'ఎమ్ఎల్ 350 సిడిఐ'ని విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్

జర్మనీకు చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా (ఎమ్‌బిఐ) దేశీయ విపణిలో అందిస్తున్న ఎమ్-క్లాస్ ఎస్‌యూవీల శ్రేణిలో ఓ సరికొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుగు డ్రైవ్ స్పార్క్ ఈ నెల ఆరంభంలో ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. నేడు "ఎమ్ఎల్ 350 సిడిఐ" ఎస్‌యూవీని మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

రూ.56.9 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కే ఎమ్ఎల్ 350 సిడిఐ ఎస్‌యూవీని మెర్సిడెస్ బెంజ్ అందిస్తోంది. ఇందులో, ఫుల్లీ లోడెడ్ ఏఎమ్‌జి ప్యాకేజ్‌తో కూడిన ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను (100 ఎస్‌యూవీలను మాత్రమే విక్రయించనున్నారు) ఎస్‌యూవీని కూడా కంపెనీ అందిస్తోంది. మార్కెట్లో ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్ ధర రూ.66 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.


ఎమ్ఎల్ 350 సిడిఐ వేరియంట్‌లో అమర్చిన 3.0 లీటర్, వి6 ఇంజన్ 258 బిహెచ్‌పిల శక్తిని (పాత వేరియంట్ కన్నా 34 బిహెచ్‌పిలు అధికం), 63.2 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇందులో 7-స్పీడ్ జిట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అమర్చారు. ఇంకా ఇందులో స్టార్ట్-స్టాప్, పెర్మినెంట్ ఫోర్-వీల్ డ్రైవ్‌లు స్టాండర్డ్ ఫీచర్లుగా వస్తాయి. అలాగే, ఆప్షనల్‌గా 6-స్టేజ్ ఆన్/ఆఫ్-రోడ్ ప్యాకేజ్‌‌లతో కూడా ఇది లభిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎమ్ఎల్ 350 సిడిఐ కేవలం 7.4 సెకండ్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 224 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. అత్యంత విలాసవంతమైన ఇంటీరియర్స్‌తో తీర్చిదిద్దిన ఈ ఎమ్ఎల్ 350 సిడి వేరియంట్ ఈ సెగ్మెంట్లో ఇతర లగ్జరీ కార్ కంపెనీల నుండి లభిస్తున్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5, పోర్షే కెయిన్నీ, ఆడి క్యూ7 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎమ్ఎల్ 350 సిడిఐకు సంబంధించిన మరిన్ని ఫోటోల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

అధిక నాణ్యత కలిగిన వస్తువలతో తయారైన ఈ ఎస్‌యూవీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎంటర్‌టైన్ వ్యవస్థను పొందుపరచారు. అయితే, ఇది కేవలం 5-సీటర్ ఆప్షన్లో మాత్రమే లభించటం కాస్తంత విచారకర విషయం. కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎమ్ఎల్ 350 సిడిఐ వేరియంట్ డెలివరీలు జూన్ నెల చివరి నాటికి లేదా జులై నెల ఆరంభంలో కానీ ప్రారంభం కానున్నాయి.

Article Published On: Tuesday, May 15, 2012, 15:58 [IST]
English summary
Mercedes Benz India has rolled out the 2012 upgraded ML 350 at Rs 56.9 lakhs. The new M Class was spotted at some of the showrooms in the country even before its launch.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+