జాజ్‌లో మరో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురానున్న హోండా

జపాన్ ఆటో దిగ్గజం హోండా దేశీయ మార్కెట్లో అందిస్తున్న సి-సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్ 'జాజ్' మరో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త సంవత్సరం (2013) రావడానికి మరో ఎనిమిది నెలల సమయం ఉన్నప్పటికీ, ఆటోమొబైల్ కంపెనీలన్నీ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మోడళ్లను అప్‌గ్రేడ్ చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నాయి.

ఇది వరకటి కథనంలో ఫియట్ లీనియా సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ గురించి తెలుసుకున్నాం. కాగా.. ఇప్పుడు తాజాగా జాజ్‌లో మరో సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు హోండా సన్నాహాలు చేస్తుంది. నెక్స్ట్ జనరేషన్ హోండా జాజ్‌లో ప్రధానంగా ఇంజన్‌లో మార్పు ఉండనుంది. హోండా తాజాగా డీజిల్ ఇంజన్లను అభివృద్ధి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో 2013 వెర్షన్ హోండా జాజ్‌ 1.2 లీటర్ డీజిల్ ఆప్షన్‌తో లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జపాన్ మార్కెట్లో 'ఫిట్' అనే పేరుతో లభిస్తున్న హోండా జాజ్‌లో నెక్స్ట్ జనరేషన్ వేరియంట్ గురించి ఇప్పటికే ఇంటర్నెట్లో భారీగా ప్రచారం జరుగుతోంది. వీటి ప్రకారం, కొత్త హోండా జాజ్ దాదాపు అదే లుక్‌ను కొనసాగిస్తున్న కొద్దిపాటి ఎక్స్టీరియర్ మార్పులను పొందనుంది. 2013 వెర్షన్ జాజ్‌లో బ్రయోలోని కొన్ని మార్పులను గమనించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ప్రస్తతుం జాజ్‌ను నిర్మిస్తున్న ఫ్లాట్‌ఫామ్ ఆధారంగానే కొత్త 2013 జాజ్ కూడా రూపుదిద్దుకోనుంది. ఇకపోతే పెట్రోల్ ఇంజన్ జాజ్‌లో ఎలాంటి సాంకేతి మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదు. గడచిన సంవత్సరంలో హోండా జాజ్ ధరను భారీగా తగ్గించి ఇందులో కొత్త వెర్షన్‌ను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత ఈ మోడల్ అమ్మకాలు జోరందుకున్నాయి.

అయితే, హోండా ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో డీజిల్ కార్లు లేకపోవటం, ప్రస్తుతం ఇండియాలో పెట్రోల్ కార్ల కన్నా డీజిల్ కార్లకే డిమాండ్ అధికంగా ఉంటుండటంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ, వచ్చే ఏడాదిలో మన హోండా డీజిల్ కార్లను రోడ్లపై చూడటం ఖాయం.

More from DriveSpark

Article Published On: Saturday, April 14, 2012, 16:51 [IST]
English summary
The Honda Jazz is set for another facelift. The Japanese carmaker which is developing a new small diesel engine will be launching the next gen Honda Jazz in 2013 and it will most likely get anew diesel engine in the form of a 1.2-litre diesel engine.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+