రూ.50,000ల డౌన్‌పేమెంట్‌కే కొత్త టాటా ఇండికా ఈవి2
టాటా మోటార్స్ నుంచి ఇండికా ఫ్యామిలీలో లభిస్తున్న అత్యధిక మైలేజీనిచ్చే టాటా ఇండికా ఈవి2ను సొంతం చేసుకోవటం ఇప్పుడు చాలా సులువు. లీటరుకు 25 కిలోమీటర్ల మైలేజీనిచ్చే ఇండికా ఈవి2 కారును, ఇప్పుడు కొనుగోలుదారులు కేవలం రూ.50,000 డౌన్‌పేమెంట్‌ను చెల్లించి సొంతం చేసుకోవచ్చని, టాటా మోటార్స్ ఫైనాన్స్ ఈ అవకాశాన్ని అందిస్తోందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. టాటా ఇండికా ఈవి2లో కంపెనీ ఇటీవలే ఓ సరికొత్త రిఫ్రెష్డ్ వెర్షన్‌ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇంజన్ పరంగా ఎలాంటి సాంకేతిక మార్పులు చేయకుండా, కేవలం కొద్దిపాటి కాస్మోటిక్ మార్పులతో అప్‌గ్రేడ్ చేసిన మునపటి వెర్షన్ టాటా ఇండికా ఈవి2 ధర కన్నా రూ.23,000 తక్కువ ధర కలిగి ఉండే అభివృద్ధి చేసిన సరికొత్త టాటా ఇండికా ఈవి2ను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. డ్యూయెల్ టోన్ హెడ్‌లాంప్స్, సరికొత్త ఫ్రంట్ బంపర్, స్టయిలిష్ స్పోర్టీ అల్లాయ్ వీల్స్, ట్రిపిల్-స్టెప్ క్రోమ్ టిప్పెడ్ గ్రిల్, అభివృద్ధి చేసిన స్టాప్ ల్యాంప్‌తో కూడిన సరికొత్త రియర్ స్పాయిలర్, ఆకర్షణీయమైన డెకాల్స్ వంటి ఫీచర్లు కొత్త ఇండికా ఈవి2 సొంతం.
దేశీయ విపణిలో బేస్ వేరియంట్ టాటా ఇండియా ఈవి2 కారు ధర రూ.4.01 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.4.87 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. డీజిల్ వెర్షన్ టాటా ఇండికా ఈవి2లో 1,396 సీసీ కామన్ రెయిల్ డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 70 పిఎస్‌లవ శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, లీటరు డీజిల్‌కు 25 కిలోమీటర్ల మైలేజినిస్తుందని కంపెనీ పేర్కొంది.
పెట్రోల్ వెర్షన్ టాటా ఇండికా ఈవి2లో 1,193 సీసీ ఎమ్‌పిఎఫ్ఐ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 65.3 పిఎస్‌లవ శక్తిని, 99.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా భారత్ స్టేజ్ 4 (బిఎస్4) కాలుష్య నిబంధనలు పాటిస్తాయి.
టాటా ఇండికా ఈవి2లో కొత్తగా జోడించిన ఫీచర్లు:
- డ్యూయెల్ టోన్ హెడ్‌లాంప్స్
- సరికొత్త ఫ్రంట్ బంపర్
- ట్రిపిల్-స్టెప్ క్రోమ్ టిప్పెడ్ ఫ్రంట్ గ్రిల్
- మెటల్ స్ట్రిప్‌తో కూడిన బాడీ కలర్డ్ రియర్ వ్యూ మిర్రర్స్
- మెరుగైన డిస్క్ బ్రేక్స్‌తో కూడిన స్పోర్టీ అల్లాయ్ వీల్స్
- వెనుక వైపు హైమౌంట్ స్టాప్ ల్యాంప్‌తో కూడిన సరికొత్త రియర్ స్పాయిలర్,
- ప్రీమియం ఉడ్ ఫినిష్ కలిగిన సెంటర్ కన్సోల్
- ఆల్ పవర్ విండోస్
- సరికొత్త బ్లావ్‌పన్క్ట్ మ్యూజిక్ సిస్టమ్
- బ్లూటూత్ కెనక్టివిటీ


Click it and Unblock the Notifications









