హ్యుందాయ్ ఐ20 ఇప్పుడు ఎల్ఈడి డిఆర్ఎల్స్‌తో..
హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ-జెన్ ఐ20లో ఇప్పుడు ఓ సరికొత్త స్టాండర్డ్ ఫీచర్‌తో లభ్యం కానుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ కొత్త ఐ20కు ఎల్‌డిఈ డే-టైమ్ రన్నింగ్ లైట్స్ (డిఆర్ఎల్) ఫీచర్‌ను జోడించింది. హ్యుందాయ్ ఐ20 టాప్ ఎండ్ వేరియంట్స్ అయిన ఐ20 స్పోర్ట్, ఐ20 ఆస్టాలలో కంపెనీ ఈ ఫీచర్‌ను ఆఫర్ చేస్తుంది. ఫ్లూయిడిక్ ఐ20 ఫాగ్‌ల్యాంప్స్‌కు దిగువన ఈ డిఎల్ఆర్‌లను అమర్చారు. అయితే, ఈ ఫీచర్ ఉచితంగా మాత్రం రాదు. ఇందుకోసం కంపెనీ కస్టమర్ల నుంచి రూ.10,000 వసూలు చేస్తోంది.
హ్యుందాయ్ ఐ20 కారుకు ఈ ఎల్‌ఈడి డే-టైమ్ రన్నింగ్ లైట్స్ ఫీచర్ జోడించటం వలన కారుకు మరింత స్టయిలిష్, స్పోర్టీ లుక్ రావటమే కాకుండా, రాత్రివేళల్లో, మంచు సమయాల్లో రోడ్డుపై మరింత స్పష్టమైన విజబిలిటీని కూడా ఇది ఆఫర్ చేస్తుంది. వాస్తవానికి ఈ ధరశ్రేణిలో లభించే వాహనాల్లో ఎల్‌ఈడి డిఆర్ఎల్ ఫీచర్ ఉండదు. ఈ సెగ్మంట్లో ఈ ఫీచర్ కలిగిన మొట్టమొదటి హ్యాచ్‌బ్యాక్ కూడా ఐ20నే కావటం విశేషం. బయటి మార్కెట్లో ఇవి రూ.4,000 నుంచి అందుబాటులో ఉంటాయి. అయితే, ఇవి కంపెనీ అందించే క్వాలిటీని, ఫినిషింగ్‌ను మాత్రం కలిగి ఉండవు.

హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20 ఎల్ఈడి డిఆర్ఎల్స్:
హ్యుందాయ్ ఐ20 ఇప్పుడు ఎల్‌డిఈ డే-టైమ్ రన్నింగ్ లైట్స్ (డిఆర్ఎల్) ఫీచర్‌తో లభిస్తుంది. ఐ20 స్పోర్ట్, ఐ20 ఆస్టా వేరియంట్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ సం కంపెనీ కస్టమర్ల నుంచి రూ.10,000 అదనంగా వసూలు చేస్తోంది.

హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20 ఫీచర్లు:
* క్యాబిన్ మిర్రర్‌లో డిస్‌ప్లేతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా
* రాత్రివేళల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు యాంటీ-గ్లేర్ విజన్ అందించేలా రూపొందించిన ఎలక్ట్రో క్రోమిక్ మిర్రర్
* క్యాబిన్‌లో తాజా గాలిని అందించేలా ఏర్పాటు చేసిన క్లీన్ ఎయిర్-క్లస్టర్
* సాయంత్రం వేళల్లో బయటి కాంతి తగ్గినట్లయితే ఆటోమేటిక్ హెడ్‌లైట్లు ఆన్ అయ్యేలా ఏర్పాటు చేసిన ఆటో హెడ్‌లైట్ కంట్రోల్ ఫంక్షన్
* వెనుక వైపు (రియర్) డిస్క్ బ్రేక్స్
* సూపర్‌విజన్ క్లస్టర్
* వర్షం రాగానే ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యే రెయిన్ సెన్సింగ్ వైపర్స్

హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20 కంఫర్ట్ ఫీచర్లు:
* పుష్ బటన్ స్టార్ట్‌తో కూడిన స్మార్ట్ కీ
* వన్ టచ్ ట్రిపుల్ టర్న్ సిగ్నల్
* లెథర్‌తో కప్పబడిన స్టీరింగ్ వీల్, గేర్ షిఫ్ట్ నాబ్
* డ్రైవర్ సీట్ ఆర్మ్ రెస్ట్
* యాంత్రికంగా సర్దుబాటు చేసుకునే సైడ్ మిర్రర్స్ (ఎలక్ట్రిక్ అడ్జస్టబిల్ రియర్ వ్యూ మిర్రర్స్)
* టిల్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్
* లగేజ్ స్థలం కోసం వెనుకవైపు మడిచిపెట్టేందుకు వీలుగా డిజైన్ చేసి సీట్ (60:40 స్ప్లిట్ సీట్)

హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20 కంఫర్ట్ ఫీచర్లు:
* 4 స్పీకర్లు, 2 ట్వీటర్లతో కూడిన ప్రీమియం 2-డిన్ సిడి, ఎమ్‌పి3 ఆడియో సిస్టమ్
* మ్యూజిక్ సిస్టమ్‌కు యూఎస్‌బి, ఆక్స్-ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీ
* స్టీరింగ్‌పై అమర్చబడిన ఆడియో, బ్లూటూత్ కంట్రోల్స్
* మంచి స్టయిలిష్ లుక్‌నిచ్చే ఫ్రంట్ గ్రిల్
* 8-స్పోక్ స్పోర్టీ అల్లాయ్ వీల్స్
* స్టాంప్ ల్యాంప్‌తో కూడిన రియర్ స్పాయిలర్
* క్రోమ్ కోటింగ్ కలిగిన డోర్ హ్యాండిల్స్
* అవుట్ సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్స్

హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20 సేఫ్టీ ఫీచర్లు:
* ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు
* ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
* ప్రమాదవశాత్తూ ఇంజన్ స్టార్ట్ కావడాన్ని అడ్డుకునే "క్లచ్ లాక్ సిస్టమ్"
* కంగారులో అకస్మాత్తుగా బ్రేక్ పెడల్, యాక్సిలరేటర్ పెడల్ రెండింటినీ ఒకేసారి నొక్కినప్పుడు దానిని సెన్సార్‌లు గుర్తించి కారు వేగాన్ని తగ్గించేలా ఏర్పాటు చేసిన "స్మార్ట్ పెడల్ సిస్టమ్" టెక్నాలజీ
* కారు వేగాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా డోర్లు లాక్ అయ్యేలా ఏర్పాటు చేసిన స్పీడ్ సెన్సెంగ్ ఆటో డోర్ లాకింగ్ టెక్నాలజీ
* ఒకవేళ దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగినట్లయితే డోర్లు అన్‌లాక్ (ఓపెన్) అయ్యేలా ఏర్పాటు చేసిన ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాకింగ్ టెక్నాలజీ
* రివర్స్ పార్కింగ్ సెన్సార్స్

హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20 మైలేజ్:
2012 వెర్షన్ ఐ-జెన్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌లో డ్యూయెల్ విటివిటి (వేరియబుల్ వాల్వ్ టైమింగ్) టెక్నాలజీతో కూడిన రీఫైన్ చేయబడిన శక్తివంతమైన 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 84 పిఎస్‌ల పవర్‌ను విడుదల చేస్తూ, లీటరు పెట్రోల్‌కు 18.5 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.
హై-టెక్ 1.4 యూ2 సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 90 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తూ లీటరు డీజిల్‌కు 21.9 కి.మీ. మైలేజీని ఇస్తుంది. హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20 ఆటోమేటిక్ వేరియంట్లో 1.4 లీటర్ గమ్మా పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 100 పిఎస్‌ల గరిష్ట శక్తిని విడుదల చేస్తూ, లీటరు పెట్రోల్‌కు 15 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.

హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20 ధరలు:
పెట్రోల్ వేరియంట్ హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20 ధరలు:
* ఎరా - రూ. 4.82 లక్షలు
* మాగ్నా - రూ. 5.06 లక్షలు
* మాగ్నా (ఆప్షనల్) - రూ. 5.36 లక్షలు
* స్పోర్ట్జ్ - రూ. 5.85 లక్షలు
* ఆస్టా - రూ.6.32 లక్షలు
* ఆస్టా (ఆప్షనల్) సన్‌రూఫ్‌తో - రూ. 6.77 లక్షలు
* స్పోర్ట్జ్ (ఆటోమేటిక్) - రూ. 7.81 లక్షలు
డీజిల్ వేరియంట్ హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20 ధరలు:
* ఎరా - రూ. 6.07 లక్షలు
* మాగ్నా - రూ. 6.31 లక్షలు
* మాగ్నా (ఆప్షనల్) - రూ. 6.61 లక్షలు
* స్పోర్ట్జ్ - రూ. 7.10 లక్షలు
* ఆస్టా - రూ. 7.57 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)
కాగా.. ఈ ఏడాది మార్చ్ నెలలో హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఐ20 ఫ్లూయిడిక్ హ్యాచ్‌బ్యాక్‌ను అత్యంత ఆకర్షనీయమైన ధరతో (అప్పట్లో రూ.4.73 లక్షలు), మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో మొత్తం 12 వేరియంట్లలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సరికొత్త ఐ-జెన్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ డ్యూయెల్ విటివిటి (వేరియబుల్ వాల్వ్ టైమింగ్) టెక్నాలజీతో కూడిన రీఫైన్ చేయబడిన శక్తివంతమైన 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది గరిష్టంగా 84 పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తుంది.
అంతేకాకుండా ఇది ఆధునిక, హై-టెక్ 1.4 యూ2 సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్‌తో 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో కూడా లభిస్తుంది. ఇది గరిష్టంగా 90 బిహెచ్‌పిల శక్తిని, 22.4 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇకపోతే ఆటోమేటిక్ వేరియంట్లో 1.4 లీటర్ గమ్మా పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 100 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 13.9 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. కొత్త ఐ20లో సరికొత్త ఫీచర్లను హ్యుందాయ్ ఆఫర్ చేస్తుంది. వాటి వివరాలను పై ఫోటో ఫీచర్‌లో గమనించవచ్చు.


Click it and Unblock the Notifications








