రెనో డస్టర్ ఫ్లాట్‌ఫామ్‌పై నిస్సాన్ ఎస్‌యూవీ

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో, జపాన్ కార్ కంపెనీ నిస్సాన్‌లు ఇండియాలో ఉమ్మడిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒకే ప్లాంట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ రెండు కంపెనీలు ఒకదానితో ఒకటి మంచి సంబంధాలను కలిగి ఉండి ఉత్పత్తుల డిజైన్‌ను, టెక్నాలజీని, ఫ్లాట్‌ఫామ్‌ను పంచుకుంటున్నాయి. ఇప్పటి వరకూ నిస్సాన్ విడుదల చేసిన కార్ల ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రెనో తమ కార్లను ఆఫర్ చేస్తోంది.

అయితే, తొలిసారిగా రెనో వాహనాల ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని నిస్సాన్ తమ వాహనాలను అందించనుంది. రెనో ఇండియా తాజాగా దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన ఎస్‌యూవీ 'రెనో డస్టర్' ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని నిస్సాన్ ఇండియా ఓ కొత్త ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లో విడుదల ఉత్పత్తి చేయనుంది. ప్రస్తుతం నిస్సాన్ కేవలం ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీని మాత్రమే అందిస్తోంది.


నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీని సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకొని కంపెనీ ఇక్కడి మార్కెట్లో అందిస్తోంది. అందుకే దీని ధర కూడా కాస్తంత అధికంగానే ఉంది. ఇండియన్ మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.22.6 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇక్కడి మార్కెట్లో ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు. దీంతో చవక ధరకే నిస్సాన్ ఓ ఎస్‌యూని అందించాలంటే సదరు ఎస్‌యూవీని కంపెనీ ఇక్కడే ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో, రెనో డస్టర్ ఎస్‌యూవీ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, దీని ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో నిస్సాన్ కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి నిస్సాన్ బ్యాడ్జ్‌తో విడుదల చేసే అవకాశం ఉంది. ధరలో ఈ నిస్సాన్ ఎస్‌యూవీ రెనో డస్టర్ కన్నా కాస్తంత తక్కువగా ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం రెనో డస్టర్ ధరలు రూ. 8.19 లక్షల నుంచి రూ. 11.29 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి.

పెట్రోల్ వేరియంట్ రెనో డస్టర్ 102 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 1.6లీటర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. డీజిల్ వేరియంట్ రెనో డస్టర్ 85పిఎస్, 110పిఎస్‌ల పవర్‌తో 1.5 డిసిఐ ఇంజన్‌తో లభిస్తుంది. ఉత్పత్తి ఖర్చు తగ్గించేందుకు గాను నిస్సాన్ ఎస్‌యూవీలో కూడా ఇదే ఇంజన్లను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం నిస్సాన్ అందిస్తున్న సన్నీ సెడాన్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రెనో ఇండియా ఓ సెడాన్ (రెనో స్కాలా)ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దీపావళి నాటికి రెనో స్కాలా మార్కెట్లోకి రానుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 21, 2012, 10:52 [IST]
English summary
Nissan India is mulling to develop a compact SUV based on its alliance partner Renault’s Duster platform. Renault Duster SUV which was launched on July 4 has gained more than 10,000 bookings from across the country so far.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+