పోప్ బెనడిక్ట్ 16కు ఎలక్ట్రి వాహనాన్ని బహుకరించిన రెనో
అంతేకాకుండా, రెనో తమ రెండవ ఎలక్ట్రిక్ వాహనాన్ని వాటికన్ సిటీ యొక్క జెండర్‌మెరీ క్రాప్స్‌కు డొనేట్ చేసింది. పోప్ తన సమ్మర్ రెసిడెన్స్ నుంచి ప్రయాణించేటప్పుడు ఈ వాహనాన్ని ఉపయోగించనున్నారు. 4.6 మీటర్ల పొడవు 1.8 మీటర్ల వెడల్పు ఉండే ఈ కారులో 44 కి.వా (60 హెచ్‌పి) ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా నడుస్తుంది. ఈ బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే 170 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
పోప్ కోసం ప్రత్యేకంగా ఇంటీరియర్లను డిజైన్ చేసేందుకు రెనో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కోచ్‌ల నిర్మాణ కంపెనీ గ్రువావ్‌తో చేతులు కలిపింది. ఈ పొడవాటి ఎలక్ట్రిక్ కారులో మొత్తం నాలుగు సీట్లు ఉంటాయి. వెనుక సీటులో ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు గాను వీటిని విశాలంగా, తీర్చిదిద్దారు.
పోప్ రోడ్డుపై వెళ్తున్నప్పుడు ప్రజలకు అభివాదం చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఓపెనింగ్ రూఫ్, తొలగించే వీలున్న వెనుక సైడ్ విండో, యాంత్రికంగా లోపలికి మడుచుకునే ఫోల్డింగ్ డోర్ స్టెప్స్ వంటి ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ కారు సొంతం. ఈ ఎలక్ట్రిక్ వాహనాలను బహుకరించడం ద్వారా రెనో ఇండియా పర్యావరణ కాలుష్యం గురించి ప్రచారం చేయడమే కాకుండా, తమ బ్రాండ్‌కు ఉచిత ప్రచారాన్ని సంపాధించుకుంది.


Click it and Unblock the Notifications









