ఎమ్‌జి స్పోర్ట్స్ కారులో రాజేష్ కన్నా రాయల్ సవారీ..!
మరో బాలీవుడ్ సూపర్ స్టార్ ఈ లోకాని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. బాలీవుడ్ సినీ చరిత్రలో ఓ వెలుగు వెలుగు వెలిగి రాజేష్ కన్నా (69) ఈ రోజు ముంబైలో కాలం చేశారు. రాజేష్ కన్నా 1942 డిసెంబర్ 29న అమృత్‌సర్‌లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి డ్రామాలంటే మంచి ఆసక్తి కలిగిన ఖన్నా కళాశాల చదివే సమయంలో అనేక అవార్డును గెలుచుకున్నాడు. ఆ ఆసక్తితోనే సినీరంగ ప్రవేశం చేసి అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు.
రాజేష్ కన్నా అసలు పేరు జతిన్ ఖన్నా. 1966లో సినీ రంగ ప్రవేశం చేసిన రాజేష్ ఖన్నా 163 సినిమాల్లో నటించారు. ఈయన నటించిన సినిమాల్లో అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా, ఉత్తమ హీరోగా మూడుసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు సైతం రాజేష్ ఖన్నాను వరించాయి. ఖన్నా కేవలం నటనకే పరిమితం కాకుండా పలు చిత్రాలను సైతం నిర్మించాడు. అంతేకాకుండా, 1992-1996 మధ్య కాలంలో ఆయన ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభ సభ్యుడుగా పనిచేశాడు.
రాకేష్ ఖన్నా అప్పట్లోనే స్పోర్ట్స్ కార్స్ అంటే మహా క్రేజ్ ఉండేది. హీరోగా మంచి హిట్‌ల కోసం కష్టపడుతున్న సమయంలో రాజేష్ ఖన్నా ఓ బ్రిటీష్ స్పోర్ట్స్ కారు యజమాని అయ్యాడు. అప్పట్లో భారత ఆటోమొబైల్ పరిశ్రమ అంతంత మాత్రంగానే ఉండేది. ఎక్కువ కార్లు లభించేవి కావు. బ్రిటన్‌కు చెందిన ఎమ్‌జి కార్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఓ ఎమ్‌జి స్పోర్స్ కారును రాజేష్ ఖన్నా కొనుగోలు చేయటం జరిగింది.
ఆ రోజుల్లో ఇండియాలో ఇలాంటి స్పోర్ట్స్ కార్లను కలిగి ఉన్న అరుదైన వ్యక్తుల్లో రాఖజేష్ ఖన్నా ఒకరుగా నిలిచారు. ఈ స్పోర్ట్స్ కారును ప్రత్యేకంగా బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకోవటం జరిగింది. ఎమ్‌జి కార్ కంపెనీను 1920లో సెసిల్ కింబర్ స్థాపించాడు. ఆ రోజుల్లో ఎమ్‌జి బ్రాండ్ కార్లకు భలే క్రేజ్ ఉండేది. ఈ కార్లను కలిగి ఉన్న వాళ్లను ధనవంతులుగా పరిగణించేవారు. ఎమ్‌జి కార్ కంపెనీ అప్పట్లోనే 2-సీటర్ సెలూన్, కూపే కార్లను నిర్మించేది.


Click it and Unblock the Notifications









