సర్వీస్‌పై విసిగెత్తిన ఓనర్; కారును గాడిదలకు కట్టేసిన వైనం
సాధారణంగా కారులో ఏదైనా సమస్య వస్తే, దానిని సర్వీస్ సెంటర్‌కో లేదా మంచి మెకానిక్ దగ్గరకో తీసుకువెళ్లి సరిచేయించుకుంటాం. అదే లక్షల ఖరీదు చేసే కారు అయితే, మరింత అధనపు శ్రద్ధ తీసుకుంటాం. అయితే, రిపేరుకు వచ్చిన కారును సర్వీస్ చేయటంలో సర్వీస్ సెంటర్ ప్రతినిధులు సరిగ్గా స్పందించకపోయినా, లేదా ఓ చిన్న సమస్యను సరిచేసుకోవటానికి తమ పనులన్నీ వదులుకొని పదే పదే సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరగాలన్నా ఎవరికైనా చిరాకుగానే ఉంటుంది.
ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న సన్నివేశాన్ని చూడండి.. గుజరాత్‌కు చెందిన రాకేష్ పాటిల్ అనే వ్యాపారవేత్త జులై 2012న ఓ మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ 350 సిడిఐ (ధర రూ.60 లక్షలకు పైమాటే) కారును కొనుగోలు చేశాడు. ఈ కారును కొన్న తర్వాత, అందులో అనేకసార్లు సమస్యలు తలెత్తడం, దానిని తరచూ మెర్సిడెస్ బెంజ్ సర్వీస్ సెంటర్‌కు తీసుకువెళ్లటం చేశాడు. అయితే, సర్వీస్ సెంటర్ తీరుపట్ల అసంతృప్తి చెందిన రాకేష్ పాటిల్ ఇలా తన కారును ఆరు గాడిదలకు కట్టేసి, 'జస్ట్ థింక్' అనే ప్లకార్డులతో నగర రోడ్లపై తిప్పుకుంటూ సర్వీస్ సెంటర్‌కు తీసుకువెళ్లి, ఇటు డీలర్ దృష్టిని అటు కార్ మేకర్ దృష్టిని ఆకర్షించాడు.
అయితే, ఈ విషయంపై మెర్సిడెస్ బెంజ్ స్పందిస్తూ.. వడోదరాకు చెందిన రాకేష్ పాటిల్ జులై 30, 2012న ఓ మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ 350 సిడిఐ కారును అహ్మదాబాద్‌లోని బెంచ్‌మార్క్ కార్స్ డీలర్‌షిప్ నుంచి కొనుగోలు చేశాడని, బాహ్య ప్రభావం కారణంగా అతని కారు యొక్క రెండు టైర్లు తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయని తెలిపింది. టైరు తయారీదారు ఆబ్లిగేషన్స్ అలాగే కారు తయారీదారు వారంటీ నియమ నిబంధనల ప్రకారం, బాహ్య ప్రభావం (ఎక్స్టర్నల్ ఇంపాక్ట్) వలన టైర్లు దెబ్బతింటే అవి కవరేజ్‌లోకి రావని కంపెనీ పేర్కొంది.
ఏదేమైనప్పటికీ, ఈ సమస్య తెలుసుకున్న వెంటనే బెంచ్‌మార్క్ కార్స్ డీలర్ వినియోగదారుని సాన్నిహిత్య చర్యలో భాగంగా, కవరేజ్ లేకపోయినప్పటికీ, నాలుగు టైర్లను మార్చేందుకు సిద్ధపడ్డారని తెలిపింది. అయితే, రాకేష్ పాటిల్ ఇందుకు నిరాకరించి, టైర్లు మార్చడానికి బదులుగా పూర్తిగా కారునే రీప్లేస్ చేయాలని డిమాండ్ చేశారని, ప్రస్తుతం తాము ఈ కేసును సమీక్షిస్తున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా పేర్కొంది.

బెంజ్ కారును గాడిలకు కట్టేసి ఊరేగించిన యజమాని
మెర్సిడెస్ బెంజ్ డీలర్‌షిప్ సర్వీస్ తీరుపట్ల అసంతృప్తి చెందిన ఓ యజమాని తన లగ్జరీ కారును ఇలా గాడిలకు కట్టేసి, రోడ్లంట ఊరేగిస్తూ సర్వీస్ సెంటర్‌కు తీసుకువెళ్లాడు.

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్



Click it and Unblock the Notifications








