మలేషియా: ఇంపల్ బాడీ కిట్‌తో విడుదలైన నిస్సాన్ సన్నీ

By Ravi

ఇది నిస్సాన్ సన్నీ సెడానే బాబూ..!ఈ ఫోటోను గమనించారా..? ఇదేదో ఫారిన్ కారనుంటుకుంటే మీరు కూడా క్లచ్‌పై కాలేసినట్లే..! ఇది మన మేడ్ ఇన్ ఇండియా నిస్సాన్ సన్నీ సెడాన్ కారు. జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ భారత్‌లో తయారు చేస్తున్న సన్నీ సెడాన్‌కు ఇంపల్ బాడీ కిట్‌ని చేర్చి ఇదిగో ఇలా మార్చేసింది. నిస్సాన్ తమ సన్నీ సెడాన్ 'అల్మెరా' అనే పేరుతో గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తోంది. ఇంపల్ బాడీ కిట్‌ని చేర్చిన నిస్సాన్ అల్మెరా (మన మార్కెట్లో నిస్సాన్ సన్నీ) కారు కంపెనీ మలేషియాలో విడుల చేసింది. అక్కడి మార్కెట్లో ఇది రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది.

మలేషియాలో నిస్సాన్ అల్మెరా ప్రారంభ ధర 66,800 మలేషియన్ రింగ్గిట్స్ (దాదాపు రూ. 11.87 లక్షలు) కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర 79,800 రింగ్గిట్స్ (దాదాపు రూ. 14.19 లక్షలు)గా ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, రియర్ పార్కింగ్ కెమెరాలతో కూడిన టచ్‌స్క్రీన్ మల్టీమీడియా సిస్టమ్ 'ప్రీమియం నావీ' ప్యాక్ ఆప్షన్‌తో కూడా ఇది లభిస్తుంది. ఇంపల్ బాడీ కిట్ జోడించిన నిస్సాన్ అల్మెరాను క్రింది ఫోటోలో గమనించవచ్చు.

నిస్సాన్ అల్మెరా సెడాన్‌

ఇంపల్ బాడీ కిట్ చేర్చిన నిస్సాన్ అల్మెరా సెడాన్‌

నిస్సాన్ అల్మెరా సెడాన్‌

ఇంపల్ బాడీ కిట్ చేర్చిన నిస్సాన్ అల్మెరా సెడాన్‌

నిస్సాన్ అల్మెరా సెడాన్‌

ఇంపల్ బాడీ కిట్ చేర్చిన నిస్సాన్ అల్మెరా సెడాన్‌

నిస్సాన్ అల్మెరా సెడాన్‌

ఇంపల్ బాడీ కిట్ చేర్చిన నిస్సాన్ అల్మెరా సెడాన్‌

నిస్సాన్ అల్మెరా సెడాన్‌

ఇంపల్ బాడీ కిట్ చేర్చిన నిస్సాన్ అల్మెరా సెడాన్‌

నిస్సాన్ అల్మెరా సెడాన్‌
నిస్సాన్ అల్మెరా సెడాన్‌
నిస్సాన్ అల్మెరా సెడాన్‌
నిస్సాన్ అల్మెరా సెడాన్‌

ఇంపల్స్ బాడీ కిట్ చేర్చిన నిస్సాన్ అల్మెరా సెడాన్

నిస్సాన్ అల్మెరా సెడాన్‌
నిస్సాన్ అల్మెరా సెడాన్‌
నిస్సాన్ అల్మెరా సెడాన్‌
నిస్సాన్ అల్మెరా సెడాన్‌
నిస్సాన్ అల్మెరా సెడాన్‌

కొనుగోలుదారులు తమ నిస్సాన్ అల్మెరా సెడాన్‌కు ఇంపల్ బాడీ కిట్‌ను అమర్చుకోవచ్చు. ఇందు కోసం వారు 9,500 రింగ్గిట్స్ (దాదాపు రూ.1.69 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. ఇంపల్ బాడీ కిట్‌లో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, స్పోర్ట్స్ రిమ్స్, ఇంపల్ బ్లాస్ట్ 2 ఎగ్జాస్ట్ మఫ్లర్, 17-ఇంచ్ ఇంపల్ ఔరా ఎస్ఎక్స్-20 అల్లాయ్ వీల్స్, ఇంపల్ కంప్లీట్ ఏరోకిట్ రియర్ వింగ్ స్పాయిలర్ ఫీచర్లను పొందవచ్చు. నిస్సాన్ అల్మెరాకి ఇంపల్‌ బాడీ కిట్‌ను జోడించటం ద్వారా ప్రీమియం, స్టయిలిష్, స్పోర్టీ లుక్ అండ్ ఫీల్‌ను అనుభూతి చెందవచ్చు.

నిస్సాన్ అల్మెరా కీలక ఫీచర్లు:

  • డోర్ విజర్స్, లెథర్ సీట్స్
  • ఎల్ఈడి స్టెయిన్‌లెస్ స్టీక్ కిక్‌ప్లేట్స్
  • 6-ఇంచ్ టచ్‌స్క్రీన్ మల్టీమీడియా నావిగేషన్ సిస్టమ్
  • రియర్ వ్యూ కెమెరా
  • డివిడి, ఐపాడ్, యూఎస్‌బి, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన మ్యూజిక్ సిస్టమ్
  • సైడ్ మిర్రర్లపై ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్
  • బూట్ ట్రే
  • ఆటోమేటిక్ వేరియంట్‌లో స్పోర్ట్ పెడల్స్
  • సోలార్ గార్డ్ ఆర్మోర్‌కోట్
  • వి-కూల్ ఎలైట్

More from DriveSpark

Article Published On: Wednesday, November 7, 2012, 17:02 [IST]
English summary
Japanese carmaker Nissan has launched the made in India Sunny sedan in Malaysia with introduction of eye catching Impul body kit. The Nissan Almera sits in a price range of RM 66,800 (around Rs. 11.87 lakhs) to RM 79,800 (around Rs. 14.19 lakhs) including taxes and insurance.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+