ర్యాపిడ్ తగలబడింది తయారీ లోపం వల్ల కాదు: స్కొడా

Skoda Rapid Fire
ఈ నెల ఆరంభంలో పూనేలో ఓ స్కొడా ర్యాపిడ్ కారులో హఠాత్తుగా మంటలు చెలరేగిన సంఘటన మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనను దర్యాప్తు చేసిన స్కొడా ఇండియా, ఈ కారులో మంటలు చెలరేగటానికి కారణం తయారీ లోపం కాదని, ఇది ఓ ప్రమాదం కారణంగా సంభవించిందని ప్రకటించింది. కారులో ఉపయోగించిన నాసిరకం ఉత్పత్తుల కారణంగానే కారులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయని కంపెనీ ప్రకటించినట్లు సమాచారం.

సాధారణంగా చాలా మంది కారును కొనుగోలు చేసిన తర్వాత కారులో కొన్ని విడిభాగాలను (ఆడియో సిస్టమ్స్, కస్టమైజేషన్‌కు సంబంధించిన విడిభాగాలను) బయటి మార్కెట్ నుండి కొనుగోలు చేయటం జరుగుతుంటుంది. ఇలాంటి నాసిరకమైన ఉత్పత్తులను మరియు నైపుణ్యం లేని మెకానిక్‌ల చేత ఫిట్ చేయించుకోవటం కారణంగా ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఆస్కారం ఉందని కంపెనీ పేర్కొంది. కాబట్టి వీలైనంత వరకూ కంపెనీ అధీకృత డీలర్‌షిప్‌లను కంపెనీ సిఫారసు చేసిన ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయటం ఉత్తమం.

గతంలో ఇలాగే పూనేలో ఓ ఫోక్స్‌వ్యాగన్ వెంటో డీజిల్ కారు కూడా హటాత్తుగా అగ్నికి ఆహుతై కారు యజమానిని బలిగొన్న సంఘటన గురించి ఇదివరకే చెప్పుకోవటం జరిగింది. అయితే, ఈ ప్రమాదానికి సంభందించిన కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. కాగా.. వెంటో సెడాన్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా డిజైన్ చేసిన స్కొడా ర్యాపిడ్ డీజిల్ (వెంటో డీజిలో ఉపయోగించిన ఇంజన్‌నే ఇందులో కూడా ఉపయోగించారు) హఠాత్తుగా మంటలు చెలరేగటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సంఘటన ఏప్రిల్ మొదటి వారంలో పూనేలోని ఎఫ్‌సి రోడ్డులో చోటు చేసుకుంది.

More from DriveSpark

Article Published On: Sunday, April 15, 2012, 11:59 [IST]
English summary
After investigating the incident of its Rapid sedan catching fire in Delhi, Skoda India has reportedly come out with a statement saying it was not the manufacturing defect that was the cause of the accident. Skoda is reported to have come out with the statement after keeping mum on the incident for a few weeks.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+