రెనో స్కాలా విడుదలకు రంగం సిద్ధం; ఈనెల 7న విడుదల

నిస్సాన్ సన్నీ పెద్దన్నగా వస్తున్న రెనో స్కాలా మరో రెండు రోజుల్లో మార్కెట్లో విడుదల కానుంది. రెనో స్కాలాను ఈ నెల 7వ తేదీన (సెప్టెంబర్ 07, 2012 శుక్రవారం) మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. "ఇట్స్ టైమ్ టు స్టెప్ అప్" (Its time to STEP UP) అనే థీమ్‌తో కంపెనీ ఇప్పటికే ఓ టీజర్‌ను తమ వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.

నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రెనో పల్స్ హ్యాచ్‌బ్యాక్‌ను డిజైన్ చేసినట్లుగానే, నిస్సాన్ సన్నీ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రెనో స్కాలాను అభివృద్ధి చేయటం జరిగింది. దీని ఉత్పాదక వ్యయాన్ని తగ్గించేందుకు దాదాపుగా సన్నీలో ఉపయోగించిన ఫీచర్లు, వస్తువులను స్కాలా సెడాన్‌లోను ఉపయోగించారు.

రెనో స్కాలా కోసం ఆన్‌లైన్ ద్వారా ముందస్తు బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది. రెనో ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ లోనికి లాగిన్ అవ్వటం ద్వారా స్కాలాను బుక్ చేసుకోవచ్చు. సన్నీలో ఉపయోగించిన 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్‌నే రెనో స్కాలాలోను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది.

సరికొత్త హెడ్‌లైట్స్, కొత్త ఫ్రంట్ అండ్ రియర్ డిజైన్, ఇంటీరియర్లలో కొద్ది పాటి మార్పులను రెనో స్కాలాలో గమనించవచ్చు. ప్రీమియం బ్రాండ్‌గా భారత మార్కెట్లోకి ప్రవేశించిన రెనో ఇండియా తమ ఉత్పత్తులను నిస్సాన్ ఉత్పత్తుల ధరల కన్నా కాస్తంత అధికంగానే ఉంచనుంది. రెనో స్కాలా ధరలు రూ.6.5 లక్షల నుంచి 9.5 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

రెనో స్కాలాలో ఆటోమేటిక్ వేరియంట్ కూడా లభించే అవకాశాలున్న ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో డీజిల్ కార్లకు డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో రెనో ఇండియా తొలుత డీజిల్ వెర్షన్ స్కాలాను మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. అనంతరం ఇందులో పెట్రోల్ వేరియంట్‌‌ను ప్రవేశపెట్టవచ్చు. పెట్రోల్ వెర్షన్ రెనో స్కాలాలో కూడా నిస్సాన్ సన్నీ పెట్రోల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.5 లీటర్ 98 హెచ్‌పి ఇంజన్‌నే ఉపయోగించనున్నారు.

రెనో స్కాలా సెడాన్ భారత్‌లో రెనో ఇండియా నుంచి లభిస్తున్న ఐదవ ఉత్పత్తి. నిస్సాన్-రెనో భాగస్వామ్యంలో చెన్నైలో నిర్వహించబడుతున్న ఫ్యాక్టరీలోనే రెనో స్కాలా సెడాన్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ప్రస్తుతం రెనో ఇండియా పల్స్ హ్యాచ్‌బ్యాక్, ప్రీమియం సెడాన్ ఫ్లూయెన్స్, ప్రీమియం ఎస్‌యూవీ కొలియోస్, ఎస్‌యూవీ డస్టర్ ఉత్పత్తులను అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 5, 2012, 15:57 [IST]
English summary
Renault Scala has being doing its fair share of testing in India. Drivespark is keeping a close tab on Renault's developments in India. The French auto-maker will launch their Scala sedan in India on 7th September, 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+