మారుతి సుజుకి స్విఫ్ట్ కార్ల ఉత్పత్తి బంద్; స్టాక్ ఖాళీ
మారుతి సుజుకి ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు స్టాక్ త్వరలోనే ఖాళీ అయిపోనుంది. మానేసర్ ప్లాంటులో లాకౌట్‌లో ఉండటంతో ఈ మోడల్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ ప్లాంటులో ఉత్పత్తి అయి, స్టాక్ యార్డ్‌లో ఉన్న స్విఫ్ట్ కార్లను కంపెనీ మార్కెట్‌కు తరలిస్తోంది. అయితే, డిశ్పాచ్ అవుతున్న ఈ కార్లన్నీ కూడా ఇప్పటికే బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ చేయనున్నారు.
కొత్తగా బుకింగ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ఈ మోడల్ కోసం మరింత ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి కనబడుతోంది. గడచిన సంవత్సరం మానేసర్ ప్లాంటులో సమ్మె జరిగినప్పుడు సిఫ్ట్ మోడల్ వెయింటింగ్ పీరియడ్ 6-9 నెలలకు పెరిగింది. అయితే, ఆ తర్వాత కంపెనీ ఫియట్ నుంచి డీజిల్ ఇంజన్లను కొనుగోలు చేసి, మానేసర్‌లోని రెండవ యూనిట్‌లో ఉత్పత్తిని ప్రారంభించి దీని వెయిటింగ్ పీరియడ్‌ను 2-3 నెలలకు తగ్గించడం జరిగింది.
కాగా.. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే, స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్ మరోసారి గణనీయంగా పెరిగే అవకాశాల కనిపిస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్లో డీజిల్ కార్లకు ఎక్కువగా డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. స్విఫ్ట్ పెట్రోల్ వెర్షన్ కార్ల కన్నా డీజిల్ కార్లకే ఎక్కువ డిమాండ్, వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ తాజా పరిణామాలు డీజిల్ వెర్షన్ స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్‌ను మరింత పెంచనున్నాయి.
మారుతి సుజుకి సిఫ్ట్‌లో రిఫ్రెష్డ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టిన తర్వాత మార్కెట్లో ఈ మోడల్‌కు గిరాకీ ఒక్కసారిగా ఊపందుకుంది. పాత స్విఫ్ట్‌తో పోల్చుకుంటే అనేక మార్పులు, చేర్పులతో వచ్చిన కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ భారీ బుకింగ్‌లతో మార్కెట్లో రికార్డులను సృష్టించింది. ఉత్పత్తి సామర్థ్యానికి మించి ఈ మోడల్‌కు డిమాండ్ రావటం జరిగింది. మారుతి సుజుకి కంపెనీకు అత్యధిక మార్జిన్లను తెచ్చిన మోడళ్లు కూడా స్విఫ్ట్, డిజైర్ కార్లే.
మారుతి స్విఫ్ట్‌కు ప్రత్యామ్నాయ మోడళ్లు:
మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్ లాకౌట్ కారణంగా, కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడళ్లు స్విఫ్ట్, డిజైర్‌ల అమ్మకాలు నిలిచిపోవడంతో, ఈ సెగ్మెంట్లోని ఇతర కంపెనీల నుంచి లభిస్తున్న మోడళ్లకు గిరాకీ ఊపందుకోనుంది. రానున్న రోజుల్లో టొయోటా ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్, టొయోటా ఎతియోస్ సెడాన్, ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ క్లాసిక్, హ్యుందాయ్ ఐ20, టాటా ఇండికా-ఇండిగో రేంజ్ కార్లకు గిరాకీ జోరందుకోనుంది.


Click it and Unblock the Notifications








