స్వామి నిత్యానంద పల్లకి - ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ
రాసలీలల గురువు స్వామి నిత్యానందని అరెస్టు చేయమని కర్ణాటక సర్కారు ఆదేశించటం, అది విని గురువు గారు పరారు కావటం, ఆ తర్వాత నాటకీయంగా రామ్‌నగర్ కోర్టు ముందు లొంగిపోవటం జరిగింది. ఈ నేపథ్యంలో వాదోపవాదాలు విన్న కోర్టు స్వామీ నిత్యానందను ఒక్క రోజు జ్యుడిషియల్ కస్టడిలో ఉంచాల్సిందిగా రిమాండుకు పంపింది. దీంతో గురువు గారు, పోలీసు లాంఛనాలతో అత్తారింటికి పయనమయ్యారు. లైంగిక వేధింపులు, రేప్, భూకబ్జా తదితర అభియోగాల క్రింద నిత్యానందను అరెస్ట్ చేయటం జరిగింది.
సరే గురువు గారి అరెస్టు గురించి పక్కనబెడితే.. రాసలీలల స్వామి ఉపయోగించి రమ్యమైన కారు గురించి కూసింత సమాచారం తెలుసుకుందాం రండి..! అనధికారిక లెక్కల ప్రకారం గురువు గారి వద్ద ఎన్ని కార్లు ఉన్నాయో తెలియదు గానీ.. అధికారిక సమాచారం ప్రకారం ఆయన వద్ద ఓ ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ మాత్రం మనకు కనిపిస్తుంది. రాయల్ లుక్ కోరుకునే సెలబ్రిటీలు, ప్రముఖులు ఎంచుకునే ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీనే నిత్యానంద కూడా ఎంచుకోవటం జరిగింది. అయితే, ఈరోజు కోర్టుకు మాత్రం కేరళ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన ఓ తెలుపు రంగు కారులో రావటం జరిగింది.

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ ఇటు ఆన్-రోడ్ జర్నీకు అటు ఆఫ్-రోడ్ జర్నీకి చక్కగా సరిపోతుంది. ఫోర్డ్ ఎండీవర్ ఇండియన్ మార్కెట్లో సక్సెస్ కావటానికి దాని స్టన్నింగ్ లుక్, లగ్జరీ ఫీచర్స్, కంఫర్టబల్ డ్రైవింగ్, అమెరికన్ బ్రాండ్‌లే ప్రధాణ కారణం. ఫోర్డ్ ఎండీవర్ 3.0 లీటర్ 4X4 ఏటి, 3.0 లీటర్ 4x2 ఏటి, 2.5 లీటర్ 4X2 ఎమ్‌టి, హారికేన్ లిమిటెడ్ ఎడిషన్ అనే నాలుగు వేరియంట్లలో లభ్యమవుతుంది. భారత మార్కెట్లో ఫోర్డ్ ఎండీవర్ ధరలు రూ.18 లక్షల నుంచి రూ.22 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








