అత్తారింటి నుంచి చెర్రీకి రూ.2 కోట్ల ఆస్టన్ మార్టిన్ కారు గిఫ్ట్
కొత్త పెళ్లి కొడుకు చెర్రీ (రామ్ చరణ్ తేజ)కి అత్తింటివారు అద్దిరిపోయే కానుకను అందజేశారు. ప్రపంచంలో అత్యంత పాపులర్ అయిన ప్రముఖ లగ్జరీ కార్ బ్రాండ్ ఆస్టన్ మార్టిన్ అందిస్తున్న, రెండు డోర్లు కలిగిన 'ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్' కారును ఉపాసన తల్లిందండ్రులు మన 'మగధీర'కు గిఫ్ట్‌గా అందజేశారు. జేమ్స్ బాండ్ సినిమాల్లో దర్శనమిచ్చే ఈ తరహా ఆస్టన్ మార్టిన్ కారు ఇకపై మన 'చిరుత' వద్ద కూడా కనిపించనుంది.
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ అయిన్ ఆస్టన్ మార్టిన్ గతేడాది ఏప్రిల్ నెలలో భారత మార్కెట్లోకి ప్రవేశిచింది. ఆస్టన్ మార్టిన్ ఇండియాలో రెండు డీలర్‌షిప్‌లు (ఒకటి ముంబైలో, మరొకటి ఢిల్లీలో) మాత్రమే ఉన్నాయి. కాగా.. రామ్ చరణ్‌కు అత్తారింటివారు కానుక ఇచ్చిన ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్ కారు, సదరు కంపెనీ నుంచి దేశయ విపణిలో లభిస్తున్న ఎంట్రీ లెవల్ కారు. మన మార్కెట్లో ఈ విలాసవంతమైన కారు ధర సుమారు రూ.2 కోట్ల నుండి ప్రారంభమవుతుంది.
దాదాపు శతాబ్ధపు చరిత్రను కలిగి ఉన్న ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కార్లు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ను సంపాధించుకున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆస్టన్ మార్టిన్ తయారు చేసే కార్లన్నీ కూడా చేతులతో రూపొందించినవే (హ్యాండ్ బిల్ట్). అందుకే ఇవి పరిమిత సంఖ్యలో మాత్రమే ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా మార్కెట్లో వీటి లభ్యత తక్కువగా ఉండి, వెల కూడా అధికంగా ఉంటాయి.
ఇండియన్ మార్కెట్లో ఆస్టన్ మార్టిన్ వి12 వాంటేజ్, వాంటేజ్ ఎస్ (కూపే అండ్ రోడ్‌స్టర్), వి8 వాంటేజ్ కూపే, వి8 వాంటేజ్ రోడ్‌స్టర్, డిబి9 కూపే, డిబి9 వొలాంటే, డిబిఎస్ వొలాంటే, ఫోర్-డోర్ ఆస్టన్ మార్టిన్ ర్యాపిడే కార్లను అమ్మకాని ఉంచనున్నారు. ప్రస్తుతం పూర్తిగా విదేశాల్లో తయారైన ఆస్టన్ మార్టిన్ కార్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకుని విక్రయించటం జరుగుతుంది.


Click it and Unblock the Notifications








