిచిన్, గౌరవ్ కపూర్‌లు ఈ కారులో దేశవ్యాప్తంగా సంచరించనున్నారు.

భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ ధర సుమారు రూ.20 మేర ఉండొచ్చని అంచనా. మెర్సిడెస్ బెంజ్ నుంచి లభ్యం కానున్న అత్యంత చవక కారుగా బి-క్లాస్ నిలువనుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో 7జి డిసిటి గేర్‌బాక్స్‌తో లభించనుంది. ఈ చిన్న కారు కోసం ఆగస్టు చివరి వారంలో బుకింగ్‌లు ప్రారంభం కావచ్చని అంచనా. ఈ సెగ్మెంట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, ఆడి క్యూ3 వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 19, 2012, 16:57 [IST]
English summary
Mercedes Benz India has unveiled the B-Class in India at the Buddh International Circuit, Greater Noida. Mercedes Benz calls the B-Class a sports tourer which offers comfort of a sedan, flexibility of an MPV and qualities of an SUV.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+