మెట్రో నగరాల్లో నానాటికీ పెరుగుతున్న వాహనాల సంఖ్య

By Ravi

Traffic
ఐటి ఉద్యోగాలకు కేంద్రాలుగా మారిన బెంగుళూరు, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో మనుషుల సంఖ్యతో పాటుగానే వాహనాల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. భారీ మొత్తాలలో జీతాలు పొందుతున్న ఐటి ఉద్యోగులు రద్దీగా ఉండే బస్సులు, లోకల్ ట్రైన్లలో ప్రయాణించడం ఇష్టం లేక, వ్యక్తిగత వాహనాలపై దృష్టి సారిస్తున్నారు. దీంతో ఈ నగరాల్లో ప్రైవేట్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడచిన రెండేళ్లలో గమనిస్తే బెంగుళూరు, హైదరాబాద్‌లలో రిజిస్టర్ అవుతున్న వాహనాల సంఖ్య అధికమయ్యింది.

ఈ విషయంలో బెంగుళూరు, డిల్లీ నగరానికి చేరువలో రెండవ స్థానానికి ఎదిగింది. తాజా గణాంకాల ప్రకారం, 2011లో ఢిల్లీలో సుమారు 4.76 లక్షల వాహన రిజిస్ట్రేషన్లు నమోదు కాగా, ఈ ఏడాది నవంబర్ నెల నాటికి ఇప్పటికే ఈ సంఖ్య 3.99 లక్షలకు చేరింది. అదే విధంగా, గడచిన సంవత్సరంలో బెంగుళూరులో వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య 2.72 లక్షలుగా ఉండగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ (నవంబర్ నాటికి) 3.28 లక్షలకు చేరింది.

హదరాబాద్‌లోను ఇదే పరిస్థితి. ఈ రెండు ప్రాంతాలకు వలస వచ్చే యువకులు ఐటి పరిశ్రమలలో పనిచేస్తూ, మంచి ఆదాయాలను సంపాధిస్తూ, ఇక్కడికి వచ్చి కొద్ది నెలలకే కొత్త వాహనాలను కొనుగోలు చేస్తున్నారని రవాణ, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మరో రెండు మూడేళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, బెంగుళూరులో వాహనాల వృద్ధి అధికంగా ఉండటం వలనే రోడ్ల పొడవునా ట్రాఫిక్ జామ్‌లు అవుతుంటాయని ఆయన చెప్పారు.

అయితే.. ముంబై, చెన్నై, కలకత్తా మహా నగరాల్లో మాత్రం వాహన వృద్ధి స్థిరంగా ఉంది. చెన్నైలో 2011లో 2.26 లక్షల వాహనాలు రిజిస్టర్ కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకూ1.91 లక్షల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. అలాగే, ముంబైలో 2011లో 2.27 లక్షల వాహనాలు రిజిస్టర్ కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకూ1.60 లక్షల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగుతూ పోతే భవిష్యత్తులో రోడ్లపై మనుషుల కన్నా వాహనాలే ఎక్కువగా దర్శనమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరేమంటారు?

More from DriveSpark

Article Published On: Monday, November 26, 2012, 16:51 [IST]
English summary
Metro cities like Bangalore and Hyderabad seems to have a direct impact on the growth of private vehicles. In the past two years, Bangalore has emerged as next only to Delhi in terms of annual vehicle registration while Hyderabad recorded a big increase in the same period.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+