డమరుకం చిత్రంలో నాగ్ కోసం మోడిఫైడ్ టొయోటా ఫార్చ్యూనర్

వయసు మళ్లుతున్న కొద్దీ కుర్రోడిగా మారిపోతున్న మన టాలీవుడ్ మన్మధుడు 'అక్కినేని నాగార్జు' నటించిన లేటెస్ట్ చిత్రం 'డమరుకం' నేడు వెండితెరపై ప్రత్యక్షమైన సంగతి తెలిసింది. గడచిన కొద్దిరోజులుగా వాయిదా పడతూ వచ్చిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు విచ్చేసింది. సోషియోఫాంటసీ కథాంశం, అద్భుతమైన గ్రాఫిక్స్‌, చెప్పనవసరం లేని మన హీరో అభినయం, అందాల బొమ్మ అనుష్క అభినయం తదితర ప్రత్యేకతలతో రూపుదిద్దుకున్న ఈ సినిమాపై ఇప్పటికే మాంచి క్రేజ్ నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.

డమరుకం చిత్రంలో నాగార్జున పాత్ర పేరు మల్లిఖార్జున. అందరూ ఇతన్ని మల్లి అని పిలుస్తుంటారు. డబ్బు కోసం ఏపనైనా చేసే పాత్రలో నాగ్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ఇందులో నాగ్ కోసం ప్రత్యేకంగా ఓ పవర్‌ఫుల్ ఎస్‌యూవీని తయారు చేయించాయి. జపనీస్ కార్ కంపెనీ టొయోటా అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ టొయోటా ఫార్చ్యూనర్‌ను నాగ్ కోసం ప్రత్యేకంగా మోడిఫై చేయించారు. నలుపు రంగులో మిల మిలా మెరుస్తుండే ఈ టొయోటా ఫార్చ్యూనర్ వాహనాన్ని మన కింగ్ కోసం ప్రత్యేకంగా మాధాపూర్‌లోని ఓ ప్రముఖ కార్ యాక్ససరీస్ షాపులో మోడిఫై చేయించినట్లు సమాచారం.

నాగార్జున - మోడిఫైడ్ టొయోటా ఫార్చ్యూనర్

నాగార్జున - మోడిఫైడ్ టొయోటా ఫార్చ్యూనర్

డమరుకం చిత్రంలో హీరో నాగార్జున కోసం మోడిఫై చేసిన టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని ఈ ఫోటోలో గమనించవచ్చు.

డమరుకం - సోషియో ఫాంటసీ

డమరుకం - సోషియో ఫాంటసీ

డమరుకం చిత్రం సోషియో ఫాంటసీ కథాంశంతో సాగనుంది.

డమరుకం - గ్రాఫిక్స్

డమరుకం - గ్రాఫిక్స్

డమరుకం చిత్రంలో గ్రాఫిక్స్ హైలైట్‌గా నిలువనున్నాయి. గ్రాఫిక్స్ కోసం కోట్లాది రూపాయలను వెచ్చించినట్లు సమాచారం. సుమారు ఈ చిత్రంలో సుమారు 75 నిమిషాల నిడివి గల గ్రాఫిక్స్ ఇందులో ఉండనుంది.

నాగార్జున - సిక్స్ ప్యాక్

నాగార్జున - సిక్స్ ప్యాక్

డమరుకం చిత్రంలో హీరో నాగార్జున సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకులను మురిపించనున్నాడు.

నాగార్జున - బ్లాక్ టొయోటా ఫార్చ్యూనర్

నాగార్జున - బ్లాక్ టొయోటా ఫార్చ్యూనర్

ఈ చిత్రంలో హీరో నాగ్ కోసం ఓ నలుపు రంగు టొయోటా ఫార్చ్యూనర్‌ను మోడిఫై చేయించారు.

నాగార్జున - మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ యాక్షన్

నాగార్జున - మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ యాక్షన్

డమరుకం చిత్రంలో మాంచి యాక్షన్ సన్నివేశాలను మనం చూడొచ్చు.

నాగార్జున - అనుష్క

నాగార్జున - అనుష్క

ఈ చిత్రంలో మన జేజమ్మ అనుష్క కథానాయికగా నటిస్తోంది. తన అందచందాలతో అనుష్క ప్రేక్షకులను మరిపించనుంది.


ఈ మోడిఫైడ్ టొయోటా ఫార్చ్యూనర్ కారుకు ప్రత్యేకంగా విదేశాల దిగుమతి చేసుకున్న అల్లాయ్ వీల్స్, సూపర్బ్ ఎక్స్‌టెన్సివ్ క్రోమ్ ఫిట్టింగ్స్, లైట్స్ వంటి వాటిని బింగించి అధనపు హంగులను చేర్చి ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఈ కారులో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ చిత్రం కాన్సెప్ట్ టైటిల్‌కు సూట్ అయ్యే విధంగా కారు వెనుకవైపు ఉండే విండ్‌షీల్డ్ (అద్దం)పై ప్రత్యేకంగా ఓ పెద్ద 'త్రిశూలం'ను కూడా డిజైన్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రంపై సినీ మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డమరుకం చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమాపై టాక్ ఎలా ఉంది..?

More from DriveSpark

Article Published On: Friday, November 23, 2012, 12:27 [IST]
English summary
Damarukam is the latest movie of telugu film star Nagarjuna. This socio-fantasy film produced by RR Movie Makers is a big budget film. In a recent new development a new Black Toyota Fortuner has been bought specifically for the film. The car is being decked up with special accessories such as imported alloy wheels and other add ons at a workshop in Hyderabad. One of the visual highlights of the car is a Trishulam fitted to the car's rear wind screen.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+