420 హార్స్ పవర్ ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌లో చెర్రీ సవారీ

నాయక్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజకు తన పెళ్లి కానుకగా అప్పట్లో అత్తింటివారు చెర్రీకు ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్ లగ్జరీ కారును కానుకగా అందజేసిన సంగతి తెలిసిందే. ఈ అందమైన కారులో మన చెర్రీ చెక్కర్లు కొడుతుండగా ఇదిగో ఇలా కెమెరాకు చిక్కాడు. వివిధ కొత్త చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న మన మగధీరుడు, తనకు ఖాలీ సమయం దొరికినప్పుడల్లా ఇలా సరదాగా ఈ కారులో షికారు చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు.

బహుశా హైదరాబాద్‌లో ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్ కారును కలిగిన ఉన్న తొలి సెలబ్రిటీ కూడా రామ్ చరణే అయి ఉండొచ్చు. బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆస్టన్ మార్టిన్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఆస్టన్ మార్టిన్ తమ కార్లను యంత్రాలు ఉపయోగించకుండా దాదాపుగా పూర్తిగా చేతుల్తోనే తయారు చేస్తుంది. అందుకే వీటిని తయారు చేయటానికి ఎక్కువ సమయం పడుతుంది మరియు వీటి ధర కూడా అధికంగా ఉంటుంది. అందమైన డిజైన్, పవర్‌ఫుల్ ఇంజన్, సాటిలేని పెర్ఫామెన్, కళ్లు జిగేల్‌మనిపించే పెయింట్, స్టయిలిష్ లుక్, విలాసవంతమైన ఫీచర్లు, సౌకర్యంవతమైన హ్యాండ్లింగ్, సాఫ్ట్‌వేర్ సాయంతో నియంత్రించే పూర్తి ఆటోమేటిక్ వ్యవస్థ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కారు గురించి చాంతాడంత లిస్టే తయారవుతుంది.

అందమైన ఆస్టన్ మార్టిన్ రామ్ చరణ్ తేజ

అందమైన ఆస్టన్ మార్టిన్ రామ్ చరణ్ తేజ

నాయక్‌గా త్వరలో ప్రేక్షకులను అలరించనున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజకు తన పెళ్లి కానుకగా అప్పట్లో అత్తింటివారు చెర్రీకు ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్ లగ్జరీ కారును కానుకగా అందజేసిన సంగతి తెలిసిందే. ఈ అందమైన కారులో మన చెర్రీ చెక్కర్లు కొడుతుండగా ఇదిగో ఇలా కెమెరాకు చిక్కాడు.

రామ్ చరణ్ - ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్‌

రామ్ చరణ్ - ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్‌

నాయక్, జంజీర్ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న మన మగధీరుడు ఖాలీ సమయం దొరికినప్పుడల్లా ఇలా సరదాగా ఈ కారులో షికారు చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు.

రామ్ చరణ్ - ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్‌

రామ్ చరణ్ - ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్‌

బహుశా హైదరాబాద్‌లో ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్ కారును కలిగిన ఉన్న తొలి సెలబ్రిటీ కూడా రామ్ చరణే అయి ఉండొచ్చు.

ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్‌

ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్‌

ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్‌‌లో 4.7 లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 420 బిహెచ్‌పిల శక్తిని (ఈ శక్తి 420 గుర్రాలతో సమానం), 470 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్‌

ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్‌

ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్‌ కేవలం 4.9 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. ఇది గరిష్టంగా గంటకు 290 కి.మీ. వేగంతో పరుగులు పెడుతుంది.

ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్‌

ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్‌

బాడీ:

* 2 సీట్స్, 2 డోర్ కూపే లేదా సాఫ్ట్ కవర్ కన్వర్టిబల్ టాప్ బాడీ స్టయిల్‌తో ఇది లభిస్తుంది.

* కారు బరువును తగ్గించేందుకు గానూ బాండెడ్ అల్యూమినియం స్ట్రక్చర్‌తో దీనిని రూపొందించారు.

* అల్యూమినియం, మెగ్నీషియం అల్లాయ్, కాంపోసిట్ అండ్ స్టీల్ బాడీ.

* ప్రమాదాలను తట్టుకునేలా తీర్చిదిద్దిన అల్యూమినియం డోర్ సైడ్ ఇంపాక్ట్ బీమ్స్

* అధిక కాంతినిచ్చే హ్యాలోజెన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ (మెయిన్ బీమ్)

* హై ఇంటెన్సిటీ డిశ్చార్డ్ హెడ్‌ల్యాంప్స్ (లో బీమ్)

* ఎల్ఈడి రియర్ ల్యాంప్స్

ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్‌

ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్‌

ఇంజన్:

* 32 వాల్వ్, 4735సీసీ వి8 ఇంజన్

* ఇది ముందువైపు మధ్య భాగంలో అమర్చబడి, రియర్ వీల్ (వెనుక చక్రం) డ్రైవ్‌ను కలిగి ఉంటుంది.

* గరిష్ట శక్తి - 420 బిహెచ్‌పి

* గరిష్ట టార్క్ - 470 ఎన్ఎమ్

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

పెర్ఫామెన్స్:

* 4.7 సెకండ్లలో 0-60 కి.మీ. వేగం

* 4.9 సెకండ్లలో 0-100 కి.మీ. వేగం

* గరిష్టం వేగం - గంటకు 190 కి.మీ.

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

ట్రాన్సిమిషన్:

* 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

వీల్స్ అండ్ టైర్స్:

* ముందు చక్రం - 8.5జె x 19 ఇంచ్

* వెనుక వెనుక చక్రం - 9.5జె x 19 ఇంచ్

* ముందు టైర్ - బ్రిడ్జ్‌స్టోన్ పొటెంజా 235/40 జెడ్ఆర్19

* వెనుక టైర్ - బ్రిడ్జ్‌స్టోన్ పొటెంజా 275/35 జెడ్ఆర్19

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

బ్రేక్స్:

* ముందు వైపు - వెంటిలేటెడ్ అండ్ గ్రూవ్డ్ స్టీల్ డిస్క్, 355 డయా

* వెనుక వైపు - వెంటిలేటెడ్ అండ్ గ్రూవ్డ్ స్టీల్ డిస్క్, 330 డయా

* డైనమిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (డిఎస్‌సి)

* యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)

* ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి)

* ఎమెర్జెన్సీ బ్రేక్ అసిస్ట్ (ఈబిఏ)

* ట్రాక్షన్ కంట్రోల్

* పాజిటవ్ టార్క్ కంట్రోల్

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

ఇంటీరియర్:

- పూర్తి లెథర్ ఇంటీరియర్స్

- అల్లాయ్ ఫేసియా ట్రిమ్ అండ్ గ్రాఫైట్ సెంటర్ కన్సోల్ ఫనిష్

- 10-వే ఎలక్ట్రిక్ అడ్జస్టమెంట్‌తో కూడిన స్పోర్టీ సీట్స్

- డ్యూయెల్ స్టేజ్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్

- సైడ్ ఎయిర్ బ్యాగ్స్

- హీటెడ్ రియర్ స్క్రీన్

- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్

- ట్రిప్ మీటర్

- ఎల్ఈడి మ్యాప్ రీడింగ్ లైట్స్

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

ఇంటీరియర్:

- గ్లాస్ ఈసియూ

- రియర్ పార్కింగ్ సెన్సార్స్

- పవర్ సైడ్ మిర్రర్స్

- టైర్ ప్లెజర్ ఇండికేటర్

- అలారమ్, ఇమ్మొబిలైజర్

- రిమోట్ కంట్రోల్ డోర్ లాకింగ్, బూట్ రిలీజ్

- ట్రాకింగ్ డివైజ్

- యూఎస్‌బి, యాపిల్ ఐప్యాడ్ కెనెక్టివిటీ, 6-సిడి ఆటోమేటిక్ ఛేంజర్‌తో కూడిన 160 వాట్ ఆస్టన్ మార్టిన్ ఆడియో సిస్టమ్

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ అయిన్ ఆస్టన్ మార్టిన్ గతేడాది ఏప్రిల్ నెలలో భారత మార్కెట్లోకి ప్రవేశిచింది. ఆస్టన్ మార్టిన్ ఇండియాలో రెండు డీలర్‌షిప్‌లు (ఒకటి ముంబైలో, మరొకటి ఢిల్లీలో) మాత్రమే ఉన్నాయి.

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

భారత్‌లో ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్ కారు ధర సుమారు రూ.2 కోట్లకు పైమాటే.

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

ఇండియన్ మార్కెట్లో ఆస్టన్ మార్టిన్ వి12 వాంటేజ్, వాంటేజ్ ఎస్ (కూపే అండ్ రోడ్‌స్టర్), వి8 వాంటేజ్ కూపే, వి8 వాంటేజ్ రోడ్‌స్టర్, డిబి9 కూపే, డిబి9 వొలాంటే, డిబిఎస్ వొలాంటే, ఫోర్-డోర్ ఆస్టన్ మార్టిన్ ర్యాపిడే కార్లను అమ్మకాని ఉంచనున్నారు.

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

దాదాపు శతాబ్ధపు చరిత్రను కలిగి ఉన్న ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కార్లు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ను సంపాధించుకున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆస్టన్ మార్టిన్ తయారు చేసే కార్లన్నీ కూడా చేతులతో రూపొందించినవే (హ్యాండ్ బిల్ట్). అందుకే ఇవి పరిమిత సంఖ్యలో మాత్రమే ఉత్పత్తి అవుతాయి.

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

ప్రస్తుతం పూర్తిగా విదేశాల్లో తయారైన ఆస్టన్ మార్టిన్ కార్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకుని విక్రయించటం జరుగుతుంది.

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

ఆస్టన్ మార్టిన్‌ వి8 వ్యాంటేజ్‌

ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్‌లో ఈ ఫీచర్లు కేవలం 50 శాతం మాత్రమే. ఇవే కాకుండా... కస్టమర్లు తమ అభిరుచికి తగినట్లుగా వివిధ ఆప్షన్లతో ఈ కారును కస్టమైజ్ చేసుకోవచ్చు.


ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్ పొడవైన బానెట్‌ను కలిగి ఉండి, రెండు డోర్లు, రెండు సీట్లను (డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్) మాత్రమే కలిగి ఉంటుంది. ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్‌‌లో 4.7 లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 420 బిహెచ్‌పిల శక్తిని (ఈ శక్తి 420 గుర్రాలతో సమానం), 470 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.9 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. ఇది గరిష్టంగా గంటకు 290 కి.మీ. వేగంతో పరుగులు పెడుతుంది. దీని బరువును తక్కువగా ఉంచేందుకు గానూ ఆస్టన్ మార్టిన్ దీని తయారీలో కార్బన్ ఫైబర్ వంటి తేలిక రకం వస్తువులను, పదార్థాలను ఉపయోగించింది. భారత్‌లో ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్ కారు ధర సుమారు రూ.2 కోట్లకు పైమాటే.

Article Published On: Tuesday, December 18, 2012, 11:36 [IST]
English summary
Tollywood actor Ram Charan Teja owns a Aston Martin V8 Vantage. The V8 Vantage is one of the world's most beautiful cars. It offers superb all-round performance and, like all Aston Martins, delivers some impressive statistics: 0-100 km/h (62 mph) in 4.9 seconds and a potential maximum speed of 290 km/h (180 mph). Here is deatiled features of this beauty.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+