థర్డ్ జనరేషన్ స్కొడా ఆక్టావియా సెడాన్ ఆవిష్కరణ
చెక్ రిపబ్లిక్‌కు చెందిన కార్ల తయారీ కంపెనీ స్కొడా గతంలో నిలిపివేసిన ఆక్టావియా సెడాన్‌ను తిరిగి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు గతంలో తెలుగు డ్రైవ్ స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు స్కొడా తమ మూడవ తరం (థర్డ్ జనరేషన్) స్కొడా ఆక్టావియా సెడాన్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్తత మోడల్ ఇది వరకటి మోడల్ కన్నా పొడవుగా ఉండి, అధునాతన ఫీచర్లను, ఆకర్షనీయమైన డిజైన్‌ను కలిగి ఉండనుంది.
ఫోక్స్‌వ్యాగన్ గ్రూపు నుంచి పాపులర్ అయిన కొత్త ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి కొత్త ఆక్టావియాను తయారు చేశారు. ఇది 4659 మి.మీ పొడవును, 1814 మి.మీ వెడల్పును కలిగి ఉండి విశాలమైన ఇంటీరియర్ స్థలాన్ని ఆఫర్ చేయనుంది (పాత మోడల్ కన్నా ఇది వరుసగా 90 మి.మీ, 45 మి.మీ అధికం). అంతేకాకుండా వీల్ బేస్‌ను 108 మి.మీ పెంచి 1686 మి.మీలకు పెంచడం జరిగింది. దీని బూట్ స్పేస్ 590 లీటర్లు. ఈ గణాంకాలను బట్టి గమనిస్తే.. పెద్ద కార్లలో ఇది ఫోక్స్‌వ్యాగన్ జెట్టా కన్నా మెరుగ్గా ఉండనుంది.

కొత్త స్కొడా అక్టావియా

కొత్త స్కొడా అక్టావియా

కొత్త స్కొడా అక్టావియా

కొత్త స్కొడా అక్టావియా

కొత్త స్కొడా అక్టావియా

కొత్త స్కొడా అక్టావియా

కొత్త స్కొడా అక్టావియా

కొత్త స్కొడా అక్టావియా

కొత్త స్కొడా అక్టావియా

కొత్త స్కొడా అక్టావియా

కొత్త స్కొడా అక్టావియా

కొత్త స్కొడా అక్టావియా

కొత్త స్కొడా అక్టావియా

కొత్త స్కొడా అక్టావియా

కొత్త స్కొడా అక్టావియా

కొత్త స్కొడా అక్టావియా
సరికొత్త స్కొడా ఆక్టావియా నాలుగు ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఎంట్రీ-లెవల్ స్కొడా ఆక్టావియాలో 120 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 1.4 టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, 138 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే శక్తివంతమైన 1.4 లీటర్ ఇంజన్ అలాగే 177 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్లను ఉపయోగించనున్నారు. కొత్త అక్టావియా వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదలైన కొద్ది నెలల తర్వాత ఇది 2.0 లీటర్ టర్బో ఇంజన్‌తో (ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జిటిఐ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించే ఇంజన్) కూడా ఇది లభించే ఆస్కారం ఉంది.
డీజిల్ వెర్షన్ స్కొడా ఆక్టావియా విషయానికి వస్తే, 103 బిహెచ్‌పి 1.6 లీటర్ ఇంజన్, 108 బిహెచ్‌పి గ్రీన్‌లైన్ వెర్షన్, 147 బిహెచ్‌పి 1.6 లీటర్ మరియు 181 బిహెచ్‌పి 2.0 లీటర్ ఇంజన్లతో ఇది లభ్యం కానుంది. కొత్త ఆక్టావియా సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, ఫైవ్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లతో లభ్యం కానుంది. వచ్చే ఏడాదిలో కొత్త స్కొడా ఆక్టావియా భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. ఈ కారుకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








