సి-క్లాస్ ఏఎమ్‌జి ఎడిషన్‌ను విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్
జర్మనీకు చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ బ్రాండ్ మెర్సిడిస్ బెంజ్ భారత మార్కెట్లో అందిస్తున్న ఎంట్రీ లెవల్ సి-క్లాస్ సెగ్మెంట్లో మరో సరికొత్త వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఏఎమ్‌జి స్పోర్ట్స్ ప్యాకేజ్‌తో కూడిన కొత్త సి-క్లాస్ ఏఎమ్‌జి పెర్ఫామెన్స్ ఎడిషన్‌ను మెర్సిడెస్ బెంజ్ ఇండియా దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టింది.
'మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ 250 సిడిఐ అవాంట్-గార్డే'గా పిలిచే ఈ కొత్త వేరియంట్ ఈ శ్రేణి (సి-క్లాస్)లో లభిస్తున్న మోడళ్లలో కెల్లా అత్యంత ఆకర్షనీయంగా ఉంటుంది. ప్రధానంగా యువ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని స్పోర్టీ లుక్, మెరుగైన డ్రైవింగ్ డైనమిక్స్, హ్యాండ్లింగ్ అంశాలను జోడించి ఈ కొత్త 'సి-క్లాస్ 250 సిడిఐ అవాంట్-గార్డే'ను అభివృద్ధి చేశామని కంపెనీ పేర్కొంది.
ఏఎమ్‌జి స్పోర్ట్స్ ప్యాకేజ్‌తో కూడిన ఈ కొత్త మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ వేరియంట్ ఈ సెగ్మెంట్లో స్టాండర్డ్‌ను సృష్టిస్తుందని కంపెనీ భావిస్తోంది. మరింత స్పోర్టీ లుక్ అండ్ ఫీల్‌ను ఇచ్చేందుకు గానూ ఇందులో 17 అంగుళాల 5-ట్విన్-స్పోక్ లైట్ అలాయ్ వీల్స్, ఏఎమ్‌జి బాడీ స్టయిలింగ్ వంటి ఎక్స్టీరియర్ మార్పులు, నప్పా లెథర్‌తో కప్పడిన 3-స్పోక్ మల్టీ ఫంక్షన్ (12-ఫంక్షన్ కీస్) స్టీరింగ్ వీల్, మరింత సౌకర్యవంతమైన ఇంటీరియర్లతో దీనిని రూపొందించామని కంపెనీ పేర్కొంది. మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ 250 సిడిఐ అవాంట్-గార్డే లీటరు పెట్రోల్‌కు 8 మైలేజీనిస్తుంది. రాష్ట్ర మార్కెట్లో ఈ మోడల్ ధర రూ.35,90,516(ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది.
ఈ కొత్త కారును విడుదల చేసిన సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పీటర్ హానెగ్ మాట్లాడుతూ.. కేవలం స్పోర్టీ లుక్‌తోనే కాకుండా స్పోర్టీ పెర్ఫామెన్స్‌తో ఈ కొత్త సి-క్లాస్‌ను తీర్చిదిద్దామని, ఇండియాలో ఇప్పటి వరకు 15,000 సి-క్లాస్ కార్లను విక్రయించామని తెలిపారు. భారత్‌లో విలాసవంతమైన కార్లకు డిమాండ్ పెరుగుతోందని, ప్రస్తుత సంవత్సరంలో తాము 15-20 శాతం వృద్ధిని కనబరచగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గడచిన సంవత్సరంలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా మొత్తం 7,100 కార్లను విక్రయించిందని ఆయన గుర్తు చేశారు.


Click it and Unblock the Notifications








