అక్టోబర్ నెలలో విడుదల కానున్న ఏడు కొత్త కార్లు

పండుగ సీజన్ వచ్చేసింది. ఈ పండుగ సీజన్‌లో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు కార్ కంపెనీలు సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు కొత్త కార్లతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొన్న కంపెనీలు తమ కార్లపై వివిధ తగ్గింపులు, ప్రోత్సాహకాలు, పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ వారంలోనే దాదాపు ఏడు కొత్త మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి. వీటి వివరాల గురించి ఓ లుక్కేద్దాం రండి..!

అక్టోబర్ నెలలో విడుదల కానున్న కార్లు:
1. కొత్త ఫోర్డ్ ఫిగో
2. కొత్త చెవర్లే స్పార్క్
3. కొత్త మారుతి సుజుకి ఆల్టో 800
4. టాటా ఇండిగో మాంజా క్లబ్ క్లాస్
5. టాటా సఫారీ స్టోర్మ్
6. మహీంద్రా-శాంగ్‌యాంగ్ రెక్స్టన్
8. హోండా బ్రయో ఆటోమేటిక్

విడుదల తేది - అక్టోబర్ 15, 2012

విడుదల తేది - అక్టోబర్ 15, 2012

ఫోర్డ్ ఇండియా అందిస్తున్న చిన్న కారు 'ఫోర్డ్ ఫిగో'లో కంపెనీ రిఫ్రెష్డ్ వెర్షన్‌ను అక్టోబర్ 15, 2012న మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ఫోర్డ్ ఫిగో పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 3.85 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గాను డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 4.82 లక్షలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గాను ఉన్నాయి. కొత్త హెడ్‌ల్యాంప్స్, కొత్త క్రోమ్ గ్రిల్, ఫెండర్, కొత్త టెయిల్ ల్యాంప్స్, విశాలమైన ఇంటీరియర్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్టీరింగ్ వీల్‌పై ఏర్పాటు చేయబడిన ఆడియో కంట్రోల్స్, మరింత విశాలమైన బూట్ స్పేస్, ఆకర్షనీయమైన అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లను ఫోర్డ్ తమ కొత్త ఫిగోలో జోడించింది.

విడుదల తేది - అక్టోబర్ 15, 2012

విడుదల తేది - అక్టోబర్ 15, 2012

జనరల్ మోటార్స్‌ అందిస్తున్న ఎంట్రీ లెవల్ స్మాల్ కారు 'చెవర్లే స్పార్క్'లో కూడా మరో సరికొత్త వేరియంట్ ఈనెలలో మార్కెట్లోకి రానుంది. డిజైన్ పరంగా, మైలేజ్ పరంగా ప్రస్తుతం లభిస్తున్న చెవర్లే స్పార్క్ కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండేలా తీర్చిదిద్దిన అప్‌గ్రేడెడ్ చెవర్లే స్పార్క్ ఈనెల 15న మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం. గడచిన ఐదేళ్ల క్రితం చెవర్లే స్పార్క్ దేశీయ మార్కెట్లో విడుదలైంది. సరికొత్త లుక్ అండ్ ఫీల్‌నిచ్చే డిజైన్, రిఫ్రెష్డ్ ఇంటీరియర్స్, రీట్యూన్ చేయబడిన ఇంజన్ వంటి ప్రధాన మార్పులతో కొత్త చెవర్లే స్పార్క్ మార్కెట్లోకి రానుంది.

విడుదల తేది - అక్టోబర్ 16, 2012

విడుదల తేది - అక్టోబర్ 16, 2012

మారుతి సుజుకి నుంచి ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిన్న కారు ఆల్టో 800 ఈనెల 16న మార్కెట్లో విడుదల కానుంది. సరికొత్త మారుతి సుజుకి ఆల్టో 800 కారులో రీట్యూన్ చేయబడిన 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 47.5 బిహెచ్‌పిల శక్తిని, 69 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభించే కొత్త ఆల్టో 800 లీటరు పెట్రోల్‌కు 22.74 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. పాత వెర్షన్‌తో పోల్చుకుంటే ఈ మైలేజ్ 15 శాతం ఎక్కువ.

విడుదల తేది - అక్టోబర్ 16, 2012

విడుదల తేది - అక్టోబర్ 16, 2012

పండుగ సీజన్ కోసం ఇటీవలే రిఫ్రెష్డ్ టాటా ఇండికా ఈవి2ని ప్రవేశపెట్టిన టాటా మోటార్స్ ఈనెల 16న మరొక కొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. కంపెనీ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ సెడాన్ మాంజాలో 'టాటా మాంజా క్లబ్ క్లాస్' అనే పేరుతో పిలిచే ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను టాటా మోటార్స్ విడుదల చేయనుంది. ఇందులో, టచ్ స్క్రీన్ మల్టీ మీడియా నావిగేషన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇటాలియన్ లెథర్ సీటింగ్, కొత్త డిజైన్ కలిగిన 8-స్పోక్ అల్లాయ్ వీల్స్, బెస్ట్ క్వాలిటీ సీట్ ఫ్యాబ్రిక్, మరింత క్రోమ్, కాన్స్టాంట్ రూఫ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. బేస్ వేరియంట్ టాటా మాంజా ఎల్ఎస్ ఇప్పుడు 75 హార్స్‌పవర్ కలిగిన క్వాడ్రాజెట్ ఇంజన్‌తో లభ్యం కానుంది. గతంలో ఈ వేరియంట్‌లో 90 హార్స్‌పవర్ క్వాడ్రాజెట్ (90 హెచ్‌పి సఫారీ ఇంజన్)ను ఉపయోగించేవారు.

విడుదల తేది - అక్టోబర్ 17, 2012

విడుదల తేది - అక్టోబర్ 17, 2012

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా, కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ శాంగ్‌యాంగ్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ప్రీమియం ఎస్‌యూవీ 'రెక్స్టన్' ఈనెల 17న మార్కెట్లో విడుదల కానుంది. ఇండియాలో శాంగ్‌యాంగ్ పోర్ట్‌ఫోలియో నుంచి రానున్న మొట్టమొదటి ఉత్పత్తి రెక్స్టన్. శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఎస్‌యూవీ ఇప్పటికే 66 దేశాల్లో లభ్యమవుతోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో విడుదల కానున్న శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఎస్‌యూవీ మూడవ తరానికి (థర్డ్ జనరేషన్)కు చెందినది.

విడుదల తేది - అక్టోబర్ 17, 2012

విడుదల తేది - అక్టోబర్ 17, 2012

ఎస్‌యూవీ సెగ్మెంట్లో అగ్గి రాజేంకుదు టాటా మోటార్స్ అభివృద్ధి చేసిన సరికొత్త సఫారీ స్టోర్మ్ ఈనెల 17న మార్కెట్లోకి రానుంది. సాధారణ హ్యాలోజెన్ బల్బులతో పాటు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌ ఆప్షన్‌, డ్యూయెల్ సైలెన్సర్స్, ఆల్-రౌండ్ డిస్క్ బ్రేక్స్‌, బూట్ క్రింది భాగంలో అమర్చిన స్పేర్ వీల్‌, నాణ్యమైన ప్లాస్టిక్స్‌తో తయారు చేసిన సరికొత్త డ్యాష్‌బోర్డ్, అధునాతన ఎయిర్ కండిషనింగ్, రెండవ వరుసలో కూర్చునే ప్రయాణికుల కోసం రూఫ్‌పై ఏర్పాటు చేసిన ఏసి వెంట్స్, చివరి వరుసలో ప్రయాణికుల కోసం పిల్లర్స్‌పై ఏర్పాటు చేసిన ఏసి వెంట్స్ వంటి ఫీచర్లు కొత్త సఫారీ స్టోర్మ్ సొంతం.

విడుదల తేది - అక్టోబర్ 18, 2012

విడుదల తేది - అక్టోబర్ 18, 2012

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ నుంచి దేశీయ విపణిలో లభ్యమవుతున్న చిన్న కారు బ్రయోలో ఓ ఆటోమేటిక్ వేరియంట్ ఈనెల 18న మార్కెట్లోకి రానుంది. హోండా బ్రయో ఇప్పటి వరకూ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తోనే లభ్యమవుతోంది. హోండా సిటి ఆటోమేటిక్‌లో ఉపయోగిస్తున్న 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)నే హోండా బ్రయో ఆటోమేటిక్‌లో కూడా ఉపయోగించనున్నారు. హోండా బ్రయో టాప్ ఎండ్ వేరియంట్ (వి)లో ఈ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లో విడుదల చేసే ఆస్కారం ఉంది. బ్రయో ఆటోమేటిక్ ధర మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కలిగిన బ్రయో ధర కన్నా రూ.60,000 - రూ.80,000 అధికంగా ఉండొచ్చని అంచనా.

కొత్త ఫోర్డ్ ఫిగో:

కొత్త చెవర్లే స్పార్క్:

కొత్త మారుతి సుజుకి ఆల్టో 800:
విడుదల తేది - అక్టోబర్ 16, 2012
మారుతి సుజుకి నుంచి ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిన్న కారు ఆల్టో 800 ఈనెల 16న మార్కెట్లో విడుదల కానుంది. సరికొత్త మారుతి సుజుకి ఆల్టో 800 కారులో రీట్యూన్ చేయబడిన 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 47.5 బిహెచ్‌పిల శక్తిని, 69 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభించే కొత్త ఆల్టో 800 లీటరు పెట్రోల్‌కు 22.74 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. పాత వెర్షన్‌తో పోల్చుకుంటే ఈ మైలేజ్ 15 శాతం ఎక్కువ.

టాటా ఇండిగో మాంజా క్లబ్ క్లాస్:
విడుదల తేది - అక్టోబర్ 16, 2012
పండుగ సీజన్ కోసం ఇటీవలే రిఫ్రెష్డ్ టాటా ఇండికా ఈవి2ని ప్రవేశపెట్టిన టాటా మోటార్స్ ఈనెల 16న మరొక కొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. కంపెనీ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ సెడాన్ మాంజాలో 'టాటా మాంజా క్లబ్ క్లాస్' అనే పేరుతో పిలిచే ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను టాటా మోటార్స్ విడుదల చేయనుంది. ఇందులో, టచ్ స్క్రీన్ మల్టీ మీడియా నావిగేషన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇటాలియన్ లెథర్ సీటింగ్, కొత్త డిజైన్ కలిగిన 8-స్పోక్ అల్లాయ్ వీల్స్, బెస్ట్ క్వాలిటీ సీట్ ఫ్యాబ్రిక్, మరింత క్రోమ్, కాన్స్టాంట్ రూఫ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. బేస్ వేరియంట్ టాటా మాంజా ఎల్ఎస్ ఇప్పుడు 75 హార్స్‌పవర్ కలిగిన క్వాడ్రాజెట్ ఇంజన్‌తో లభ్యం కానుంది. గతంలో ఈ వేరియంట్‌లో 90 హార్స్‌పవర్ క్వాడ్రాజెట్ (90 హెచ్‌పి సఫారీ ఇంజన్)ను ఉపయోగించేవారు.

టాటా సఫారీ స్టోర్మ్:
విడుదల తేది - అక్టోబర్ 17, 2012
ఎస్‌యూవీ సెగ్మెంట్లో అగ్గి రాజేంకుదు టాటా మోటార్స్ అభివృద్ధి చేసిన సరికొత్త సఫారీ స్టోర్మ్ ఈనెల 17న మార్కెట్లోకి రానుంది. సాధారణ హ్యాలోజెన్ బల్బులతో పాటు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌ ఆప్షన్‌, డ్యూయెల్ సైలెన్సర్స్, ఆల్-రౌండ్ డిస్క్ బ్రేక్స్‌, బూట్ క్రింది భాగంలో అమర్చిన స్పేర్ వీల్‌, నాణ్యమైన ప్లాస్టిక్స్‌తో తయారు చేసిన సరికొత్త డ్యాష్‌బోర్డ్, అధునాతన ఎయిర్ కండిషనింగ్, రెండవ వరుసలో కూర్చునే ప్రయాణికుల కోసం రూఫ్‌పై ఏర్పాటు చేసిన ఏసి వెంట్స్, చివరి వరుసలో ప్రయాణికుల కోసం పిల్లర్స్‌పై ఏర్పాటు చేసిన ఏసి వెంట్స్ వంటి ఫీచర్లు కొత్త సఫారీ స్టోర్మ్ సొంతం.

అంతేకాకుండా.. ఇందులో లోపలి వైపు డోర్లపై క్రోమ్ కోటింగ్ కలిగిన డోర్ హ్యాండిల్స్, యాంత్రికంగా నియంత్రించబడే కొత్త రియర్ వ్యూ మిర్రర్స్, రిమోట్ కంట్రోల్డ్ కీ, థియేటర్ డిమ్మింగ్ లైట్స్, 60:40 నిష్పత్తిలో మడిచిపెట్టే వీలున్న ఫోల్డబిల్ రియర్ సీట్, బూట్‌లో లగేజ్ నెట్, 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌, ఆధునిక మ్యూజిక్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, ఆటో-అప్ ఆప్షన్‌తో కూడిన పవర్ విండోస్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, లుంబార్ సపోర్ట్‌తో కూడిన అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఇంటీరియర్స్‌పై ఉడ్, క్రోమ్ టచ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

మహీంద్రా-శాంగ్‌యాంగ్ రెక్స్టన్:
విడుదల తేది - అక్టోబర్ 17, 2012
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా, కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ శాంగ్‌యాంగ్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ప్రీమియం ఎస్‌యూవీ 'రెక్స్టన్' ఈనెల 17న మార్కెట్లో విడుదల కానుంది. ఇండియాలో శాంగ్‌యాంగ్ పోర్ట్‌ఫోలియో నుంచి రానున్న మొట్టమొదటి ఉత్పత్తి రెక్స్టన్. శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఎస్‌యూవీ ఇప్పటికే 66 దేశాల్లో లభ్యమవుతోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో విడుదల కానున్న శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఎస్‌యూవీ మూడవ తరానికి (థర్డ్ జనరేషన్)కు చెందినది.

హోండా బ్రయో ఆటోమేటిక్:
విడుదల తేది - అక్టోబర్ 18, 2012
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ నుంచి దేశీయ విపణిలో లభ్యమవుతున్న చిన్న కారు బ్రయోలో ఓ ఆటోమేటిక్ వేరియంట్ ఈనెల 18న మార్కెట్లోకి రానుంది. హోండా బ్రయో ఇప్పటి వరకూ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తోనే లభ్యమవుతోంది. హోండా సిటి ఆటోమేటిక్‌లో ఉపయోగిస్తున్న 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)నే హోండా బ్రయో ఆటోమేటిక్‌లో కూడా ఉపయోగించనున్నారు. హోండా బ్రయో టాప్ ఎండ్ వేరియంట్ (వి)లో ఈ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లో విడుదల చేసే ఆస్కారం ఉంది. బ్రయో ఆటోమేటిక్ ధర మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కలిగిన బ్రయో ధర కన్నా రూ.60,000 - రూ.80,000 అధికంగా ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Monday, October 15, 2012, 16:02 [IST]
English summary
The beleaguered auto industry is pinning hopes on the festive season sales to bring the much- needed cheer and have lined up a series of new launches to woo customers in the coming days. Within this week, the domestic automobile market will see as many as seven new vehicles that include Maruti's new Alto, Tata Motors' Indigo Manza Club Class and Safari storme, Rexton from the stable of Mahindra & Mahindra's Korean arm Ssangyong new Ford Figo and the new Chvrolet Spark.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+