అమలులోకి వచ్చిన మోటార్ బీమా ప్రీమియం రేట్ల పెంపు
థర్డ్‌పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లను ప్రతి ఆర్థిక సంవత్సరంలో సమీక్షించి సవరణ చేస్తారని ఐఆర్‌డిఏ ఇదివరకే ప్రకటించింది. దీంతో ఇకపై ద్విచక్ర వాహనాలు, కార్లు, వాణిజ్య వాహనాల యజమానులు తమ వాహనాలను బీమా చేయించుకునేందుకు అధిక మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంది. ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రమాదం జరిగిన సందర్భాల్లో థర్డ్ పర్సన్ ప్రాణాలకు లేదా ఆస్తికి నష్టం జరిగితే వాహన యజమానికి ఆర్థికభారం పడకుండా బీమా కవరేజీ కల్పిస్తుంది.
ఐఆర్‌డిఏ జారీ చేసిన తాజా నిబంధనల ప్రకారం, ప్రైవేట్ కార్ల యజమానులు వాహనాల పరిమాణానాన్ని బట్టి ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 1,000సీసీ ఇంజన్ కెపాసిటీ కలిగిన కార్లకు సుమారు రూ.784 వరకు, అలాగే 1,500సీసీ వరకూ ఇంజన్ కెపాసిటీ కలిగిన కార్లకు రూ.925 వరకూ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద వాహన యజమానులు చెల్లించాల్సి ఉంటుంది.
"మార్చి 31, 2012 నుండి ప్రస్తుతం అమలులో ఉన్న ఇండియన్ మోటార్ థర్డ్ పార్టీ పూల్ సిస్టమ్‌ను రద్దు చేయాలని నిర్ణయించడమైనద"ని ఐఆర్‌డీఏ ఓ ఆర్డర్‌ను జారీ చేసింది. అయితే, ఐఆర్‌డిఏ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల బీమా కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీని వలన తమ వ్యాపారం మరింత క్షీణించిపోయే ఆస్కారం ఉందని బీమా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications









