హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న కొత్త మారుతి ఆల్టో 800
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) తాజాగా మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త ఆల్టో 800 ఇప్పుడు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. చిన్న మార్కెట్లో మారుతి సుజుకి ఫేట్ మార్చిన ఈ సరికొత్త ఆల్టో 800 విడుదలైన కొద్ది రోజులకే గణనీయమైన సంఖ్యలో బుకింగ్‌లను సొంతం చేసుకుని రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తాజా అప్‌డేట్ ప్రకారం, మారుతి సుజుకి ఆల్టోకు ఇప్పటి వరకూ 44,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు రాగా అందులో 22,000 కార్లను కంపెనీ ఇప్పటికే డెలివరీలు చేయటం కూడా జరిగింది.
బుకింగ్‌ల సంఖ్య ఎక్కువగా ఉందని కొనుగోలుదారులు కంగారుపడాల్సిన అవసరం లేదు. మారుతి సుజుకికి ప్రతినెలా 25,000 యూనిట్ల నుంతి 30,000 యూనిట్ల ఆల్టో 800 కార్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. కాబట్టి, వీలైనంత తక్కువ వెయిటింగ్ పీరియడ్‌కే డీలర్లు తమ కస్టమర్లకు కొత్త ఆల్టో 800 కార్లను డెలివరీ చేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి, డీలరును బట్టి కొత్త ఆల్టో 800 కారుకు వెయిటింగ్ పీరియడ్ నెల రోజులకు పైగా ఉంటోంది. మరి మీ నగరంలో కొత్త ఆల్టో 800 కారును సొంతం చేసుకోవటానికి ఎన్నిరోజు వేచి ఉండాల్సి వస్తోంది..?

మారుతి సుజుకి ఆల్టో 800 ఎక్స్టీరియర్ ఫీచర్లు:
వేవ్ ఫ్రంట్ డిజైన్, స్టయిలిష్ ఫ్రంట్ బంపర్, గ్రిల్, బాడీ కలర్డ్ బంపర్స్, క్రోమ్ కోటెడ్ ఫ్రంట్ గ్రిల్, బాడీ కలర్డ్ అవుట్ డోర్ హ్యాండిల్స్, వీల్ కవర్స్.

మారుతి సుజుకి ఆల్టో 800 ఇంటీరియర్ ఫీచర్లు:
సి పిల్లర్ లోవర్ ట్రిన్ (మోల్డెడ్), క్యాబిన్ లైట్ (3 పొజిషన్స్), ఫ్లోర్ కార్పెట్, ఫ్లోర్ కన్సోల్, గ్రే/బ్రౌన్ ఇంటీరియర్ కలర్, డబుల్ వినైల్/ఫ్యాబ్రిక్ సీటింగ్, బి, సి పిల్లర్ అప్పర్ ట్రిమ్స్, స్పీడోమీటర్‌లో సిల్వర్ కోటింగ్, లోపలివైపు డోర్ హ్యాండిల్స్‌పై సిల్వర్ కోటింగ్, డోర్ ట్రిమ్ ఫ్యాబ్రిక్ ఇన్‌సెర్ట్, మెటాలిక్ ఫినిష్ 3-స్పోక్ స్టీరింగ్ వీల్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‍పై సిల్వర్ కోటింగ్, డ్రైవర్, ప్యాసింజర్ సైడ్ సన్‌విజర్.

మారుతి సుజుకి ఆల్టో 800 కంఫర్ట్ ఫీచర్లు:
అసిస్ట్ గ్రిప్స్ (కో-డ్రైవర్, రియర్ ప్యాసింజర్స్), 1-లీటర్ బాటిల్ హోల్డర్, క్యాన్ హోల్డర్, డ్యూయెల్ టైప్ క్లైమేట్ కంట్రోల్, కాయిన్ హోల్డర్, డ్రైవర్ సైడ్ స్టోరేజ్ స్పేస్, ప్యాసింజర్ సైడ్ యుటిలిటీ పాకెట్, డ్యూయెల్ ట్రిప్ మీటర్, హీటర్‌తో కూడిన ఎయిర్ కండిషనర్, ఫ్రంట్ డోర్ ట్రిమ్ మ్యాప్ పాకెట్ (డ్రైవర్ సైడ్), రిమోట్ ఫ్యూయెల్ లిడ్ ఓపెనర్, ఫ్రంట్ పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, స్పీడోమీటర్ డిస్‌ప్లేలో డిజిటల్ క్లాక్, రిమోట్ బ్యాక్ డోర్ ఓపెనర్, కారు లోపలి నుంచి సర్దుబాటు చేసుకునే వీలున్న డ్రైవర్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్.

మారుతి సుజుకి ఆల్టో 800 సేఫ్టీ ఫీచర్లు:
హెడ్‌లైట్ లెవలింగ్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, ఇమ్మొబిలైజర్, ఫ్రంట్ వైపర్, వాషర్, కొలాప్సబల్ స్టీరింగ్ కాలమ్, ట్యూబ్‌లెస్ టైర్స్, ఆప్షనల్ డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్.

మారుతి సుజుకి ఆల్టో 800 ఇంజన్:
మారుతి సుజుకి ఆల్టో 800లో ఉపయోగించిన రీడిజైన్డ్ 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 47.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో 800 మైలేజ్:
పెట్రోల్ వెర్షన్ మారుతి సుజుకి ఆల్టో 800 లీటరుకు 22.74 కి.మీ. మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ వెర్షన్ మారుతి సుజుకి ఆల్టో 800 కేజీకి 30.46 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.

కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 ధరలు:
పెట్రోల్ వెర్షన్ ఆల్టో 800 ధరలు:
మారుతి ఆల్టో 800 స్టాండర్డ్ - 2.50 లక్షలు (మెటాలిక్) - రూ. 2.47 లక్షలు (నాన్-మెటాలిక్)
మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ - 2.83 లక్షలు (మెటాలిక్) - రూ. 2.80 లక్షలు (నాన్-మెటాలిక్)
మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - 3.06 లక్షలు (మెటాలిక్) - రూ. 3.03 లక్షలు (నాన్-మెటాలిక్)
మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ (ఎయిర్‌బ్యాగ్) - 3.21 లక్షలు (మెటాలిక్) - రూ. 3.18 లక్షలు (నాన్-మెటాలిక్)
సిఎన్‌జి వెర్షన్ ఆల్టో 800 ధరలు:
మారుతి ఆల్టో 800 స్టాండర్డ్ - 3.27 లక్షలు (మెటాలిక్) - రూ. 3.23 లక్షలు (నాన్-మెటాలిక్)
మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ - 3.45 లక్షలు (మెటాలిక్) - రూ. 3.42 లక్షలు (నాన్-మెటాలిక్)
మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - 3.64 లక్షలు (మెటాలిక్) - రూ. 3.61 లక్షలు (నాన్-మెటాలిక్)

కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 రంగులు:
ఆకర్షనీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. అవి..
1. న్యూ ఫ్రోస్ట్ బ్లూ
2. న్యూ బ్లేజింగ్ రెడ్
3. న్యూ టార్క్ బ్లూ
4. న్యూ గ్రానైట్ గ్రే
5. సిల్కీ సిల్వర్
6. సుపీరియర్ వైట్


Click it and Unblock the Notifications








