మారుతి సుజుకి ఆల్టో 800: కలర్ ఆప్షన్స్
దేశపు అగ్రగామిక కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా నుంచి మార్కెట్లోకి వచ్చిన సరికొత్త చిన్న కారు ఆల్టో 800 ఇప్పుడు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. ఈ బుజ్జి కారుకు ఇప్పటికే 25,000 మందికి పైగా కొనుగోలుదారులు క్యూలో ఉన్నారు. కంపెనీ ఇప్పటికే సుమారు 10,000 యూనిట్లకు పైగా కొత్త ఆల్టో 800 కార్లను డెలివరీ చేసింది. మారుతి సుజుకి ఆల్టో 800 పెట్రోల్, సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. అలాగే ఇది ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. అవి..
1. న్యూ ఫ్రోస్ట్ బ్లూ
2. న్యూ బ్లేజింగ్ రెడ్
3. న్యూ టార్క్ బ్లూ
4. న్యూ గ్రానైట్ గ్రే
5. సిల్కీ సిల్వర్
6. సుపీరియర్ వైట్
(న్యూ ఫ్రోస్ట్ బ్లూ, న్యూ గ్రానైట్ గ్రే కలర్స్ కేవలం ఎల్ఎక్స్ఐ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి) మరి ఇందులో మీ ఫేవరేట్ కలర్ ఏంటి..?

న్యూ ఫ్రోస్ట్ బ్లూ

న్యూ బ్లేజింగ్ రెడ్

న్యూ టార్క్ బ్లూ

న్యూ గ్రానైట్ గ్రే

సిల్కీ సిల్వర్

సుపీరియర్ వైట్
కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 కారులో రీడిజైన్డ్ ఎఫ్8డి 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 47.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ ఆల్టో 800 లీటరుకు 22.74 కి.మీ. మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ ఆల్టో 800 కేజీకి 30.46 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. హైదరాబాద్ మార్కెట్లో లభ్యమయ్యే మారుతి సుజుకి ఆల్టో 800 వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
పెట్రోల్ వెర్షన్ ఆల్టో 800 ధరలు:
మారుతి ఆల్టో 800 స్టాండర్డ్ - 2.50 లక్షలు (మెటాలిక్) - రూ. 2.47 లక్షలు (నాన్-మెటాలిక్)
మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ - 2.83 లక్షలు (మెటాలిక్) - రూ. 2.80 లక్షలు (నాన్-మెటాలిక్)
మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - 3.06 లక్షలు (మెటాలిక్) - రూ. 3.03 లక్షలు (నాన్-మెటాలిక్)
మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ (ఎయిర్‌బ్యాగ్) - 3.21 లక్షలు (మెటాలిక్) - రూ. 3.18 లక్షలు (నాన్-మెటాలిక్)
సిఎన్‌జి వెర్షన్ ఆల్టో 800 ధరలు:
మారుతి ఆల్టో 800 స్టాండర్డ్ - 3.27 లక్షలు (మెటాలిక్) - రూ. 3.23 లక్షలు (నాన్-మెటాలిక్)
మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ - 3.45 లక్షలు (మెటాలిక్) - రూ. 3.42 లక్షలు (నాన్-మెటాలిక్)
మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - 3.64 లక్షలు (మెటాలిక్) - రూ. 3.61 లక్షలు (నాన్-మెటాలిక్)


Click it and Unblock the Notifications








