స్పెషల్ ఎడిషన్ నానో ఇప్పుడు అన్ని మార్కెట్లలో లభ్యం!

By Ravi

టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు టాటా నానోలో కంపెనీ ఇటీవలే ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని వినియోగదారులకు కొత్తదనాన్ని అందించేందుకు గాను టాటా నానోలో రూ.25,000 విలువైన అదనపు ఫీచర్లను జోడించి, పాత ధరకే సరికొత్త సరికొత్త స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ నానో కారును కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభంలో భాగంగా ఈ కారును కొన్ని మార్కెట్లకు మాత్రమే టాటా మోటార్స్ పరిమితం చేసింది.

కాగా.. ఇప్పుడు ఈ స్పెషల్ ఎడిషన్ టాటా నానో కారు దేశవ్యాప్తంగా ఉన్న టాటా అధీకృత అవుట్‌లెట్లలో ఈ కారును విక్రయించనుంది. స్పెషల్ ఎడిషన్ నానాలో అందిస్తున్న రూ.25,000 విలువ కలిగిన ఐదు అదనపు ఫీచర్లను కంపెనీ అందిస్తోంది. ఇది ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం సిఎక్స్, ఎల్ఎక్స్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. స్టాండర్డ్ వేరియంట్‌లో లభ్యం కాదు.

స్పెషల్ ఎడిషన్ స్టిక్కర్

స్పెషల్ ఎడిషన్ స్టిక్కర్

నానోకు ఇరువైపులా అంటించిన స్పెషల్ ఎడిషన్ స్టిక్కర్స్ (బ్యాడ్జెస్) మీ టాటా నానో మిగతా నానోల కల్లా స్పెషల్ అని గుర్తు చేస్తుంది.

బాడీ గ్రాఫిక్స్

బాడీ గ్రాఫిక్స్

బయటివైపు డోర్లకు ఇరువైపులా అంటించిన ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్ మీ టాటా నానోకు ఓ విశిష్టమైన లుక్‌ని ఆఫర్ చేస్తుంది. ఈ స్పెషల్ బాడీ గ్రాఫిక్స్ కేవలం ఎల్ఎక్స్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. సిఎక్స్ వేరియంట్‌లో లభ్యం కాదు.

అల్లాయ్ వీల్స్

అల్లాయ్ వీల్స్

స్పెషల్ ఎడిషన్ నానోకు అమర్చిన కస్టమైజ్డ్ అల్లాయ్ వీల్స్ మీ టాటా నానోకు స్టయిలిష్ లుక్‌నిచ్చి, మీ డ్రైవ్‌ను మరింత స్టయిలిష్‌గా మార్చుతుంది.

గ్లౌవ్ బాక్స్

గ్లౌవ్ బాక్స్

టాటా నానో డ్యాష్ బోర్డులో ఎడమ వైపు, కుడి వైపు ఏర్పాటు చేసిన గ్లౌవ్ బాక్సులతో మీ నానోలో కావల్సిన స్టోరేజ్ స్పేస్ ఏర్పడుతుంది.

కార్ ఆడియో సిస్టమ్

కార్ ఆడియో సిస్టమ్

ఎమ్‌పి3 ప్లేయర్, ఐపాడ్ కనెక్టివిటీ, యూఎస్‌బి. ఆక్స్-ఇన్ సపోర్ట్, రెండు ఫ్రంట్ డోర్ స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్ మీ డ్రైవ్‌ను మరింత ఉల్లాసవంతంగా మార్చుతుంది.


టాటా నానోలో 624సీసీ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 38 పిఎస్‌ల శక్తిని, 51 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 25.4 కిలోమీటర్ల మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది. నానో కారు తక్కువ బరువు (600 కేజీలు) ఉండటం కారణంగా అధిక మైలేజ్‌ను పొందటం సాధ్యమవుతుంది. ఇది కిలోమీటరుకు కేవలం 92.7 గ్రాముల కర్బన ఉద్ఘారాలను మాత్రమే విడుదల చేస్తుంది. టాటా నానో గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు. దీని టర్నింగ్ రేడియస్ 4 మీటర్లు మాత్రమే.

More from DriveSpark

Article Published On: Saturday, November 10, 2012, 11:48 [IST]
English summary
Tata Motors launches a Nano Special Edition, packed with accessories worth Rs.25,000, like Alloy Wheels, Blaupunkt Music System, Glove Box and Designer De-cals. This is an introductory special offer available at the same price for limited stocks only.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+