హైదరాబాద్‌లో సరికొత్త రియోను విడుదల చేసిన ప్రీమియర్

హైదరాబాద్‌: మేడ్ ఇన్ ఇండియా కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ప్రీమియర్ రియో' ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో కూడా లభ్యం కానుంది. ప్రీమియర్ ఆటోమొబైల్స్ అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ రియోలో కంపెనీ ఇటీవలే ఓ కొత్త వెర్షన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫియట్ నుంచి పొందిన సరికొత్త 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌ను ప్రీమియర్ రియోలో ఉపయోగించారు. ఇది లీటరు డీజిల్‌కు 19 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ వివరించింది.

కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ ఎస్‌యూవీని తీర్చిదిద్దామని ఇది ధరకు తగిన విలువను కలిగి ఉంటుందని సంస్థ సిఎమ్‌డి మైత్రేయ దోషి వ్యాఖ్యానించారు. రాష్ట్ర మార్కెట్లో ప్రీమియర్ రియో ధర రూ. 7.07 లక్షలు (ఎక్స్‌-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్, ఫియట్ పుంటో, టాటా విస్టా కార్లలో ఉపయోగించే 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌నే ప్రీమియర్ రియోలో కూడా ఉపయోగించడం జరిగింది. ఇది గరిష్టంగా 72 బిహెచ్‌పిల శక్తిని, 183 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్లు) సిస్టమ్‌తో లభిస్తుంది.

'ప్రీమియర్ రియో సిఆర్‌డిఐ4'గా పిలిచే ఈ డీజిల్ వెర్షన్ రియో నాలుగు రంగుల్లో (నలుపు, ఎరుపు, తెలుపు, సిల్వర్) లభిస్తుంది. నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు ఉండే (3970 మి.మీ.) ఈ ప్రీమియర్ రియోలో ఏబిఎస్, బీజ్ ఇంటీరియర్స్, రియర్ వైపర్ అండ్ డిఫాగ్గర్, వెనుక డోర్‌కు అమర్చిన స్పేర్ వీల్, పవర్ విండోస్ వంటి ఫీచర్లతో ఇది లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 15, 2012, 15:04 [IST]
English summary
Premier has launched the new Rio compact SUV in Hyderabad. New Premier Rio is equipped with a new 1.3 liter multi-jet diesel engine sourced from Fiat. The Premier Rio with Fiat engine is now available in showrooms with a starting price of Rs.7.07 lakhs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+