16వ పోప్ బెనడిక్ట్ కోసం కొత్త పోప్‌మొబైల్: మెర్సిడెస్ బెంజ్
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ 16వ పోప్ బెనడిక్ట్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఓ ఎమ్-క్లాస్ వాహనాన్ని బహుమతిగా అందజేసింది. పోప్ ప్రజా సందర్శనార్థం బయటకు వచ్చినప్పుడు, ప్రజలకు ఆయన స్పష్టంగా కనిపించే విధంగా మోడిఫై చేసిన మెర్సిడెస్ బెంజ్ ఎమ్-క్లాస్ వాహనాన్ని డైమ్లర్ ఏజి మరియు మెర్సిడెస్ బెంజ్ కార్స్ మేనేజ్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్ డా. డీటెర్ జెట్స్‌చే వాటికన్‌లో వ్యక్తిగంతా ఈ కారును 16వ పోప్ బెనడిక్ట్‌కు అందజేశారు. ఈ వాహనాన్ని 'పోప్‌మొబైల్' అని పిలుస్తారు.
మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న పాపులర్ ఎమ్-క్లాస్ యుటిలిటీ వెహికల్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ పోప్‌మొబైల్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుత ఎమ్-క్లాస్‌లోని సాంకేతిక ప్రత్యేకతలను ఉపయోగించి ఈ వాహనాన్ని రూపొందించారు. సరికొత్త ఇంటీరియర్, కారు వెనుక భాగంలో పోప్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కుర్చీ, విశాలమైన స్పేస్, పెద్ద గ్లాస్ ప్యానెల్స్, మంచి కాంతితో ప్రకాశించే రూఫ్ లైనింగ్ వంటి ఫీచర్లతో కంపెనీ ఈ కారును తయారు చేసింది. గడచిన 9 నెలల క్రితం మెర్సిడెస్ బెంజ్ ఈ పోప్‌మొబైల్ పనిని ప్రారంభించింది.
మెర్సిడెస్ బెంజ్ గడచిన 80 ఏళ్లుగా పోప్‌లో ప్రత్యేక వాహనాలను తయారు చేసి అందజేస్తూ వస్తోంది. మెర్సిడెస్ బెంజ్ తొలిసారిగా 1930లో 11వ పోప్ పియస్ కోసం ఓ నర్‌బర్గ్ 460 పుల్‌మ్యాన్ సెలూన్‌ను అందజేసింది. అలాగే, 1960లో 23వ పోప్ జాన్ కోసం 300డి లాండాలెట్, 6వ పోప్ పాల్ కోసం మెర్సిడెస్ బెంజ్ 600 పుల్‌మ్యాన్ లాండాలెట్, 300 ఎస్ఈఎల్ వంటి కార్లను కంపెనీ అందజేసింది. కాగా.. ఇటీవలే ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో కూడా 16వ పోప్ బెనడిక్ట్ కోసం ఓ అధునాత ఎలక్ట్రిక్ వాహనాన్ని అందజేసిన సంగతి తెలిసిందే.

16వ పోప్ బెనడిక్ట్ కోసం కొత్త పోప్‌మొబైల్: మెర్సిడెస్ బెంజ్

16వ పోప్ బెనడిక్ట్ కోసం కొత్త పోప్‌మొబైల్: మెర్సిడెస్ బెంజ్

16వ పోప్ బెనడిక్ట్ కోసం కొత్త పోప్‌మొబైల్: మెర్సిడెస్ బెంజ్

16వ పోప్ బెనడిక్ట్ కోసం కొత్త పోప్‌మొబైల్: మెర్సిడెస్ బెంజ్

16వ పోప్ బెనడిక్ట్ కోసం కొత్త పోప్‌మొబైల్: మెర్సిడెస్ బెంజ్

16వ పోప్ బెనడిక్ట్ కోసం కొత్త పోప్‌మొబైల్: మెర్సిడెస్ బెంజ్

Click it and Unblock the Notifications