సెప్టెంబర్ 26న మార్కెట్లోకి కానున్న నిస్సాన్ ఇవాలియా

నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివి విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఎమ్‌పివి సెగ్మెంట్లో అగ్గి రాజేసేందుకు జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా సిద్ధం చేసిన ఇవాలియాను ఈనెల 26న మార్కెట్లో విడుదల కానుంది. నిస్సాన్ ఇండియా ఇప్పటికే, ఇవాలియాకు సంబంధించి మీడియా కోసం ఎక్స్‌క్లూజివ్ ప్రిప్వూ, టెస్ట్ డ్రైవ్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివి ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉండి, మారుతి సుజుకి ఎర్టిగా, టొయోటా ఇన్నోవా, మహీంద్రా జైలో, చెవర్లే తవేరా నియో3 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివి విశాలమైన ఇంటీరియర్ స్థలాన్ని కలిగి ఉండి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పిస్తుంది. ఇది తొలుతగా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యం కానుంది. ఇందులో 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3750 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 1900 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్ బాక్స్) కలిగిన నిస్సాన్ ఇవాలియా లీటర్ డీజిల్‌కు సుమారు 20 కి.మీ. మైలేజీనిస్తుంది.

నిస్సాన్ ఎవాలియా ఎమ్‌పివిలో ఉండే ఫీచర్లను క్రింది ఫోటో ఫీచర్‌లో గమనించవచ్చు.

ఇవాలియా ఫ్రంట్ లుక్

ఇవాలియా ఫ్రంట్ లుక్

* హీటర్‌తో కూడిన మ్యాన్యువల్ ఎయిర్ కండిషనర్, ఎక్స్ఎల్, ఎక్స్‌వి వేరియంట్లలో వెనుక ప్యాసింజర్లకు సైతం ఏసి వచ్చేలా ఏర్పాటు చేసిన రియర్ ఏసి వెంట్స్

* టాప్ ఎండ్ వేరియంట్ (ఎక్స్‌వి)లో రియర్ వ్యూ కెమెరా

* ఏఎమ్, ఎఫ్ఎమ్, సిడి సపోర్ట్‌తో కూడిన 2-డిన్ ఆడియో సిస్టమ్, 4 స్పీకర్లు

ఇవాలియా రియర్ లుక్

ఇవాలియా రియర్ లుక్

* సెంట్రల్ లాకింగ్ సిస్టమ్

* కీలెస్ ఎంట్రీ

* టిల్ట్ అడ్జస్టబల్ పవర్ స్టీరింగ్

* ముందు వైపు డోర్లకు పవర్ విండోస్

ఇవాలియా సైడ్ లుక్

ఇవాలియా సైడ్ లుక్

* ట్రిప్ కంప్యూటర్, ప్రయాణించే వేగాన్ని తెలిపే క్రూయిజ్ రేంజ్, మైలేజ్‌ను తెలిపే రియల్ టైమ్ ఫ్యూయెల్ మైలేజ్ ఇండికేటర్, డిజిటల్ క్లాక్, టాకోమీటర్ మొదలైన ఫీచర్లతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

* మొబైల్ ఫోన్స్, టాబ్లెట్స్, లాప్‌టాప్స్ వంటి గ్యాడ్జెట్లను చార్జ్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన 12 వోల్ట్ పవర్ సాకెట్

ఇవాలియా ఎక్స్టీరియర్స్

ఇవాలియా ఎక్స్టీరియర్స్

* కారు బాడీ రంగులో ఉండే బంపర్స్ మరియు సైడ్ మిర్రర్స్

* యాంత్రికంగా నియంత్రించబడే సైడ్ మిర్రర్స్

* టాప్ ఎండ్ వేరియంట్లో ముందు వైపు ఫాగ్ ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

ఇవాలియా ఇంటీరియర్స్

ఇవాలియా ఇంటీరియర్స్

* వెనుక వైపు సీట్లలో కూర్చునే ప్యాసింజర్ల సౌకర్యం కోసం ముందు సీట్లకు వెనుక భాగంలో అమర్చిన ఫోల్డబల్ ప్లాస్టిక్ టేబుల్స్

* డ్రైవర్ ఎత్తుకు తగినట్లుగా సర్దుబాటు చేసుకునే సౌకర్యం ఉన్న సీట్

* రెండవ వరుసులో విడివిడిగా మడుచుకునేందుకు వీలున్న స్ప్లిట్ ఫోల్డింగ్ సీట్స్

ఇవాలియా స్లైడింగ్ డోర్స్

ఇవాలియా స్లైడింగ్ డోర్స్

* వెనుక సీట్లలోకి ప్రయాణికులు సులువుగా ప్రవేశించేందుకు, కారులో నుంచి బయటకు వచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన స్లైడింగ్ డోర్స్

ఇవాలియా ఇంజన్

ఇవాలియా ఇంజన్

* ఇందులో ఫ్రంట్ సీట్లలోని డ్రైవ్ ప్యాసింజర్ కోసం డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్ (బేస్ ఎక్స్ఈ వేరియంట్ మినహా)

* ముందు వైపు డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్

* బ్రేక్ అసిస్ట్ మరియు ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)

* ఇంజన్ ఇమ్మొబిలైజర్

* డోర్లు సరిగ్గా వేయకపోతే హెచ్చరించే డోర్ అజర్ వార్నింగ్

ఇవాలియా వర్సెస్ ఇన్నోవా

ఇవాలియా వర్సెస్ ఇన్నోవా

నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివి ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉండి, మారుతి సుజుకి ఎర్టిగా, టొయోటా ఇన్నోవా, మహీంద్రా జైలో, చెవర్లే తవేరా నియో3 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.


నిస్సాన్ ఇవాలియా మొత్తం బరువు 1426 కేజీలు. ఇది 4400 మి.మీ. పొడవును, 1695 మి.మీ. వెడల్పు, 1880 మి.మీ. ఎత్తును మరియు 180 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. నిస్సాన్ ఇవాలియాలో ఆరుగురు ప్రయాణికులు (డ్రైవర్ కాకుండా) హాయిగా ప్రయాణించవచ్చు. వెనుక వరుసలలో ఉండే రెండు సీట్లను పూర్తిగా మడిచినట్లయితే 2900 లీటర్ల వరకూ బూట్ స్పేస్ లభిస్తుంది.

ఇన్ని ప్రత్యేకమైన విశష్టమైన ఫీచర్లు కలిగిన నిస్సాన్ ఇవాలియా నాలుగు వేరియంట్లలో (ఎక్స్ఈ, ఎక్స్ఈ ప్లస్, ఎక్స్ఎల్, ఎక్స్‌వి) లభ్యమవుతుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.8 లక్షల నుంచి రూ.11 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని తెలుస్తోంది. నిస్సాన్ ఇవాలియా సెప్టెంబర్ 26, 2012న మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల కానుంది. ధర, ఫీచర్లను పరిగణిలోకి తీసుకుంటే, ఎమ్‌పివి సెగ్మెంట్లో 'ఈస్ట్ ఆర్ వెస్ట్ ఇవాలియా ఈజ్ బెస్ట్' అని చెప్పవచ్చు. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Thursday, September 13, 2012, 14:35 [IST]
English summary
The Nissan Evalia MPV is set for its Indian launch on September 26th. The large seven seater has already been tested by Drivespark. The Evalia is Nissan's sixth model in India and the third to be made in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+