లిమిటెడ్ ఎడిషన్ మైక్రా ప్రైమోను విడుదల చేసిన నిస్సాన్

By Ravi

ప్రస్తుత పండుగ సీజన్‌లో కొత్త మోడళ్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు కొన్ని కార్ కంపెనీలు ప్రయత్నిస్తుండగా, మరికొన్ని కంపెనీలు ఆకర్షనీయమైన ఆఫర్లు తగ్గింపులతో వినియోగదారులకు గేలం వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిస్సాన్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ 'మైక్రా'లో ఓ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. 'నిస్సాన్ మైక్రా ప్రైమో' అనే పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ సాధారణం వేరియంట్‌తో పోల్చుకుంటే, అదనపు ఫీచర్లను, ఆకర్షనీయమైన లుక్‌ను కలిగి ఉండనుంది.

నిస్సాన్ ప్రైమో లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్లు:

  • అస్థెటిక్ ఎల్ఈడి లైట్స్
  • రిమోట్ కంట్రోల్డ్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్
  • పెరల్ వైట్ బాడీ కలర్‌పై ఆకర్షనీయమైన 'ప్రైమో' బాడీ డెకాల్స్ (స్టిక్కర్స్)
  • ఇండికేటర్లతో కూడిన రియర్ పార్కింగ్ సెన్సార్స్
  • యూఎస్‍‌బి సపోర్ట్‌తో కూడిన డబుల్ డిన్ ప్రీమియం ఆడియో సిస్టమ్

నిస్సాన్ మైక్రా ప్రైమో

నిస్సాన్ మైక్రా ప్రైమో

  • అస్థెటిక్ ఎల్ఈడి లైట్స్
  • నిస్సాన్ మైక్రా ప్రైమో

    నిస్సాన్ మైక్రా ప్రైమో

    • రిమోట్ కంట్రోల్డ్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్
    • నిస్సాన్ మైక్రా ప్రైమో

      నిస్సాన్ మైక్రా ప్రైమో

      • పెరల్ వైట్ బాడీ కలర్‌పై ఆకర్షనీయమైన 'ప్రైమో' బాడీ డెకాల్స్ (స్టిక్కర్స్)
      • నిస్సాన్ మైక్రా ప్రైమో

        నిస్సాన్ మైక్రా ప్రైమో

        • ఇండికేటర్లతో కూడిన రియర్ పార్కింగ్ సెన్సార్స్
        • నిస్సాన్ మైక్రా ప్రైమో

          నిస్సాన్ మైక్రా ప్రైమో

          • యూఎస్‍‌బి సపోర్ట్‌తో కూడిన డబుల్ డిన్ ప్రీమియం ఆడియో సిస్టమ్

నిస్సాన్ మైక్రా ప్రైమో లిమిటెడ్ ఎడిషన్ నాలుగు వేరియంట్లలో ఎక్స్ఎల్, ఎక్స్‌వి (పెట్రోల్ వేరియంట్స్), ఎక్స్ఎల్, ఎక్స్‌వి (డీజిల్ వేరియంట్స్) లభ్యమవుతుంది. నిస్సాన్ ప్రైమో ధరలు రూ. 4.84 లక్షల నుంచి రూ. 6.63 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉన్నాయి.

ఇదే కాకుండా నిస్సాన్ అందిస్తున్న మైక్రా, సన్నీ కార్ల కొనుగోలుపై కూడా కంపెనీ కస్టమర్లకు విశిష్టమైన ఆఫర్లను అందిస్తోంది. నిస్సాన్ మైక్రా లేదా నిస్సాన్ సన్నీ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లలో ప్రతివారం ఒక్క లక్కీ కస్టమర్‌ను ఎంపిక చేసి వారికి 100 శాతం రీఫండ్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా, సదరు కస్టమర్ కంపెనీ నిర్వహిస్తున్న కాంటెస్ట్ లోనికి ప్రవేశించడానికి అర్హత కల్పించబడుతుంది. ఇందులో నెగ్గిన కస్టమర్‌కు ఈ సీజన్ ముగిసే నాటికి రూ.16.5 లక్షల విలువైన 500 గ్రాముల బంగారాన్ని గెలుచుకునే అవకాశం ఉంటుంది.

నిస్సాన్ అందిస్తున్న ఇతర ఆసక్తికరమైన ఆఫర్లు:

  • వాహన ఎక్సేంజ్‌పై రూ.10,000 అదనపు ఎక్సేంజ్ బోనస్
  • అన్ని కార్లపై తక్కువ ఈఎమ్ఐ
  • 2 గ్రా బంగారం లేదా విడిభాగాలకు సంబంధించిన అశ్శూర్డ్ గిఫ్ట్స్
  • అన్ని కొనుగోళ్లపై అదనపు వారంటీ

ఈ ఆఫర్లన్నీ కూడా ఈ పండుగ సీజన్‌లో కొనుగోలు చేసే కార్లపై మాత్రమే వర్తిస్తాయి.

More from DriveSpark

Article Published On: Thursday, October 11, 2012, 16:34 [IST]
English summary
Japanese carmaker Nissan has launched the limited edition Nissan Micra PRIMO. The new Nissan Micra PRIMO has got some additional features such as double DIN kenwood stereo with USB, Bluetooth connectivity, rear parking sensor and turn indicators on the outside rear view mirrors.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+