స్మార్ట్ కార్ బ్రాండ్‌ను భారత్‌కు తీసుకురానున్న బెంజ్

స్మార్ట్ బ్రాండ్‌ను భారత మార్కెట్లో పరిచయం చేసేందుకు మెర్సిడెస్ బెంజ్ ఇటీవల ఓ మార్కెట్ అధ్యయనాన్ని కూడా నిర్వహించింది. స్మార్ట్ బ్రాండ్‌లో లభిస్తున్న ఫోర్-డోర్ వెర్షన్ మోడల్ స్మార్ట్ ఫర్‌ఫోర్, టూ-డోర్ వెర్షన్ మోడల్ స్మార్ట్ ఫర్‌టూ కార్లు కూడా భారత్‌లో లభించే అవకాశం ఉంది. ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ కార్ల ధరలు రూ.12 లక్షల నుండి రూ.15 లక్షల రేంజ్‌లో ఉండనున్నాయి.
మెర్సిడెస్ బెంజ్ నిర్వహించిన ఈ మార్కెట్ అధ్యయన ఫలితం ప్రోత్సాహకరంగా ఉన్నట్లయితే, 2014 కన్నా ముందుగానే స్మార్ట్ బ్రాండ్ ఇండియా వచ్చే ఆస్కారం ఉంది. రద్దీ ఎక్కువగా ఉండే అర్బన్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని స్మార్ట్ తమ కార్లను అందిస్తోంది. 1886లో స్మార్ట్ తమ మొదటి కారును ఉత్పత్తి చేసింది. 1998లో విడుదలైన స్మార్ట్ ఫర్‌టూ మోడల్ అర్బన్ మార్కెట్లలో ఓ కొత్త శకానికి నాంది పలికింది.
తాజాగా.. జీరో ఎమిషన్‌తో స్మార్ట్ ఫర్‌టూ ఎలక్ట్రిక్ డ్రైవ్ కారును కంపెనీ పరిచయం చేసింది. అంతేకాకుండా.. నలుగురు ప్రయాణికులు ప్రయాణించేలా మరో కాంపాక్ట్ కారు ఫర్‌ఫోర్‌ను కూడా స్మార్ట్ అభివృద్ధి చేసింది. త్వరలోనే ఈ మోడల్ కూడా ఇది మార్కెట్లోకి రానుంది. స్మార్ట్ కార్లు చూడటానికి పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ, విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉండి, మంచి సౌకర్యాన్ని అందిచనున్నాయి.


Click it and Unblock the Notifications








