బిఐసి ఫార్ములా వన్ ట్రాక్‌పై మీరూ కూడా రేస్ చేయొచ్చు
గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ గుర్తుందా..? గడచిన సంవత్సరం అక్టోబర్ నెలాఖరులో భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా జరిగిన ఫార్ములా వన్ (ఎఫ్1) రేసుకు ఆతిథ్యమిచ్చిన బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి) ఇప్పుడు సాధారణ కార్లను ట్రాక్‌పై రేస్ చేసేందుకు అనుమతిస్తుంది.
కార్ రేస్‌ల పట్ల ఆసక్తి ఉన్న వారి కోసం ఈ నెల (ఏప్రిల్) 22న ఉ. 7.00 గంటల నుండి సా. 6.00 గంటల మధ్య కాలంలో బిఐసి ఆరు ఓపెన్ ట్రాక్ డేస్‌లను నిర్వహించనున్నట్లు జేపీ స్పోర్ట్స్ ఇంటర్నేషల్ (జేపీఎస్ఐ) పేర్కొంది. ఆసక్తి కలిగిన రేసర్లు తమ స్వంత కార్లతో ఈ రేసులో పాల్గొనవచ్చు.
ఈ రేసులో పాల్గొనడానికి ఒక్కొక్క సెషన్‌కు గానూ ఒక్కొక్క అభ్యర్థి రూ.7,599లు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మూడు సెషన్ల పాటు ట్రాక్ చుట్టూ రౌండ్లు కొట్టాలనుకునే రేసర్లకు ప్రత్యేక తగ్గింపు ధర రూ.18,749 లను కూడా బిఐసి ఆఫర్ చేస్తుంది. ఒక్కొక్క సెషన్ 10 నిమిషాల పాటు జరుగుతుంది.
ఒక్కొక్క సెషన్‌కు అభ్యర్థులను పరిమితం చేయబడి ఉంటుంది కాబట్టి ముందు వచ్చిన వారిని ముందుగా ఎన్నుకునే ప్రాతిపధిక (ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్) ఆధారంగా అభ్యర్థులను ఎన్నుకోవటం జరుగుతుంది. ఆన్-లైన్ అభ్యర్థులు తమ ఎంట్రీని రిజిస్టర్ చేసుకోవచ్చు. బైకర్లకు కూడా కంపెనీ సెషన్‌ను ఆఫర్ చేస్తుంది. అయితే, దీని ఎంట్రీలు ఇప్పటికే అమ్ముడుపోయాయి.
బైకర్లకు ఒక్క సెషన్‌కు గానూ రూ.4,999లు మూడు సెషన్లకు గానూ రూ.9,999లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్న వివరాలను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ www.jaypeesports.com నుండి కానీ లేదా 0120 4428034/36 (ఉ.9.30 నుండి సా.6.00 వరకూ) నెంబర్‌పై ఫోన్ చేసి కానీ పొందవచ్చు.


Click it and Unblock the Notifications









