ప్రీమియర్‌ రియోలో ఫియట్ 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్

ప్రీమియర్ ఆటోమొబైల్స్ అందిస్తున్న మేడ్ ఇన్ ఇండియా కాంపాక్ట్ ఎస్‌యూవీ రియో త్వరలనే ఓ సరికొత్త ఇంజన్‌తో మార్కెట్లోకి రానున్నట్లు ఏప్రిల్ నెల ఆరంభంలో తెలుగు డ్రైవ్ స్పార్క్ ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రీమియర్ అధికారికంగా ధృవీకరించింది.

ప్రీమియర్ రియోలో ఫియట్ నుండి పొందిన 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్ ఉపయోగించనున్నామని, ఇందుకు గానూ ఫియట్‌తో ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నామని ప్రీమియర్ పేర్కొంది. ఈ ఒప్పందంలో భాగంగా రానున్న మూడేళ్ల పాటు ప్రీమియర్‌కు 28,000 ఇంజన్లను ఫియట్ సరఫరా చేయనుంది. రియో కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రీమియర్ మహారాష్ట్రలోని తమ రంజన్‌గావ్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తుంది.


కొత్త ఇంజన్‌తో కూడిన ప్రీమియర్ రియో కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆగస్ట్-సెప్టెంబర్ మధ్య కాలంలో మార్కెట్లోకి రానుంది. ఇదే 1.3 లీటర్ ఫియట్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌ను మారుతి సుజుకి స్విఫ్ట్, ఎర్టిగా ఎమ్‌పివి, ఫియట్ పుంటో, టాటా విస్టా వంటి కార్లలో ఉపయోగిస్తున్నారు. ఈ కొత్త ఇంజన్ 75 బిహెచ్‌పిల శక్తిని, 18 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ప్రస్తుతం లభిస్తున్న ప్రీమియర్ రియో కన్నా ఇది ఎన్నో రెట్లు మెరుగైనది.


ప్రస్తుతం రియో 1.5 లీటర్ బిఎస్3 డీజిల్ ఇంజన్, 1.4 లీటర్ బిఎస్4 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. ఐదురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేలా రూపొందించిన రియో కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలు రూ.4.90 లక్షల నుండి రూ.6.60 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉన్నాయి. ఇందులో పవర్ స్టీరింగ్, ఫోల్డబిల్ రియర్ సీట్, ఏబిఎస్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, రియర్ వైపర్, పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ సైడ్ మిర్రర్స్ మరియు రిమోట్ కంట్రోల్ లాకింగ్ సిస్టమ్ వంటి ఆకర్షనీయమైన ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, May 18, 2012, 18:35 [IST]
English summary
Premier Limited's compact SUV Rio gets the Fiat's most popular 1.3 litre multi-jet diesel engine. Premier has entered into commercial agreement with its erstwhile partner Fiat for sourcing this highly successful engine.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+