కొత్త సంవత్సరంలో కాస్ట్లీగా మారనున్న రెనో కార్లు

By Ravi

కొత్త సంవత్సరంలో కొత్త కారును కొనాలనుకునే కార్ ప్రియులకు షాకింగ్ న్యూస్. జనవరి 2013 ఆరంభం నుంచే కార్ల ధరలను పెంచేందుకు ఆటోమొబైల్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ధరల పెంపుపై ఇప్పటికే పలు కార్ కంపెనీలు తమ నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా కూడా వచ్చే నెల నుంచి తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. పతనమవుతున్న రూపాయి మారకపు విలువ, పెరుగుతున్న ఇంధన మరియు ఇన్‌పుట్ ధరలే ఈ ధరల పెంపుకు కారణమని కంపెనీ పేర్కొంది.

భారత మార్కెట్లో రెనో ఇండియా అందిస్తున్న పల్స్ హ్యాచ్‌బ్యాక్, స్కాలా మిడ్-సైజ్ సెడాన్, డస్టర్ ఎస్‌యూవీ, ఫ్లూయెన్స్ ప్రీమియం సెడాన్, కొలియోస్ ప్రీమియం ఎస్‌యూవీ మోడళ్లపై 1.5 శాతం వరకూ ధరలను పెంచనుంది. దేశీయ విపణిలో రెనో కార్ల ధరలు రూ.4.27 లక్షల (రెనో పల్స్ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధర) నుంచి రూ.23 లక్షల (రెనో కొలియోస్ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధర) రేంజ్‌లో ఉన్నాయి.

రెనో పల్స్

రెనో పల్స్

రెనో స్కాలా

రెనో స్కాలా

రెనో డస్టర్

రెనో డస్టర్

రెనో ఫ్లూయెన్స్

రెనో ఫ్లూయెన్స్

రెనో కొలియోస్

రెనో కొలియోస్


ఇప్పటికే మారుతి సుజుకి ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టొయోటా, జనరల్ మోటార్స్, హోండా కార్స్ ఇండియా, నిస్సాన్ ఇండియా వంటి కార్ కంపెనీలు వచ్చే ఏడాది ఆరంభం నుంచి తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి. కేవలం ప్యాసింజర్ కార్ కంపెనీలే కాకుండా మెర్సిడెస్ బెంజ్, ఆడి ఇండియా, బిఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ కార్ కంపెనీలు కూడా ఇదే నెపంతో ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. మొత్తమ్మీద కొత్త సంవత్సరంలో కొత్త కార్లు కొనుగోలుదారులపై అదనపు భారాన్ని మోపనున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, December 19, 2012, 12:10 [IST]
English summary
French car maker Renault India has announced the price hike of 1.5 per cent across its models from January 2013. Renault's entry-lever car Pulse hatchback, mid-size sedan Scala, flagship SUV Duster, premium sedan Fluence, high-end SUV Koleos will cost more Form Jan 2013. Prices of Renault cars in India range from Rs 4.27 lakh (ex-showroom Delhi) for the entry level Pulse to Rs 23 lakh (ex-showroom Delhi) for the Koleos.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+