డ్రైవర్ సాయం లేకుండా నడుస్తుంది, దానంతటదే పార్కింగ్ చేసుకుంటుంది

By Ravi

ఇదిగో ఈ ఫోటోల్లో కనిపిస్తున్న కారును చూశారా..? ఇది ఆషామాషీ కారు కాదు. పిలిస్తే పలుకుతుంది.. ఒక్క ఫోన్ కొడితే నడుచుకుంటూ మన దగ్గరకు వచ్చేస్తుంది. జేమ్స్ బాండ్ తరహా సినిమాల్లో కనిపించే ఇలాంటి అధునాత కారును జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ అభివృద్ధి చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు దానంతట అదే పార్క్ చేసుకోవటమే కాకుండా, స్మార్ట్ ఫోన్ నుంచి కాల్ చేసినప్పుడు యజమానికి దక్కరకు వచ్చి చేరుతుంది.

'నిస్సాన్ ఎన్ఎస్‌సి-2015'గా పిలిచే ఈ ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ కారును టోక్యోలో జరుగుతున్న సీటెక్ 2012లో నిస్సాన్ మోటర్ కార్పోరేషన్ ప్రదర్శనకు ఉంచింది. ఈ కారు పేరు సూచించేటట్లుగానే, 2015 నాటికి ఈ ఎన్ఎస్‌సి-2015 ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని నిస్సాన్ యోచిస్తోంది. నిస్సాన్ నుంచి గ్లోబల్ మార్కెట్లలో అత్యంత పాపులర్ అయిన ఎలక్ట్రిక్ కారు 'నిస్సాన్ లీఫ్'కు మోడిఫైడ్ వెర్షనే ఈ ఎన్‌ఎస్‌సి-2015 కారు.

నిస్సాన్ ఎన్ఎస్‌సి-2015 - ఎలక్ట్రిక్ కారు

నిస్సాన్ ఎన్ఎస్‌సి-2015 - ఎలక్ట్రిక్ కారు

'నిస్సాన్ ఎన్ఎస్‌సి-2015'గా పిలిచే ఈ ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ కారును టోక్యోలో జరుగుతున్న సీటెక్ 2012లో నిస్సాన్ మోటర్ కార్పోరేషన్ ప్రదర్శనకు ఉంచింది. ఈ కారు పేరు సూచించేటట్లుగానే, 2015 నాటికి ఈ ఎన్ఎస్‌సి-2015 ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని నిస్సాన్ యోచిస్తోంది.

నిస్సాన్ ఎన్ఎస్‌సి-2015 - స్మార్ట్‌ఫోన్ కంట్రోల్స్

నిస్సాన్ ఎన్ఎస్‌సి-2015 - స్మార్ట్‌ఫోన్ కంట్రోల్స్

స్మార్ట్ ఫోన్ ద్వారా ఇవ్వబడే సూచనల ఆధారంగా ఈ కారు ఆటోమేటిక్‌గా దానంతట అదే పార్కింగ్ కూడా చేసుకుంటుంది. ఈ కారును స్మార్ట్ ఫోన్ ద్వారానే లాక్ కూడా చేయవచ్చు. ఈ కారులో ఓ సెక్యూరిటీ కెమెరా అమర్చబడి ఉంటుంది. ఎవరైనా కారును అపహరించడానికి ప్రయత్నించినట్లయితే, కారులోని సెక్యూరిటీ సిస్టమ్ పనిచేయటం ప్రారంభించి డ్రైవర్‌ను (యజమానిని) అప్రమత్తం చేస్తుంది.

నిస్సాన్ ఎన్ఎస్‌సి-2015 - ఇంటీరియర్స్

నిస్సాన్ ఎన్ఎస్‌సి-2015 - ఇంటీరియర్స్

సెన్సార్లు, కెమెరాలు, కంప్యూటర్లు, నావిగేషన్ సిస్టమ్, 4జి కమ్యానికేషన్ టెక్నాలజీ, స్టీరింగ్ వీల్‌ను తిప్పడానికి, గేర్లు మార్చడానికి, బ్రేక్‌ను అప్లయ్ చేయడానికి అనుకూలమైన రోబోటిక్స్ వంటి సాంకేతిక వ్యవస్థలతో ఈ నిస్సాన్ ఎన్ఎస్‌సి-2015 ఎలక్ట్రిక్ కారు పనిచేస్తుంది.

నిస్సాన్ ఎన్ఎస్‌సి-2015 - విడుదల

నిస్సాన్ ఎన్ఎస్‌సి-2015 - విడుదల

నిస్సాన్ నుంచి గ్లోబల్ మార్కెట్లలో అత్యంత పాపులర్ అయిన ఎలక్ట్రిక్ కారు 'నిస్సాన్ లీఫ్'కు మోడిఫైడ్ వెర్షనే ఈ ఎన్‌ఎస్‌సి-2015 కారు. ఈ కారు పేరు సూచించేటట్లుగానే, 2015 నాటికి ఈ ఎన్ఎస్‌సి-2015 ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని నిస్సాన్ యోచిస్తోంది.

నిస్సాన్ ఎన్ఎస్‌సి-2015 - డెమో

నిస్సాన్ ఎన్ఎస్‌సి-2015 - డెమో

సీటెక్ 2012 సదస్సులో ఈ కారును డెమోనిస్ట్రేట్ చేసినప్పుడు, ఇది డ్రైవర్ సాయం లేకుండా ముందుకు, వెనుకకు గంటకు 3 మైళ్ల (గంటకు 5 కి.మీ.) వేగంతో ప్రయాణించింది. స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ కారును టర్న్ చేయటం కూడా వీలవుతుంది.


సెన్సార్లు, కెమెరాలు, కంప్యూటర్లు, నావిగేషన్ సిస్టమ్, 4జి కమ్యానికేషన్ టెక్నాలజీ, స్టీరింగ్ వీల్‌ను తిప్పడానికి, గేర్లు మార్చడానికి, బ్రేక్‌ను అప్లయ్ చేయడానికి అనుకూలమైన రోబోటిక్స్ వంటి సాంకేతిక వ్యవస్థలతో ఈ నిస్సాన్ ఎన్ఎస్‌సి-2015 ఎలక్ట్రిక్ కారు పనిచేస్తుంది. సీటెక్ 2012 సదస్సులో ఈ కారును డెమోనిస్ట్రేట్ చేసినప్పుడు, ఇది డ్రైవర్ సాయం లేకుండా ముందుకు, వెనుకకు గంటకు 3 మైళ్ల (గంటకు 5 కి.మీ.) వేగంతో ప్రయాణించింది. స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ కారును టర్న్ చేయటం కూడా వీలవుతుంది.

అంతేకాకుండా, ఈ కారు రోడ్ మార్కింగ్‌లను గుర్తించి, క్రాసింగ్‌ల వద్ద ఆటోమేటిక్ నిలిచిపోవటం కూడా చేస్తుండటాన్ని కంపెనీ ప్రదర్శించింది. స్మార్ట్ ఫోన్ ద్వారా ఇవ్వబడే సూచనల ఆధారంగా ఈ కారు ఆటోమేటిక్‌గా దానంతట అదే పార్కింగ్ కూడా చేసుకుంటుంది. తొలుత ఈ వాహనం పార్కింగ్‌కు అవసరమయ్యే ఖాలీ ప్రదేశాన్ని (ఓపెన్ పార్కింగ్ స్పేస్), పరిసరాలను గుర్తించిన తర్వాత ఆటోమేటెడ్ పార్కింగ్ సిస్టమ్ పనిచేయడం ప్రారంభిస్తుంది.

అంతేకాదండోయ్.. ఈ కారును స్మార్ట్ ఫోన్ ద్వారానే లాక్ కూడా చేయవచ్చు. ఈ కారులో ఓ సెక్యూరిటీ కెమెరా అమర్చబడి ఉంటుంది. ఎవరైనా కారును అపహరించడానికి ప్రయత్నించినట్లయితే, కారులోని సెక్యూరిటీ సిస్టమ్ పనిచేయటం ప్రారంభించి డ్రైవర్‌ను (యజమానిని) అప్రమత్తం చేస్తుంది. ఇటీవలి కాలంలే అనేక కార్ కంపెనీలు డ్రైవర్ సాయం అవసరం లేకుండా నడిచే కార్లను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి కార్లు పూర్తిగా వాడుకలోకి రావటానికి మరింత సమయం పట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, October 8, 2012, 11:41 [IST]
English summary
Japanese carmaker Nissan has showcased an electric prototype car called 'NSC-2015' at the Ceatec 2012 show in Tokyo. This electric car is able to park itself and come to the driver when called through his/her smart phone. The NSC-2015 is a modified version of Nissan’s Leaf model.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+