మెర్సిడెస్ బెంజ్ ఎనర్జీ-ఫోర్స్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ
ఈ ఫోటోలో కనిపిస్తున్న ఎస్‌యూవీని గమనించారా..? భీకరమైన ఆకారంలో కనిపిస్తున్న ఈ వాహనం పేరు 'మెర్సిడెస్ బెంజ్ ఎనర్జీ-ఫోర్స్' (Mercedes-Benz Ener-G-Force). మెర్సిడెస్ బెంజ్ ఇటీవలే లాస్ ఏంజిల్స్ డిజైన్ ఛాలెంజ్ 2012 అనే ఓ పోటీలో పాల్గొంది. ఈ డిజైన్ ఛాలెంజ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, 2025 కోసం ఓ 'హైవే పెట్రోల్ వాహనం'ను డిజైన్ చేయటం. ఈ ఛాలెంజ్ నుంచి పుట్టుకొచ్చిన పర్‌ఫెక్ట్ ఆఫ్-రోడర్ 4x4 ఎస్‌యూవీనే ఈ మెర్సిడెస్ బెంజ్ ఎనర్జీ-ఫోర్స్ కాన్సెప్ట్.
యాంత్రికంగా పర్యవేక్షించబడే రద్దీగా ఉండే రోడ్లు, ట్రాఫిక్ మార్గదర్శకాలు, అధిక జనాభా ఉండే ప్రాంతాలు, మానవ ప్రవర్తనల్లో మార్పులు తదితర పరిస్థితులకు అనుగుణంగా తమ ఎనర్జీ-ఫోర్స్ హైవే పెట్రోలింగ్ వాహనాన్ని డిజైన్ చేశామని మెర్సిడెస్ బెంజ్ పేర్కొంది. అన్ని రకాల రోడ్లపై పోలీసు అధికారులు ప్రయాణించగలిగేలా ఈ వాహనాన్ని ధృఢంగా డిజైన్ చేశామని కంపెనీ వివరించింది. మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న పాపులర్ జి-క్లాస్ ఎస్‌యూవీ నుంచి స్ఫూర్తి పొంది ఈ ఎనర్జీ-ఫోర్స్ ఎస్‌యూవీని కంపెనీ అభివృద్ధి చేసింది.
గతంలో మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్ వాహనాలను కేవలం మిలటరీ ఉపయోగార్థం మాత్రమే తయారు చేసేది. అయితే, ఆ తర్వాతి కాలంలో ఇందులో ప్యాసింజర్ వెర్షన్‌ను కూడా కంపెనీ మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. మిలటరీ వాహనంగా మంచి పేరు తెచ్చుకుంది కాబట్టే, హైవే పెట్రోల్ కోసం మెర్సిడెస్ బెంజ్ తమ పాపులర్ జి-క్లాస్ ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం జరిగింది. ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ ఎస్‌యూవీ మాత్రమే. భవిష్యత్తులో ఈ తరహా వాహనాలు రోడ్లపై మనకు కనిపించనున్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎనర్జీ-ఫోర్స్
మెర్సిడెస్ బెంజ్ ఇటీవలే లాస్ ఏంజిల్స్ డిజైన్ ఛాలెంజ్ 2012 అనే ఓ పోటీలో పాల్గొంది. ఈ డిజైన్ ఛాలెంజ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, 2025 కోసం ఓ 'హైవే పెట్రోల్ వాహనం'ను డిజైన్ చేయటం. ఈ ఛాలెంజ్ నుంచి పుట్టుకొచ్చిన పర్‌ఫెక్ట్ ఆఫ్-రోడర్ 4x4 ఎస్‌యూవీనే ఈ మెర్సిడెస్ బెంజ్ ఎనర్జీ-ఫోర్స్ కాన్సెప్ట్.

మెర్సిడెస్ బెంజ్ ఎనర్జీ-ఫోర్స్
యాంత్రికంగా పర్యవేక్షించబడే రద్దీగా ఉండే రోడ్లు, ట్రాఫిక్ మార్గదర్శకాలు, అధిక జనాభా ఉండే ప్రాంతాలు, మానవ ప్రవర్తనల్లో మార్పులు తదితర పరిస్థితులకు అనుగుణంగా తమ ఎనర్జీ-ఫోర్స్ హైవే పెట్రోలింగ్ వాహనాన్ని డిజైన్ చేశామని మెర్సిడెస్ బెంజ్ పేర్కొంది.

మెర్సిడెస్ బెంజ్ ఎనర్జీ-ఫోర్స్
అన్ని రకాల రోడ్లపై పోలీసు అధికారులు ప్రయాణించగలిగేలా ఈ వాహనాన్ని ధృఢంగా డిజైన్ చేశామని కంపెనీ వివరించింది.

మెర్సిడెస్ బెంజ్ ఎనర్జీ-ఫోర్స్
మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న పాపులర్ జి-క్లాస్ ఎస్‌యూవీ నుంచి స్ఫూర్తి పొంది ఈ ఎనర్జీ-ఫోర్స్ ఎస్‌యూవీని కంపెనీ అభివృద్ధి చేసింది.

మెర్సిడెస్ బెంజ్ ఎనర్జీ-ఫోర్స్
ఈ ఎస్‌యూవీకి వెనుక భాగంలో పుల్‌అవుట్ టూల్‌బాక్స్ ఉంటుంది. ఇందులో వివిధ రకాల వస్తువులను భద్రపరచుకోవచ్చు. పూర్తిగా టెయిల్ గేట్ (వెనుక డోర్) ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ టూల్‌బాక్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ ఎనర్జీ-ఫోర్స్
ఈ కాన్సెప్ట్ ఎస్‌యూవీ పైభాగంలో అమర్చిన ట్యాంకులో రీసైకిల్ చేయబడిన వాటర్‌ను స్టోర్ చేసుకోవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ ఎనర్జీ-ఫోర్స్
"హైడ్రో-టెక్ కన్వర్టర్" ద్వారా సహజ, పునరుత్పాధక వనరులను ఇంధనంగా చేసుకొని వాహనంలో అమర్చబడిన ఫ్యూయెల్ సెల్స్ పనిచేయటం ప్రారంభిస్తాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎనర్జీ-ఫోర్స్
మెర్సిడెస్ బెంజ్ ఎనర్జీ-ఫోర్స్ ఎస్‌యూవీలోని ప్రతి చక్రంలో ఒక్కొక్క ఎలక్ట్రిక్ మోటార్ చొప్పున మొత్తం నాలుగు ఎలక్టిక్ మోటార్లు అమర్చబడి ఉంటాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎనర్జీ-ఫోర్స్
మెర్సిడెస్ బెంజ్ ఎనర్జీ-ఫోర్స్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తి రూపం దాల్చాలంటే మన 2025 వరకూ వేచి ఉండాల్సిందే.
ఈ ఎస్‌యూవీకి వెనుక భాగంలో పుల్‌అవుట్ టూల్‌బాక్స్ ఉంటుంది. ఇందులో వివిధ రకాల వస్తువులను భద్రపరచుకోవచ్చు. పూర్తిగా టెయిల్ గేట్ (వెనుక డోర్) ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ టూల్‌బాక్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ ఎస్‌యూవీ పైభాగంలో అమర్చిన ట్యాంకులో రీసైకిల్ చేయబడిన వాటర్‌ను స్టోర్ చేసుకోవచ్చు. "హైడ్రో-టెక్ కన్వర్టర్" ద్వారా సహజ, పునరుత్పాధక వనరులను ఇంధనంగా చేసుకొని వాహనంలో అమర్చబడిన ఫ్యూయెల్ సెల్స్ పనిచేయటం ప్రారంభిస్తాయి.
మెర్సిడెస్ బెంజ్ ఎనర్జీ-ఫోర్స్ ఎస్‌యూవీలోని ప్రతి చక్రంలో ఒక్కొక్క ఎలక్ట్రిక్ మోటార్ చొప్పున మొత్తం నాలుగు ఎలక్టిక్ మోటార్లు అమర్చబడి ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఇది హైడ్రోజన్ (నీరు) శక్తితో నడిచే కారు అన్నమాట. మరి ఇది ఉత్పత్తి రూపం దాల్చాలంటే మన 2025 వరకూ వేచి ఉండాల్సిందే. అప్పటికీ, ఇది మార్కెట్లో వస్తుందన్న గ్యారంటీ లేదు. ఏదేమైనప్పటికీ, ఇలాంటి కాన్సెప్ట్ వాహనాలకు ప్రాణం పోసే కార్ కంపెనీలు మెచ్చుకొని తీరాల్సిందే. మీరేమంటారు..?


Click it and Unblock the Notifications








