జూన్ 8 నుండి మహీంద్రా ఎక్స్‌యూవీ500 బుకింగ్స్ ప్రారంభం
భారతదేశపు ప్రముఖ ఎస్‌యూవీ తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న గ్లోబల్ మోడల్ 'మహీంద్రా ఎక్స్‌యూవీ500' కోసం బుకింగ్స్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. జూన్ 8, 2012 నుండి దేశవ్యాప్తంగా మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లను స్వీకరించనున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఎమ్ అండ్ ఎమ్ విడుదల చేసిన ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ మార్కెట్లో అనూహ్య రీతిలో డిమాండ్ రావడటంతో రెండుసార్లు స్వీకరించిన బుకింగ్‌లలో 9 నెలల ఉత్పత్తి కంపెనీ విక్రయించేసింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని అందించేందుకు ఎక్స్‌యూవీ500 మోడల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కంపెనీ నెలకు 4,000 యూనిట్లకు పెంచింది.
మొదటిసారి బుకింగ్‌లు ఎక్కువగా ఉండటంతో, కొత్త బుకింగ్‌లను అంగీకరించడాన్ని కంపెనీ బుకింగ్‌లను నిలిపివేసింది. రెండవసారి బుకింగ్‌లను ప్రారంభించినప్పుడు లక్కీ డ్రా పద్ధతిని పాటించింది. రెండవ విడత బుకింగ్‌లలో సుమారు 25,000 యూనిట్లకు పైగా ఆర్డర్లు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా ప్రారంభించనున్న బుకింగ్‌లు సాధారణ పద్ధతిలోనే ఉంటాయని, ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచడం జరిగిందని కంపెనీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా వెల్లడించారు.


Click it and Unblock the Notifications








