తెలుపు బంగారంతో తయారు చేసిన మెర్సిడెస్ బెంజ్ కారు
ఈ ఫోటోల్లో కనిపిస్తున్న కారును చూశారా..? ఇదేదో స్టెయిన్‌లెస్ స్టీల్ కారని అనుకుంటే, మీరు క్లచ్‌పై కాలేసినట్లే. ఎందుకంటే ఇది పూర్తిగా తెల్ల బంగారంతో (వైట్ గోల్డ్) తయారైన కారు కాబట్టి. ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న పవర్‌ఫుల్ స్పోర్ట్స్ కారు 'ఎస్ఎల్ఎస్ మెక్‌లారెన్' ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి, బాజీ మొత్తాన్ని పూర్తిగా 18 క్యారెట్ల తెల్ల బంగారంతో రూపొందించారు. అబుదాబిలోని ఆయిల్ బావులు కలిగి ఉన్న ఓ కోటీశ్వరుడి వద్ద ఈ కారు కొలువుదీరి ఉంది.
ఈ వైట్ గోల్డ్ మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ మెక్‌లారెన్ కారులో, కంపెనీ తాజాగా అభివృద్ధి చేసిన వి10 క్వాడ్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు. దీని శక్తి 1,600 గుర్రాలతో సమానం. అంటే ఈ ఇంజన్ గరిష్టంగా 1,600 హార్స్ పవర్‌ను, 2,800 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందన్నమాట. అంతేకాదండోయ్.. ఈ సూపర్ కారు కేవలం 2 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని ధర 25 లక్షల అమెరికన్ డాలర్లు. దీన్ని కొనుగోలు చేయాలన్నా, నడపాలన్నా వారికి ఖచ్చితంగా ఆయిల్ బావి ఉండి తీరాల్సిందే..! మరి ఈ తెల్ల బంగారు బెంజ్ కారుపై ఓ కన్నేయండి..!

వైట్ గోల్డ్ మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ మెక్‌లారెన్

వైట్ గోల్డ్ మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ మెక్‌లారెన్

వైట్ గోల్డ్ మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ మెక్‌లారెన్

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ మెక్‌లారెన్

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ మెక్‌లారెన్

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ మెక్‌లారెన్



Click it and Unblock the Notifications








