సెడియాలో కొత్త వేరియంట్‌ను విడుదల చేసిన మిత్సుబిషి
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మిత్సుబిషి భారత మార్కెట్లో అందిస్తున్న 'సెడియా' సెడాన్‌లో ఓ సరికొత్త వేరియంట్‌ను కంపెనీ నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంజన్‌లో ఎలాంటి యాంత్రిక మార్పులు లేకుండా, సరికొత్త ఇంటీరియర్స్, స్టయిలిష్ ఫీచర్లతో 2012 వెర్షన్ 'మిత్సుబిషి సెడియా సెలక్ట్' కంపెనీ విడుదల చేసింది.
ఈ కొత్త మిత్సుబిషి సెడియా సెలక్ట్ సెడాన్ ధర రూ.8.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. 2012 ముత్సుబిషి సెడియా సెలక్ట్ వేరియంట్‌లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, 3జి కనెక్టివిటీ, ఇన్‌బిల్ట్ మ్యాప్స్‌తో పనిచేసే 7-ఇంచ్ మ్యాప్‌మై ఇండియా నావిగేషన్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది మల్టీమీడియా ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థలా పనిచేస్తుంది.
ఇంకా ఇందులో పాత సెడియా స్పోర్ట్ నుంచి గ్రహించిన 6.1 ఇంచ్ టచ్‌స్కీన్, జిపిఎస్ సపోర్ట్, బ్లూటూత్, యూఎస్‌బి కనెక్టివిటీ, 4-స్పీకర్ కెన్‌వుడ్ డివిడి ప్లేయర్‌ను, రియర్ వ్యూ కెమెరా (వెనుక వైపు కెమరా)లను కూడా అమర్చారు.
అంతేకాకుండా, ఇంటీరియర్స్‌లో లెథర్‌తో కవర్ చేయబడిన 3-స్పోక్ స్టీరింగ్ వీల్, ఓయ్‌స్టర్ లెథర్ సీట్ కవర్స్, రెండు రంగులతో కూడిన (టూ-టోన్) బీజ్ ఇంటీరియర్స్, బీజ్ ఫ్లోక్ మ్యాట్స్ వంటి మార్పులను గమనించవచ్చు.
అలాగే ఎక్స్టీరియర్స్‌ను గమనిస్తే, కొత్త 12-స్పోక్ అల్లాయ్ వీల్స్, అధిక కాంతిని వెలువరించే హ్యాలోజెన్ హెడ్‌ల్యాంప్స్, హారిజాంటల్-స్లాట్ మేట్ బ్లాక్ గ్రిల్ వంటి మార్పులను కొత్త సెడియా సెలక్ట్‌లో చేయటం జరిగింది.
కొత్త సెడియా సెలక్ట్ వైట్ స్పీడ్, బ్లాక్ ఫ్లాష్, ర్యాలీ రెడ్ అనే మూడు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. ఇకపోతే ఇందులో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇది 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 115 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మిత్సుబిషి సెడియా సెలక్ట్ సెడాన్‌ను నడుపుతుంటే ఓ స్పోర్ట్స్ కారును నడుపుతున్న అనుభూతిని పొందటం ఖాయం.


Click it and Unblock the Notifications









