ఎమ్-క్లాస్‌లో చవక వేరియంట్‌ను ప్రవేశపెట్టిన మెర్సిడెస్ బెంజ్
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా దేశీయ విపణిలో మరొక సరికొత్త కారును ప్రవేశపెట్టింది. ఇటీవలే తమ ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ బి-క్లాస్‌ను ప్రవేశపెట్టిన మెర్సిడెస్ బెంజ్ ఇప్పుడు తాజాగా ఎమ్-క్లాస్ మరొక కొత్త వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఎమ్-క్లాస్‌లో మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న ఖరీదైన వేరియంట్ ఎమ్ఎల్350 సిడిఐ వేరియంట్‌కు దిగువన తక్కువ ధరతో కూడిన 'ఎమ్ఎల్250 సిడిఐ' వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది.
దేశీయ విపణిలో మెర్సిడెస్ బెంజ్ ఎమ్ఎల్250 సిడిఐ వేరియంట్ ధర రూ.46.5 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఎమ్‌ఎల్350 సిడిఐ వేరియంట్ ధరతో పోల్చుకుంటే ఇది సుమారు రూ.10.4 లక్షలు తక్కువ ధరను కలిగి ఉంటుంది. ఈ కొత్త వేరియంట్ ఈ సెగ్మెంట్లోని ఆడి క్యూ5 (ధర రూ.52.61 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 (ధర రూ.49.8 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వంటి మోడళ్లకు కేవలం ధరలోనే కాకుండా.. ఫీచర్లు, పెర్ఫామెన్స్‌ల పరంగా కూడా గట్టి పోటీగా నిలువనుంది.
మెర్సిడెస్ బెంజ్ ఎమ్ఎల్250 సిడిఐలో 2.2 లీటర్, ట్విన్ టర్బో ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 204 బిహెచ్‌పిల శక్తిని, 500 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. కంపెనీ అందిస్తున్న సి-క్లాస్, ఈ-క్లాస్ కార్లలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులో ఆటో స్టార్ట్-స్టాప్ ఆప్షన్ స్టాండర్డ్ ఫీచర్‌గా ఉంటుంది. ఎమ్ఎల్350 సిడిఐలో ఉపయోగించిన ఇంటెలిజెంట్ లైట్ సిస్టమ్, యాక్టివ్ పార్క్ అసిస్ట్ వంటి అనేక ఫీచర్లను ఎనమ్ఎల్250 సిడిఐలో కూడా ఉపయోగించారు.


Click it and Unblock the Notifications









