కొత్త పాజెరో స్పోర్ట్ ధరను భారీగా తగ్గించిన మిత్సుబిషి

By Ravi

జపాన్ ఆటో దిగ్గజం మిత్సుబిషి దేశీయ విపణిలో అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ (స్పోర్ట్ యుటిలిటీ వెహికల్) పాజెరోలో గడచిన మార్చి నెలలో ఓ సరికొత్త రిఫ్రెష్డ్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, మిత్సుబిషి ఇప్పుడు తమ 'పాజెరో స్పోర్ట్' ధరను ఏకంగా రూ.1.83 లక్షలు తగ్గించేసింది. తాజా తగ్గింపుతో మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ ధర రూ.24.43 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి రూ.22.56 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) తగ్గింది. ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్లో లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన శాంగ్‌యాంగ్ రెక్స్టన్‌తో ఈ విభాగంలో పోటీ ఊపందుకోవటంతో కంపెనీ ఈ ధర ప్రకటించినట్లు తెలుస్తోంది.

కానీ, మిత్సుబిషి తెలిపిన దాని ప్రకారం, పాజెరో స్పోర్ట్‌ను కంపెనీ సికెడి కిట్లుగా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని తమిళనాడులోని తిరువళ్లూర్ ప్లాంటులో అసెంబ్లింగ్ చేస్తుంది. అయితే, టైర్స్, బ్యాటరీ, విండో గ్లాస్, సీట్ బెల్ట్స్, ల్యాంప్స్, వైపర్ అసెంబ్లీ, అల్లాయ్ వీల్స్ వంటి విడిభాగాలను లోకల్ మార్కెట్ నుంచే కొనుగోలు చేస్తున్నందు వలన ఈ మోడల్ ఉత్పాదక వ్యయం తగ్గిందని అందుకే దీని ధరను తగ్గించాని కంపెనీ అంటేంది. ప్రస్తుతం మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ లోకలైజేషన్ 14 శాతంగా ఉంది. దీనిని 30 శాతానికి పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే గనుక జరిగితే పాజెరో స్పోర్ట్ మరింత దిగొచ్చే ఆస్కారం ఉంది.


మిత్సుబిషి పాజెరో స్పోర్ట్‌లో 2.5 లీటర్, 16-వాల్వ్, టర్బోచార్జ్‌డ్ ఇంటర్‌కూల్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 4000 ఆర్‌పిఎమ్ వద్ద 178 పిఎస్‌ల శక్తిని, 2000-2500 ఆర్‌పిఎమ్ వద్ద 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ సిస్టమ్‌తో పాటుగా ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇది ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్లోని టొయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్, చెవర్లే కాప్టివా, హ్యందాయ్ శాంటాఫే, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, తాజాగా వచ్చిన శాంగ్‌యాంగ్ రెక్స్టన్ వంటి ప్రీమియం ఎస్‌యూవీలతో పోటీ పడనుంది.

More from DriveSpark

Article Published On: Friday, October 19, 2012, 19:00 [IST]
English summary
Japanese auto major Mitsubishi India has slashed prices of the new Pajero Sport SUV by Rs 1.87 lakh. With the latest price cut now Mitsubishi Pajero Sport will costs Rs 22.56 lakh, down from Rs 24.43 lakh(ex-showroom, Delhi). Pajero Sport comes with a 2.5 litre, 16 valve, turbocharged, inter cooled diesel engine that generates 178PS of power 4000 rpm and 400Nm of torque 2000 - 2500 rpm.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+