జనరల్ మోటార్స్ నుంచి మరింత శక్తివంతమైన చెవర్లే క్రూజ్

అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్‌అందిస్తున్న పవర్‌ఫుల్ సెడాన్ 'చెవర్లే క్రూజ్'లో మరింత శక్తివంతమైన అప్‌గ్రేడెడ్ వెర్షన్ నేడు మార్కెట్లో విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా పది లక్షలకు పైగా అమ్ముడైన్ చెవర్లే క్రూజ్ ప్రీమియం సెడాన్‌లో ఓ ఫేస్‌‌లిఫ్ట్ వెర్షన్ కంపెనీ ఇటీవలే దక్షిణ కొరియాలో జరిగిన 2012 బుసాన్ మోటార్ షోలో ఆవిష్కరించింది. సరికొత్త మార్పులతో, అత్యాధునిక ఫీచర్లను జోడించుకొన్న కొత్త చెవర్లే క్రూజ్ వాణిజ్య పరంగా విడుదలకు ముస్తాబయింది.

కొద్దిగా మార్పు చేయబడిన ఫ్రంట్ గ్రిల్, రివైజ్డ్ ఫ్రంట్ బంపర్, సరికొత్త హెడ్‌ల్యాంప్స్ అండ్ ఫాగ్‌ల్యాంప్స్, కొత్త డిజైన్ కలిగి అల్లాయ్ వీల్స్ వంటి మార్పులను ఈ అప్‌గ్రేడెడ్ క్రూజ్‌లో గమనించవచ్చు. గ్లోబల్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని, దానికి అనుగుణమైన ఇంటిరీయర్లు ఎక్స్టీరియర్లో ఈ సరికొత్త చెవర్లే క్రూజ్‌ను జనరల్ మోటార్స్ రూపొందించింది.


కారు లోపల గమనిస్తే, ఇంటీరియర్స్‌లో పెద్దగా మార్పులు లేవు కానీ, మరింత సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేసిన వెనుక సీట్, ఎయిర్ వెంట్స్, సరికొత్త ఆడియో సిస్టమ్‌లు ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్లు. ఈ కొత్త చెవర్లే క్రూజ్‌లో సరికొత్త ఇంజన్ (జెడ్ సిరీస్)ను ఉపయోగించారు. ఈ 2.0 లీటర్ కామన్-రైల్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 163 బిహెచ్‌పిల శక్తిని, 380 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పాత క్రూజ్ ఇంజన్ పెర్ఫామెన్స్‌తో పోల్చుకుంటే ఇది 15 బిహెచ్‌పిల అదనపు పవర్, 53 ఎన్ఎమ్‌ల అదనపు టార్క్‌‌లను ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా, ప్రస్తుతం ఉన్న 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ స్థానంలో 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లతో ఇది లభ్యం కానుంది. కొత్త క్రూజ్ ప్రతి లీటరుకు 17 కి.మీ. మైలేజీనివ్వనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 27, 2012, 12:01 [IST]
English summary
US auto major General Motors will launch the facelifted 2013 Chevrolet Cruze sedan with a new powerful engine on June 27th, 2012 in New Delhi. Company has showcased this new Cruze at recently concluded 2012 Busan Motor Show in South Korea. New Cruze gets minor interior and exterior upgrades.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+