కొత్త మారుతి సుజుకి రిట్జ్ ఇప్పుడు పెట్రోల్ వెర్షన్లో కూడా లభ్యం
గడచిన నెల మొదటి వారంలో మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) విడుదల చేసిన సరికొత్త అప్‌గ్రేడెడ్ రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ ఇప్పటి వరకూ కేవలం డీజిల్ వెర్షన్‌లో మాత్రమే లభ్యమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మారుతి సుజుకి రిట్డ్ పెట్రోల్ వెర్షన్లో కూడా లభ్యం కానుంది. డీజిల్ వెర్షన్‌ను విడుదల చేసినట్లుగానే చడి చప్పుడు లేకుండా పెట్రోల్ వెర్షన్‌ను కూడా కంపెనీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. పెట్రోల్ వెర్షన్ రిట్జ్‌లో కేవలం కాస్మోటిక్ మార్పులు మాత్రమే ఉన్నాయి, యాంత్రికంగా ఎలాంటి మార్పులు లేవు.
ఇది వరకటి వెర్షన్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే ఇందులోను అమర్చటం జరిగింది. ఇది మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. మిడ్ వేరియంట్ (విఎక్స్ఐ) యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఆప్షన్‌తో (ఏబిఎస్) లభిస్తుంది. రాష్ట్ర మార్కెట్లో వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* మారుతి సుజుకి రిట్జ్ ఎల్ఎక్స్ఐ బిఎస్4 - రూ.4.34 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్ విఎక్స్ఐ బిఎస్4 - రూ.4.68 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్ విఎక్స్ఐ (ఏబిఎస్) బిఎస్4 - రూ.4.94 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్ జెడ్ఎక్స్ఐ బిఎస్4 - రూ.5.33 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

మారుతి సుజుకి రిట్జ్ - పెట్రోల్
కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మారుతి సుజుకి రిట్జ్ ఇప్పుడు పెట్రోల్ వెర్షన్లో కూడా లభ్యం కానుంది. డీజిల్ వెర్షన్‌ను విడుదల చేసినట్లుగానే చడి చప్పుడు లేకుండా పెట్రోల్ వెర్షన్‌ను కూడా కంపెనీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. పెట్రోల్ వెర్షన్ రిట్జ్‌లో కేవలం కాస్మోటిక్ మార్పులు మాత్రమే ఉన్నాయి, యాంత్రికంగా ఎలాంటి మార్పులు లేవు.

మారుతి సుజుకి రిట్జ్ - పెట్రోల్ ఇంజన్
మారుతి సుజుకి రిట్జ్‌లో ఉపయోగించిన 1197సీసీ, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 113 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

మారుతి సుజుకి రిట్జ్ - మార్పులు
పాత రిట్జ్‌తో పోల్చుకుంటే కొత్త రిట్జ్‌లో దాదాపు 52 మార్పులు ఉన్నాయి. సరికొత్త ఫ్రంట్ డిజైన్, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌పై మల్టీ-ఇన్ఫర్మేషన్ సిస్టమ్, యూఎస్‌బితో కూడిన కొత్త ఆడియో సిస్టమ్, యాంత్రికంగా నియంత్రించబడే రియర్ వ్యూ మిర్రర్స్, బాడీ సైడ్ మౌల్డింగ్స్ వంటివి ప్రధాన మార్పులుగా చెప్పుకోవచ్చు.

మారుతి సుజుకి రిట్జ్ - జెడ్ఎక్స్ఐ
మారుతి సుజుకి రిట్జ్ టాప్ ఎండ్ పెట్రోల్ వేరియంట్ (జెడ్‌ఎక్స్ఐ)లో అల్లాయ్ వీల్స్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

మారుతి సుజుకి రిట్జ్ - ఫీచర్లు
* ఇది కొత్త డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్‌తో లభిస్తుంది
* దీని ఫ్రంట్ డిజైన్ పూర్తిగా రీడిజైన్ చేయబడింది
* క్రోమ్ సుజుకి లోగోతో కూడిన సరికొత్త ఫ్రంట్ గ్రిల్
* స్టయిలిష్ హెడ్‌ల్యాంప్స్
* స్పోర్టీ రియర్ స్పాయిలర్
* బాడీ సైడ్ మౌల్డింగ్స్

మారుతి సుజుకి రిట్జ్ - ఫీచర్లు
* టాప్-ఎండ్ వేరియంట్‌లో ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, అల్లాయ్ వీల్స్, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు
* మెరుపరచబడిన వెనుక సీటింగ్
* ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌పై మైలేజ్‌తో పాటుగా వివిధ వివరాలను తెలిపే మల్టీ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే
* యూఎస్‌బి సపోర్టుతో కూడిన కొత్త ఆడియో సిస్టమ్
* యాంత్రికంగా సర్దుబాటు చేయగల సైడ్ మిర్రర్స్ (ఓవిఆర్ఎమ్)
* పగలు, రాత్రి ఉపయోగపడే డే అండ్ నైట్ సెంటర్ మిర్రర్ (ఐవిఆర్ఎమ్)
* మూడు సరికొత్త రంగులు (మిస్టిక్ రెడ్, గ్రానైట్ గ్రే, బ్రీజ్ బ్లూ)

మారుతి సుజుకి రిట్జ్ - సేల్స్ రికార్డ్
మారుతి సుజుకి రిట్జ్ భారత మార్కెట్లో విడుదలైన 18 నెలల్లోనే 1,00,000 కార్లకు పైగా అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. మారుతి సుజుకి 37 నెలల్లో మొత్తం 2 లక్షల రిట్జ్ కార్లను విక్రయించింది. రిట్జ్‌కు ఫేస్‌బుక్‌లో ఇప్పటికే 10 లక్షలకు పైగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం అధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్‌కు ప్రత్యామ్నాయ మోడల్ కోరుకునే వారికి సరికొత్త అప్‌గ్రేడెడ్ రిట్జ్ మంచి ఆప్షన్‌గా నిలువనుంది.
ఆకర్షనీయమై డిజైన్, సాటిలేని పెర్ఫామెన్స్, మెరుగైన మైలేజ్‌లను కోరుకునే నేటి తరం కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకొని మారుతి సుజుకి ఈ కారును అప్‌గ్రేడ్ చేసింది. పాత రిట్జ్‌తో పోల్చుకుంటే కొత్త రిట్జ్‌లో దాదాపు 52 మార్పులు ఉన్నాయి. సరికొత్త ఫ్రంట్ డిజైన్, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌పై మల్టీ-ఇన్ఫర్మేషన్ సిస్టమ్, యూఎస్‌బితో కూడిన కొత్త ఆడియో సిస్టమ్, యాంత్రికంగా నియంత్రించబడే రియర్ వ్యూ మిర్రర్స్, బాడీ సైడ్ మౌల్డింగ్స్ వంటివి ప్రధాన మార్పులుగా చెప్పుకోవచ్చు.
మారుతి సుజుకి రిట్జ్ టాప్ ఎండ్ పెట్రోల్ వేరియంట్ (జెడ్‌ఎక్స్ఐ)లో అల్లాయ్ వీల్స్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. సరికొత్త మారుతి సుజుకి రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లో చేసిన కొత్త మార్పులు, జోడించిన విశిష్ట ఫీచర్లు క్రింది విధంగా ఉన్నాయి.
- ఇది కొత్త డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్‌తో లభిస్తుంది
- దీని ఫ్రంట్ డిజైన్ పూర్తిగా రీడిజైన్ చేయబడింది
- క్రోమ్ సుజుకి లోగోతో కూడిన సరికొత్త ఫ్రంట్ గ్రిల్
- స్టయిలిష్ హెడ్‌ల్యాంప్స్
- స్పోర్టీ రియర్ స్పాయిలర్
- బాడీ సైడ్ మౌల్డింగ్స్
- టాప్-ఎండ్ వేరియంట్‌లో ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, అల్లాయ్ వీల్స్, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు
- మెరుపరచబడిన వెనుక సీటింగ్
- ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌పై మైలేజ్‌తో పాటుగా వివిధ వివరాలను తెలిపే మల్టీ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే
- యూఎస్‌బి సపోర్టుతో కూడిన కొత్త ఆడియో సిస్టమ్
- యాంత్రికంగా సర్దుబాటు చేయగల సైడ్ మిర్రర్స్ (ఓవిఆర్ఎమ్)
- పగలు, రాత్రి ఉపయోగపడే డే అండ్ నైట్ సెంటర్ మిర్రర్ (ఐవిఆర్ఎమ్)
- మూడు సరికొత్త రంగులు (మిస్టిక్ రెడ్, గ్రానైట్ గ్రే, బ్రీజ్ బ్లూ)
మారుతి సుజుకి రిట్జ్‌లో ఉపయోగించిన 1197సీసీ, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 113 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ చిన్న కారులో ఐదుగురు ప్రయాణికులు (డ్రైవర్‌తో కలిపి) హాయిగా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం అధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్‌కు ప్రత్యామ్నాయ మోడల్ కోరుకునే వారికి సరికొత్త అప్‌గ్రేడెడ్ రిట్జ్ మంచి ఆప్షన్‌గా నిలువనుంది.


Click it and Unblock the Notifications








