రికార్డు స్థాయిలో వెల పలికిన అరుదైన ఆస్టన్ మార్టిన్

సీక్రెట్ ఏజెంట్ జేమ్స్ బాండ్ సినిమాల్లో ఉపయోగించే కార్లు అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేవి ఆస్టన్ మార్టిన్ బ్రాండ్ కార్లే. అరుదైన డిజైన్, అద్భుతమైన పవర్‌తో రూపొందించబడే ఆస్టన్ మార్టిన్ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆస్టన్ మార్టిన్ రూపొందించిన ఓ అరుదైన కారు వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది.

బ్రిటన్‌కు చెందిన వేలం సంస్థ బోన్‌హామ్స్ ఆక్షనరీస్ నిర్వహించిన ఓ వేలంలో 'ఆస్టన్ మార్టిన్ డిబి4జిటి జగటో శాంక్షన్ 2 కూపే' అనే కారు ఏకంగా 1.9 మిలియన్ డాలర్ల వెల పలికింది. 1991వ సంవత్సరానికి చెందిన ఈ కారును ఫిల్ కోలిన్స్ మేనేజర్ టోనీ స్మిత్ కలిగి ఉండేవాడు. అతను మొత్తమ్మీద ఈ కారులో కేవలం 5,000 మైళ్ల దూరం కన్నా తక్కువే ప్రయాణించాడు.

ఎంటీ ఈ కారు ప్రత్యేకత..?
ఆస్టన్ మార్టిన్ 'డిబి4జిటి జగటో శాంక్షన్ 2 కూపే' కార్లను కేవలం నాలుగు మాత్రమే తయారు చేసింది. అందులో ఈ కారు కూడా ఒకటి. ఒరిజినల్ 1960 డిబి4జిటి జహటో షాషీని ఉపయోగించి కంపెనీ ఈ నాలుగు కార్లను డిజైన్ చేసింది. ఇందులో శక్తివంతమైన 4.2 లీటర్, సిక్స్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టం 352 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. ఇదే వేలంలో 1962వ సంవత్సరానికి చెందిన డిబి4 వాంటేజ్ కన్వర్టిబల్ కారు 6,11,000 యూరోల వెల పలికి అత్యధికంగా వెల పలికిన రెండవ కారుగా నిలిచింది.

More from DriveSpark

Article Published On: Monday, May 21, 2012, 17:17 [IST]
English summary
UK's Bonhams auctioneers has sold a rare Aston Martin DB4GT Zagato Sanction II Coupé at a record price of $1.9 million. The 1991 car was owned by Phil Collins' manager, Tony Smith, and has been driven less than 5,000 miles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+