సరికొత్త మారుతి సుజుకి ఆల్టో 800: ఆన్-రోడ్ ఫోటోలు
ఎట్టకేలకు కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 పరదాలు తొలగిపోయాయి. ఈనెల 16 మార్కెట్లో విడుదల కానున్న సరికొత్త ఆల్టో 800 క్రిస్టల్ క్లియర్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ కొత్త కారు ఎలా ఉంటుందోనని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే చిన్న కార్ ప్రియుల కోసం డ్రైవ్‌స్పార్క్ ప్రత్యేకించి ఈ ఫోటోలను మీ ముందుకు తీసుకువస్తుంది. కొత్త మారుతి ఆల్టో 800 టెస్ట్ డ్రైవ్ సందర్భంగా తీసిన ఈ ఫోటోలు ప్రత్యేకించి మా డ్రైవ్ స్పార్క్ పాఠకుల కోసం.. కొత్త ఆల్టోపై ఓ లుక్కేయండి మరి..!

మారుతి సుజుకి ఆల్టో 800 - ఫ్రంట్ వ్యూ
సరికొత్త మారుతి సుజుకి ఆల్టో 800 చిన్న కారు ఫ్రంట్ డిజైన్‌ను గమనిస్తే, సరికొత్త షార్ప్ హెడ్‌ల్యాంప్స్, చిన్నపాటి క్రోమ్ గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్, హై గ్రౌండ్ క్లియరెన్స్, షార్ప్ డిజైన్ కర్వ్స్ వంటి ఫీచర్లు దర్శనమిస్తాయి.

మారుతి సుజుకి ఆల్టో 800 - సైడ్ వ్యూ
కొత్త ఆల్టో 800 కారును సైడ్ ప్రొఫైల్‌ను గమనించినట్లయితే, దీని హెడ్‌రూమ్ ఇదివరకటి ఆల్టో, 800 కార్ల కన్నా కాస్తంత పెంచినట్లుగా తెలుస్తోంది. ఇది 3395 మి.మీ. పొడవును, 1490 మి.మీ. వెడల్పును, 1475 మి.మీ. ఎత్తును, 2360 మి.మీ. వీల్‌బేస్‌ను, 160 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉండి 720 కేజీల బరువును కలిగి ఉంటుంది.

మారుతి సుజుకి ఆల్టో 800 - రియర్ వ్యూ
సరికొత్త మారుతి సుజుకి ఆల్టో 800లో రిఫ్రెష్డ్ డిజైన్‌తో కూడిన రియర్ బంపర్, హైమౌంట్ స్టాప్ లైట్, క్లియర్ లెన్స్ టెయిల్ ల్యాంప్స్ విత్ పార్కింగ్ ల్యాంప్స్, పెద్ద ఆల్టో 800 బ్రాండింగ్ వంటి ఫీచర్లను గమనించవచ్చు.

మారుతి సుజుకి ఆల్టో 800 - ఇంజన్
* ఇంజన్ టైప్: 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్
* గరిష్ట పవర్: 6000 ఆర్‌పిఎమ్ వద్ద 47.5 బిహెచ్‌పి
* గరిష్ట టార్క్: 3500 ఆర్‌పిఎమ్ వద్ద 69 ఎన్ఎమ్

మారుతి సుజుకి ఆల్టో 800 - ఇంటీరియర్స్
కొత్త ఆల్టో 800 కారులో విశాలమైన ఇంటీరియర్స్, సౌకర్యవంతమైన సీటింగ్, డ్యూయెల్ టోన్ 3-స్పోక్ స్టీరింగ్ వీల్, లెథర్‌తో కప్పబడిన గేర్ నాబ్, పెద్ద ఏసి వెంట్స్, డిజిటల్-అనలాగ్ మీటర్ కన్సోల్, నాణ్యమైన ప్లాస్టిక్స్‌తో చేయబడిన డ్యాష్‌బోర్డ్, పవర్ విండోస్, టాప్-ఎండ్ వేరియంట్‌లో ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

మారుతి సుజుకి ఆల్టో 800 - మైలేజ్
కొత్త ఆల్టో 800 కారు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఇది లీటరు పెట్రోల్‌కు 22.74 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో 800 - బూట్ స్పేస్
కొత్త ఆల్టో 800 హ్యాచ్‌బ్యాక్ విశాలమైన బూట్ స్పేస్‌ను కలిగి ఉండి ఎల్‌పిజి/సిఎన్‌జి కిట్‌ను అమర్చుకునేంత స్థలాన్ని కలిగి ఉంటుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ సామర్ధ్యం 35 లీటర్లుగా ఉంటుంది.
ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ సెగ్మెంట్లో తుఫాన్ పుట్టించేందుకు వస్తున్న సరికొత్త మోడ్రన్ ఆల్టో 800 కారు బుకింగ్స్ కోసం కంపెనీ ఇప్పటికే టెలివిజన్ కమర్షియల్‌ను రన్ చేస్తోంది. అంతేకాకుండా, కంపెనీ డీలర్లు కూడా కేవలం రూ.5,000ల అడ్వాన్సుకే ముందస్తు బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నారు. కొత్త ఆల్టో 800 కోసం కంపెనీ ఓ మైక్రో వెబ్‌సైట్ (http://www.marutisuzukialto800.com)ను కూడా రన్ చేస్తూ, ఆన్‌లైన్ ద్వారా సైతం బుకింగ్‌లను స్వీకరిస్తోంది. ముందుగా వచ్చిన వారికి ముందుగా డెలివరీలు చేయాలని కంపెనీ నిర్ణయించింది.
మారుతి సుజుకి ఆల్టో 800 స్పెసిఫికేషన్లు:
- ఇంజన్ టైప్: 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్
- గరిష్ట పవర్: 6000 ఆర్‌పిఎమ్ వద్ద 47.5 బిహెచ్‌పి
- గరిష్ట టార్క్: 3500 ఆర్‌పిఎమ్ వద్ద 69 ఎన్ఎమ్
- ట్రాన్సిమిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్
- మైలేజ్: 22.74 కెఎమ్‌పిఎల్
- పొడవు: 3395 మి.మీ.
- వెడల్పు: 1490 మి.మీ.
- ఎత్తు: 1475 మి.మీ.
- వీల్‌బేస్: 2360 మి.మీ.
- గ్రౌండ్ క్లియరెన్స్: 160 మి.మీ.
- బరువు: 720 కేజీలు
- టైర్ సైజ్: 145/80 ఆర్12 ట్యూబ్‌లెస్
- ఫ్రంట్ సస్పెషన్: మెక్‌ఫెర్సన్స్ స్ట్రట్, గ్యాస్ ఫిల్డ్, టోర్సియన్ రోల్ కంట్రోల్
- రియర్ సస్పెషన్: కాయిల్ స్ప్రింగ్, గ్యాస్ ఫిల్డ్, 3 లింక్ రిగిడ్ యాక్సిల్, ఐసోలేటెడ్ ట్రైలింగ్ ఆర్మ్
- ఫ్రంట్ బ్రేక్స్: డిస్క్
- రియర్ బ్రేక్స్: డ్రమ్
- ఫ్యూయెల్ ట్యాంక్ సామర్ధ్యం: 35 లీటర్లు
- అంచనా ధర: రూ.2 లక్షలు


Click it and Unblock the Notifications








