ఊప్స్..! ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ జనవరిలో రావటం లేదు!

ఫోర్డ్ ఇండియా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ జనవరిలో విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదు. కంపెనీ ఉన్నత యాజమాన్యంలోని వర్గాల సమాచారం ప్రకారం, ఈ బుజ్జి ఎస్‌యూవీని జనవరిలో కాకుండా ఏప్రిల్ 2013లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి వచ్చే ఏడాది జనవరి నెలలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. ఫోర్డ్ తమ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీని చెన్నై ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది. ఈ మోడల్ ఉత్పత్తి కోసం ఈ ప్లాంటులో ఓ ప్రత్యేక అసెంబ్లీ లైన్ కూడా ఉంది.

ఈ మోడల్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఫోర్డ్ ఇండియా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే, పరిశ్రమ వర్గాల సమచారం ప్రకారం, ఈ ప్లాంటులో ఇంకా ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. మార్చి 2013లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఉత్పత్తి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే ఈకోస్పోర్ట్ వాణిజ్య పరంగా లభ్యమయ్యేది ఏప్రిల్ 2013లో మాత్రమే. మరోవైపు మార్చి 2013లో కేంద్ర బడ్జెట్ కూడా విడుదల కానుంది. బడ్జెట్‌లో సర్కాలు పన్నుల ధోరణిని చూసి, ఈకోస్పోర్ట్ ధరను నిర్ణయించే ఆస్కారం కూడా ఉంది.

ఫోర్డ్ మోటార్స్ ఇప్పటికే తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈకోస్పోర్ట్‌ను బ్రెజిల్, అర్జెంటీనా, కొలంబియా వంటి దక్షిణ అమెరికా దేశాల్లో విడుదల చేసింది. అలాగే రానున్న రెండు నెలల్లో చైనా, పెరూ, చిలీ దేశాల్లో కూడా ఇది విడుదల కానుంది. భారత మార్కెట్లో పోర్డ్ ఈకోస్పోర్ట్ ధర రూ.7 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. ఇందులో ఫోర్డ్ తాజాగా అభివృద్ధి చేసిన 1 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 118 పిఎస్‌ల శక్తిని, 125 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ పరిమాణంలో చిన్నదిగా ఉండి, అధిక పెర్ఫామెన్స్‌ను, ఎక్కువ మైలేజ్‌ను ఆఫర్ చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 26, 2012, 11:37 [IST]
English summary
The most awaited compact SUV EcoSport form Ford India is not coming in next month. According to company sources, Ford EcoSport would be launched in April 2013 and not in January 2013.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+